స్థిరతిమిరం..

నీ అస్థిర చంచల మనసుతో తూకమేయకు నా ప్రేమను
కవాటాలే కంపించి హృదయమే కదలాడేను గారాభంతో
అంచనాలు వేసి అధికమించి దాటేయకు అనురాగకొలను
నీ అణువణువూ కరిగేను నా అనంత ప్రేమ సామ్రాజ్యంలో
వలపువలకి చిక్కిన మనసుకి వినిపించకు అలజడులను
మూగవైన భావాలు ఆగలేనని గొంతెత్తి పాడేను ఆవేశంతో
నీ స్వప్న జగత్తుకి రంగులు అద్దమనకు నా ఆశయాలను
సరిపెట్టుకోలేనంటూ విలవిలలాడేను వివరించలేక తనలో
అదే అలుసుగా గెలుపు నీది అనుకుని శాసించకు నన్ను
నీ అందలానికి నేను సోపానం కానని చింతించకు వేదనతో
తిమిరాల ప్రమిదనని తీర్పు చెప్పి నిందించకు నా ప్రేమను
సౌఖ్యాలు సమిధలైనా అణగారిపోయే కోర్కెలేం కోరుకోను...

22 comments:

  1. ఇంతక్రితం మనసులే చంచలం
    రాను రాను మనస్తత్వాలే అనిశ్చలం
    కాలానుగుణంగా మార్పు సహజం
    కాని కదిలే కాలానికి గంటలు యథాతథం
    మానసిక పరిపక్వత తోడైతే కన్నీరు సైతం పన్నీరే
    అయోమయం శంషయం ఎదురైతే మాట సైతం మౌనమే
    పిచ్చి మనసుకు ఏవేవో కొర్కెలు
    తిమిరంలో తడబడే పాదముద్రలు
    సంద్రం ఇసుకరేణువులు జీవితం కాలమైతే
    ఇసుక పై బాధని రాయాలనుంది.. కాలం కడిగేయగా
    రాళ్ళ పై జ్ఞాపకాలను చెక్కాలనుంది.. శిల్పం రూపు దాల్చగా
    అహ్నిలో అజ్యం పవిత్రతకు తార్కాణం.. ఇదే కాబోలు వేదనలో వేడుకగా కట్టే పదతోరణం..!

    కలహంస చిత్రం తో పదప్రయోగం ఆమోదయోగ్యంగానుంది పద్మగారు..

    ReplyDelete
  2. ఆడవారు అపర చాణుక్యులు ఆడి వాదించి గెలవలేము హా హా హా.

    ReplyDelete
  3. అద్భుతం మీ కవిత దానికి తగిన చిత్రం.

    ReplyDelete
  4. జీవితంలో స్థిరంగా ఉండగలమా చెప్పండి
    మీరు ఉండగలరు అంటే మాకు ఓకే :)

    ReplyDelete
  5. స్థిరమై ఒకే మాటకు కట్టుబడి ఉండడానికి మనుషులు భగవంతుడు కాదు. పరిస్థితులకు అనుగుణంగా అందరూ మారవసిందే తప్పదు. అనుకున్నవి అన్ని జరగాలి అనుకోవడం కూడా ఒక విధంగా నేరమే అవుతుందేమో..

    ReplyDelete
  6. మూగవైన భావాలు ఆగలేనని గొంతెత్తి పాడే-touche chesaru

    ReplyDelete
  7. నిర్ణయాలు తీసుకోవడం
    ఎదుటివారినుంచి ఆశించడం
    ఆలోచించి చేయవలసిన విషయాలు.
    చిత్రం ఎక్సలెంట్ అండీ

    ReplyDelete
  8. మనసు మనం కావాలి అనుకున్నవి ఎప్పుడూ దూరమయ్యేటట్లు మనల్ని చేస్తుంది. ఇది అర్థం చేసుకుని కోరినవి వద్దని అనుకుంటే సరిపోతుంది. పిచ్చిమనసు ఎప్పుడు మన మాట వినదు సుమ్మీ :)

    ReplyDelete
    Replies
    1. మనసుకి నచ్చేది.. ఒక్కోసారి కాలమనే వరదలో కొట్టుకుపోతుంది..మనసుకి అర్థం కాని విషయాలన్ని మనసు అర్థం చేసుకుంటుంది.. వెఱ్ఱితనమో ఏమో.. తెలిసి కూడా ప్రాకులాడుతు ఉంటుంది.. మనసు మాట మనం వినగలిగితే.. మనోగతం అవగతమౌతుంది.. లోలోపల దాచుకున్న భావాలన్ని ఊసులుగా చెప్పుకోలేక.. ఇబ్బడిముబ్బడిగా అక్షరాలన్నిటిని భావాలలో కలగాపులగం చేసి తనకి మౌనరాగమైనా నిస్తేజమైనా విషాదమైనా గాని ఓ కావ్యమా.. మాటలుగా చెప్పలేనివన్ని అక్షరాలుగా పేర్చి ఆబాలగోపాలన్ని అలరిస్తుంది.. తాను మాత్రం ఏకాకిగా మిగిలుంటుంది భావాన్వేషణలో

      రాగిణి గారు.. మీ వ్యాఖ్యను చూసి నాకు తోచిన పదవిన్యాసం చేశాను.. తప్పులేమైనా ఉంటే మన్నించండి..

      ~శ్రీ~

      Delete
    2. వెలకట్టలేని బంగారం కూడా గనిలో రాయే
      నడక నేర్చిన బాటసారికి ప్రపంచమంత ఇల్లే
      గడసుతనపు ఛాయలున్నవారి మనసు వెన్నయే
      అవాంతరాలొచ్చినా అధిగమించే గుణం మనోధైర్యమే
      నిప్పు కణిక చిన్నదైనా లోన దాగిన శక్తి అసమానమే
      నీడ వెంట వెలుగు అఖండమై ప్రజ్వలించే జ్యోతియే
      మనసు ముక్కలైనా మానవత్వం కలిగుండేది మంచితనమే
      మనషుల నడుమ భేదాలు తొలిగిన నాడు భూలోక స్వర్గమే

      Delete
  9. కాలం అన్ని మారుస్తుంది
    కఠినంగా చేస్తుంది..
    ఆనందాన్ని విషాదంగాను
    విషాదాన్ని మరిచేలా చేస్తుంది
    ఎక్కువగా ఆలోచిస్తే ..
    వేదాంత ధోరణి వస్తుంది
    అందుకే దేనికైనా చలించక
    యోగిలా మారితే బాగుంటుంది..

    ReplyDelete
    Replies
    1. వేడి నీరు ఒకటే
      కోడిగుడ్డును ఉడికిస్తే గట్టిపడుతుంది
      ఆలుగడ్డను ఉడికిస్తే మెత్తబడుతుంది

      రాగద్వేషం ఒక్కటే
      ఆనందం కలిగినపుడు ఆనందభాష్పాలవే
      దుఃఖం కలిగినపుడు కన్నీటి ఓదార్పులవే

      మానవ జీవితం ఒకటే
      అమ్మ పొత్తిళ్ళలో పురుడు పోసుకునేది ఇదే
      చివరి మజిలిలో కాటిలో కాలి భస్మమయ్యేది ఇదే

      Delete
  10. Beautiful picture with excellent lines padma.

    ReplyDelete
  11. జీవితం సర్దుబాటు అంతే.

    ReplyDelete
  12. ఏం కోరుకోను వరకు ఓకె
    అస్థిరం చంచలమని కోపం చూపితే ఇబ్బంది

    ReplyDelete
  13. నీ ఆనందానికి నేను సోపానం కాను కొత్తగా బాగుంది.

    ReplyDelete
  14. సాగరంలోనూ అలలు తప్పవు
    మనిషిగా పుట్టినప్పుడు సర్దుబాటు తప్పదు
    స్థిర తిమిరంలా ఉండిపోవడం అందరికీ చేతకాదు
    పెయింటింగ్ చాలా బాగుంది.

    ReplyDelete
    Replies
    1. "తడారిపోయి నేడు నేల బీటలువారిందే తప్పితే నవ వసంతాలు తనకే సొంతం."
      "మాటలురాక నేడు గొంతు మూగబోయిందే తప్పితే గలగల గోదావరి కృష్ణ తనకే సొంతం."
      "చిరునవ్వులేక నేడు మోము చిన్నబోయిందే తప్పితే ఆత్మీయ పలకరింపులు తనకే సొంతం."

      Delete
  15. అంచనాలు వేసి అధికమించి దాటేయకు అనురాగకొలను..హెచ్చరికా?

    ReplyDelete
  16. మరెన్నో భావాలను రాసేలా ప్రేరేపిస్తున్న అందరి స్ఫూర్తి వ్యాఖ్యలకూ నమోః వందనములు_/\_

    ReplyDelete