రెండు తొడలు మధ్యలోంచి తన్నుకునొచ్చి
ఆకలని ఏడుస్తూ రొమ్ములు రెండూ పీల్చి
కడుపునిండితే నువ్వు బోసినవ్వులు రువ్వి
జన్మతః స్వార్థంతో పెరిగి పెద్దదైన నీ ఒళ్ళు
ఆడదానిపై ఆధారపడ్డ పరాన్నజీవివి నువ్వు!
పెరిగినాక మీసాలు గెడ్దాలు నీకు పుట్టుకొచ్చి
అవయవాలు ఎదిగి ఆకలి ఆకారాలు మార్చి
ఆడది కనపడితే ఆత్రుతతో పెరుగు నీ కొవ్వు
కనపడని అందాలకై వెతుకుతాయి నీ కళ్ళు
జన్మస్థలమైన అంగానికై ఆరాటపడేవు నువ్వు!
ఆ ఆరాటంలో మగబుధ్ధి వక్రించి కోరిక పైకొచ్చి
నెరవేర్చుకునే నెపానికి భీభత్స మార్గాలు కూర్చి
కుదిరితే వశపరుచుకుని లేకుంటే బలాత్కరించి
ఆమె కట్టూబొట్టూ రెచ్చగొట్టెనను నీలోని కుళ్ళు
నిగ్రహం కొరవడి పైత్యంతో కొట్టుకున్నది నువ్వు!
చెప్పాలంటే శారీరకంగా రేప్ చేయబడ్డ ఆమె/అమ్మ
కుచితవైఖరితో మొత్తం బలాత్కరించబడ్డది నువ్వు!
ఆకలని ఏడుస్తూ రొమ్ములు రెండూ పీల్చి
కడుపునిండితే నువ్వు బోసినవ్వులు రువ్వి
జన్మతః స్వార్థంతో పెరిగి పెద్దదైన నీ ఒళ్ళు
ఆడదానిపై ఆధారపడ్డ పరాన్నజీవివి నువ్వు!
పెరిగినాక మీసాలు గెడ్దాలు నీకు పుట్టుకొచ్చి
అవయవాలు ఎదిగి ఆకలి ఆకారాలు మార్చి
ఆడది కనపడితే ఆత్రుతతో పెరుగు నీ కొవ్వు
కనపడని అందాలకై వెతుకుతాయి నీ కళ్ళు
జన్మస్థలమైన అంగానికై ఆరాటపడేవు నువ్వు!
ఆ ఆరాటంలో మగబుధ్ధి వక్రించి కోరిక పైకొచ్చి
నెరవేర్చుకునే నెపానికి భీభత్స మార్గాలు కూర్చి
కుదిరితే వశపరుచుకుని లేకుంటే బలాత్కరించి
ఆమె కట్టూబొట్టూ రెచ్చగొట్టెనను నీలోని కుళ్ళు
నిగ్రహం కొరవడి పైత్యంతో కొట్టుకున్నది నువ్వు!
చెప్పాలంటే శారీరకంగా రేప్ చేయబడ్డ ఆమె/అమ్మ
కుచితవైఖరితో మొత్తం బలాత్కరించబడ్డది నువ్వు!
స్త్రీలపై హత్యాచారం చేయడం ప్రస్తుతం కామన్ ట్రెండ్లా మారింది.
ReplyDeleteనిన్ను నీవు రేప్ చేసుకుంటున్నావు అంటూ మగవారికి చురకవేసారు.
చిత్రంలో ప్రస్ఫుటం చేసారు-అభినందనలు మీకు.
ఎవరికీ చురక వేయలేదండి..
Deleteనా హావాలను అక్షరీకరించాను అంతే..
నిజమే మనిషి క్రమేపీ దిగజారిపోతున్నాడు. మీరు ఒక ఫైర్ బ్రాండ్ అనిపిస్తుందండి. ఇలాంటివి వ్రాయాలంటే గట్స్ ఉండాలి. అది మీలో మెండుగా ఉందని మరోసారి ఫ్రూవ్ చేసారు పద్మార్మిత.
ReplyDeleteఅమ్మో అర్పితను ఫైర్ బ్రాండ్ అంటే మంటపుట్టిస్తుంది అంటారా :)
Deleteనిఖార్సైన పదభంగిమలతో, ఆలోచనాత్మకంగా వ్రాసే మీ కవితలు చదివి గుండె ఉప్పొంగితే ఒకోసారి ఆలోచనలతో మెదడు వేడెక్కుతుంది మేడంగారు.
Deleteఅక్కాచెళ్ళెల్ల పై అమానుషాలు ఎక్కువైనాయి
ReplyDeleteఆఫీసులో పనిచేసే దగ్గర అన్ని చోట్లా
పాటల్లోను మాటల్లోను అశ్లీలత పెరిగిపోతున్నది
ఇళ్ళలోను గుళ్ళలోను హత్యాచారాలే జరుగుతున్నవి
సమాజాన్ని చైతన్యవంతం చేసే పోస్ట్ రాసినారు, శభాష్!
అశ్లీలత అనేది అన్నింటా పెరిగిపోయింది...నిజమే
Deleteసమకాలిన లోకం తీరు దాదాపుగా ఎలా ఉందో తెలియజేశారు పద్మ గారు. పైపెచ్చు ఎవరి వలన జన్మ వరముగా లభించినదో వారి పట్ల అమానుషం దినదినం పెరుగుతు ఉండటం నిజంగా విచారకరం. కంటికి రెప్పలా కాచుకోవాల్సిన బాధ్యత కలిగిన సభ్య సమాజమే అభద్రతభావం పెచ్చుమిరేలా అసభ్యంగా ప్రవర్తించటం ఎంతో బాధాకరమైన విషయం. ఈ అనైతికత సమూలంగా వినాశనం కాగల్గాలి.. తన భార్యను తన అర్దభాగంగా జీవిత భాగస్వామిగా అనుకునే వారు ఆమే పట్ల సఖ్యతతో విధేయతగా.. తన తోబుట్టువులతో బాధ్యతగా.. తనకు జన్మనిచ్చిన అమ్మతో మర్యాదగా..తన శ్రేయస్సు కోరే స్నేహితురాలితో వినమ్రతగా ప్రవర్తించగలిగితే.. సమాజమే ఒక నందనవనమై భాసిల్లుతుంది.. ఆత్మసాక్షి వున్న ఏ ఒక్కరు దురాగతాలకు తావు ఇవ్వరు.. ఆడది ఆదిపరాశక్తి అని తెలిసిన ఏ ఒక్కరు సైతం ఆమె ప్రాధాన్యతను పెడచెవిన పెట్టలేరు.. ఆడవారిని దూషించే ద్వేషించే శోషించే పీడించే ఈ రుగ్మతను కూకటివేళ్ళతో పెకిలించి నవసమాజ నిర్మాణానికి నాంది పలకాలి.. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః ఆడవారిని ఎక్కడైతే గౌరవిస్తారో అక్కడ భగవంతులే సాక్షాత్కరిస్తారు. వారిని అవమానపరిస్తే ఎంతటి సత్కార్యమైన విఫలమే అవుతుందని తెలియజేస్తుంది మనుస్మృతి.
ReplyDeleteశ్రీధర్ మంచి ఆచరించే మాటలు వ్రాసారు.
Deleteథ్యాంక్యూ శ్రీనాథ్ గారు
Deleteయత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః ఆడవారిని ఎక్కడైతే గౌరవిస్తారో అక్కడ భగవంతులే సాక్షాత్కరిస్తారు. వారిని అవమానపరిస్తే ఎంతటి సత్కార్యమైన విఫలమే అవుతుందని తెలియజేస్తుంది మనుస్మృతి.correct.
Deleteపూర్వపు మనుషులు ఆచరించదగ్గ విషయాలెన్నో మన ముందుకు తెచ్చారు. కాకపోతే కాలక్రమేణ అవన్ని దాదాపుగా మరుగున పడుతున్నాయి సర్. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు పాశ్చాత్యులపై ఎంత ప్రభావితం చేస్తున్నాయో తెలియదు కాని.. అడపా దడపా పాశ్చాత్య సంస్కృతి మన నాగరికతపై కూడా నెగెటివ్ ఎఫెక్ట్స్ ఇస్తున్నాయి..
DeleteEven when we are culturally diversified, and under the name of global reformation, we, to the some extent are forgetting the reality and exhaustive importance of Indian Culture and Tradition.
Basically, In the Age of Forefathers they have made it possible to bring the rich values of Bhaagavatam, Bhagawadgeeta, Ramayan and Mahabharat.. Now these epics have been tailored to reach only the student fraternity for securing a degree, but, if they inculcate the correct essence of those scriptures, then we might have been called the sub-continent of people with richer values and wisdom, yes.. we are no less, even now, but, as the generation increments, the percentage of retention of goodness has seen a prominent decrement, due to which, moral and ethical values have seen a downfall.
Sridhar Bukya...చాలా బాగా వివరించారు...ధన్యవాదాలండీ.
Deleteచాలా రోజులకి కమెంట్లకు వన్-టు-వన్ రిప్లైలు ఇస్తున్నందుకు ధన్యవాదాలు పద్మ గారు
Deletethanks for your inspiring words Sridharji. :)
DeleteI am Always Humbled and Obliged,Padma Madam :)
Deletethank you...its my pleasure.
Deleteఏమిటో ఈ ఘోరలు
ReplyDeleteఅడుగడుగునా స్త్రీజాతి పై నేరాలు
కామాంధుల పని పట్టాలి
కఠినంగా శిక్షించాలి
ఆడవారి పై అత్యాచారం
లోకానికే అది తీరని అవమానం
పండు ముసలి తల్లి నుండి
పాలికారె పిల్ల వరకూ చెరచడం
కామాంధుల కళ్ళు పట్టి పీకాలి
మగవారికి ఒక హెచ్చరిక
ఈ నీ కవిత పద్మార్పిత.
మీ కవిత చాలాబాగుందండీ...ధన్యవాదాలు
Deleteఆడదానిపై ఆధారపడ్డ పరాన్నజీవివి..మగవాడు ఒప్పుకున్నా లేకున్నా ఇది నిజం
ReplyDeleteసాహో పద్మార్పితా...స్త్రీజాతి మాణిక్యానివి నీవు!
థ్యాంక్యూ..అయినా మనిషంటేనే ఒకరిపై ఒకరు ఆధారపడిన జీవులుకదండీ..:)
Deleteసమాజంలో స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ మంచివాళ్ళు చెడ్డవాళ్ళూ అంటూ రెండు రకాలు ఉంటారు. పద్మా కేవలం మగవాళ్ళే ఇలా ఉంటారు అనుకోవడం తప్పు. ఎందరో స్త్రీలు మానసికంగా పురుషులని భాధించి బలత్కరిస్తున్నారు, ఇది వినడానికి ఎబ్బెట్టుగా ఉన్నా ఒప్పుకోవలసిన నిజం. ఇక నీవు వ్రాసింది మృగగాళ్ళకే వర్తిస్తుంది...ఇలాంటి చర్యలకు పాల్పడేవాళ్ళకి ఆ పని చేసే ముందు వాళ్ళ అమ్మ అక్కాచెల్లిళ్ళ గుర్తుకొచ్చేలా వ్రాసావు, సూటిగా బాణాలు గుండెని గుచ్చుకునేలా చేసావు, కుడోస్ అభినందనలు-హరినాధ్
ReplyDeleteమీ అమూల్యమైన స్పందనలకు ధన్యవాదాలండీ..
DeleteXlant poetry on women abuse.
ReplyDeletethank you Sindoo
Deleteకుచితవైఖరితో మొత్తం బలాత్కరించబడ్డది నువ్వు
ReplyDeleteమాగాడి మార్పుకు నాంది కావాలి మీ వాక్యాలు.
లెస్స చెప్పినావు
Deleteనాంది కాకపోయినా మృగాడిలో మార్పు రావాలని ఆశిద్దాం.
Deleteచాలచక్కగా మంచిఉద్దేశంతో మంచిసందేశాన్ని ఇచ్చినారు, మీకు నా పూర్వకమైన ధన్యవాదాలు.
ReplyDeleteమీ స్పూర్తి వాక్యాలకు ధ్యాంక్సండీ
Delete"అవయవాలు ఎదిగి ఆకలి ఆకారాలు మార్చి
ReplyDeleteఆడది కనపడితే ఆత్రుతతో పెరుగు నీ కొవ్వు"
వ్రాయడానికి చెప్పడానికి పదాలు దొరకడంలేదు. పవర్ఫుల్ పదాలు మనిషి అన్నవాడి నరాల్లో తాకి ఒళ్ళు జలదరిచేల ఉన్నాయి అక్కడక్కడా మీ పదజాలం. చక్కని సమాజానికి పనికి వచ్చే పోస్ట్ వ్రాసి మెప్పించారు.
నిజానికి చిన్న పిల్లలని కూడా చూడకుండా బలాత్కరించారని న్యూస్ చదివినా విన్నా నాకు ఒళ్ళు జలదరించి మనసులో బాధగా అనిపిస్తుందండి.
DeleteNi paditya patimaku chetuletti namaskaristunanu.
ReplyDeleteMagajati alochanalaki chempadebba ee kavitha.
Savyamaina aalochanalaku srikaram chuttamani cheppinatlu.
Mrugarayulla vikruti cheshtalaki korada jhallipinchinatu undi.
సర్ మీరు తెలుగులో కమెంట్ రాసినందుకు ధన్యవాదాలు
Deleteమీ ప్రేరణా వాక్యాలు స్పూర్తిని ఇచ్చాయి.
త్వరలో తెలుగు లిపిలో కమెంట్ రాస్తారని అనుకుంటాను.
జన్మతః స్వార్థంతో పెరిగి పెద్దదైన నీ ఒళ్ళు
ReplyDeleteఆడదానిపై ఆధారపడ్డ పరాన్నజీవివి నువ్వు!
అధ్భుతం మీ అక్షరాలతో సంధించిన సూటిబాణాలు
మగజాతి వికృత చేష్టలకు చరమగీతంలా ఉంది..
జీవితం పొడుగునా ఎన్నో బంధాలు, బంధువులు, తోబుట్టువులు స్నేహితులు పరిచయం అవుతారు.. ఐతే వారందరి కంటే అమూల్యమైన అనూహ్యమైన పేగుబంధం అన్ని బంధాలలో హెచ్చు స్థానంలో ఉంటుందనటం లో ఎటువంటి సంషయం లేదు
Deleteఎందుకంటే పేగుబంధమే లేదంటే జీవితమే లేదు తక్కిన ఏ బంధము, బాంధవ్యము, బంధుత్వములు ఉండవు ఎట్ ది ఫర్స్ట్ ప్లేస్.. ఏ మదర్ ఇజ్ కాన్స్ టాంట్ సోర్స్ ఆఫ్ అడ్మీరేషన్.. ఇఫ్ షి టీచెస్ షి టీచెస్ ఏ జెనరేషన్.. ఇఫ్ ఏ ఫాదర్ టీచెస్ హీ టీచేస్ ఏ ఫ్యామిలి.. దట్ ఇజ్ దీ క్వింటెజెన్షియల్ రోల్ ఆఫ్ ఏ మదర్
Deleteతెలుగమ్మాయి..చాలారోజులకు బ్లాగ్ వైపు మీరాక.
Deleteమీ స్పూర్తిస్పందనలకు ధన్యవాదాలు.
మీలా ఏకధాటిగా వ్రాయడానికి మాకు కుదరదుగా అర్పితగారు. ;)
Deleteఅంతేనా లేక ఏం పనీపాటా లేక రాసేస్తున్నాను అంటున్నారా ?
Deleteమస్తుగ బద్నాం చేసిండ్రు మేడం మగాడిని
ReplyDeleteఏంచేస్తం దేవుడు మాకు మంచి బుధ్ధి బీ ఇచ్చిండు
అందర్ మీరు రాసినలెక్క ఉండరు మేడం
జర మా గురించి మంచిగా రాయుండ్రి గప్పుడప్పుడు
గిట్ల కమెంటిన నారాజ్ కాకుండ్రీ..
నిజం సెప్పాలంటే ఆడోల్లు లేకుంటే మాగతి లేదు:(
అరే భై జర ఊకో.. పద్మ గారు సంధించిన బాణం ఈయాల సమాజంల పెరుగుతున్న పైశాచికత్వాన్ని నెత్తికెక్కించుకునే మృగాళ్ళను ప్రస్తావించి.. గిసోంటివైన జూసి జర్ర గిట్ల వారిలో ఏ కోసానా ఇసుమంతైన మార్పు తేవాలని.. మీరు పరేశాని గాకుండ్రి.. గోల్కొండ బోనాల్ మస్తుగా జేసినరా.. ఔ.. గా తల్లి దీవెనల్ అందరి పై సల్లంగుండాల.. జై భద్రకాళి.. గంతే కదా పద్మ గారు.. బ్రహ్మ తలరాతను రాస్తే.. ఒక అమ్మ ఆ బ్రహ్మకే ప్రతిరూపమై నిలుస్తుంది.. తరాలెన్ని మారినా.. భగవంతుడే అమ్మగా అవనిపై సాక్షాత్కరించి.. అమ్మ ప్రేమను తాను కూడా చవి చూశాడు శ్రీరామునిలా ముగ్గురమ్మల మురిపాల బాలుడై.. కృష్ణునిలా ఇద్దరమ్మల కొంగు బంగారమై.. వేంకన్నలా వకుళ దేవి మానస పుత్రుడై..ధన్యులము కదా.. మనిషి జన్మ అమ్మ ఒడిలో మొదలు పెట్టి.. అమ్మ ఋణం తీర్చుకోలేనిది.. తాను రూపమిచ్చిన దేహంలోగల జీవాత్మ పునీతమై ఆ పరమాత్మతో సమం కాగా.. సర్వే జనాః సుఖినో భవంతు.. సర్వే సంతు నిరామయ.. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్మిష్చిత్ దుఃఖ భాగమభవెత్
Deleteఏదైనా తప్పుగా రాసి ఉంటే పద్మ గారితో పాటు ఇక్కడున్న వారందరు కూడా మన్నించాలని ప్రస్తావిస్తు..!
నేజెప్పింది అదే భాయ్
Deleteఆడోల్లు అమ్మలు లేకుంటే ఖేల్ కతం దుఖాన్ బంద్
జననీ మాతాజీ...చెడ్దపనులు చేసి బద్నాం అయ్యేది మగవారు..వాళ్ళకి వారు బద్నాం అయ్యి మేము చేసినాం అంటే ఏట్లా చెప్పుండ్రి.
Deleteపురుష అహంకారాన్ని అక్షరాల అస్త్రంతో పటాపంచలు చేసారు.
ReplyDeleteనా ఆవేదనే తప్ప పురుష అహంకారాన్ని కొల్లకొట్టాలని కాదండోయ్.
Deleteపద్మ భావజోరు అనన్యసామాన్యం అన్నట్లుంది.
ReplyDeleteఅద్భుతంగా రాసావు.....అభినందనలు నీకు
థ్యాంక్యూ సంధ్యగారు.
Deleteమగవాడు మృగమై ప్రవర్తిస్తే
ReplyDeleteమీరు వ్రాసింది చదివి
పుట్టింది ఆమె కడుపునని
తెలుసుకుని చదివి మారాలి.
అందరికీ అర్థమైయ్యే రీతిలో వివరణ బాగుంది.
మీ కలం వాడి వేడి రెండు సమ పాళ్ళలో ఉన్నాయి.
ధన్యవాదాలు మీ స్పందనలకు
Deleteపరాన్నజీవులు అంటూ మగవారి స్థానం వివరించిన విధానం మనసున్న ప్రతి మనిషిని కదిలించే విధంగా మీరు వ్రాసిన సంగసంస్కరణ రేకెత్తించే కవితాను అందించారు. అభినమస్సులు మీ అక్షరాలకు.
ReplyDeleteధన్యవాదాలు మీ స్పూర్తిదాయక స్పందనలకు.
Deleteమగవాడు మృగంలా ప్రవర్తిస్తే చెంప చెళ్ళుమనిపించేటట్లు ఉంది మీ పోస్ట్.
ReplyDeleteఫీలింగ్ గ్రేట్ అబౌట్ యువర్ వర్డ్స్ ఫ్రెండ్
ధ్యాంక్యూ మహీ
Deleteరెండు తొడలు మధ్యలోంచి తన్నుకునొచ్చి
ReplyDeleteఆకలని ఏడుస్తూ రొమ్ములు రెండూ పీల్చి
అవయవాలు ఎదిగి ఆకలి ఆకారాలు మార్చి
ఆలోచనలు రెకెత్తించారు అద్భుతంగా రాసి..
..గౌతమి
ధన్యవాదాలండీ గౌతమీగారు.
Deleteమృగత్వం పై ఎరుపెక్కిన పద్మార్పితాలు..!
ReplyDeleteరాజేశ్వరీగారు...నా బ్లాగ్ కు స్వాగతం.
Deleteమీ స్పూర్తి వాక్యాలకు ధన్యవాదాలు
మగాడిలో మృగాడి పై కోపం తో కొరడా ఝళిపించినా వాస్తవికతను మనసుకి హత్తుకునేలా రాసారు..అభినందనీయం మీ ప్రతీ వాక్యం.
ReplyDeleteకోపంతో కొరడా కాదండీ
Deleteఆవేదనతో అక్షరాలు రాసాను.
మనస్సు ఉన్న మగవాళ్ళు తలదించుకునేలా వ్రాసారు పద్మార్పితగారు. మీకు నమస్సుమాంజలి.
ReplyDeleteమనసున్న వారు తలదించుకోకుండా
Deleteమానవత్వం మరచిన మృగాడు మారితే బాగుండును.
రెండు తొడలు మధ్యలోంచి తన్నుకునొచ్చి
ReplyDeleteఆకలని ఏడుస్తూ రొమ్ములు రెండూ పీల్చి
కడుపునిండితే నువ్వు బోసినవ్వులు రువ్వి
జన్మతః స్వార్థంతో పెరిగి పెద్దదైన నీ ఒళ్ళు
ఆడదానిపై ఆధారపడ్డ పరాన్నజీవివి నువ్వు!
తీర్పు చాలా వాడిగా వెట్టిగా రాసినట్లు ఉంది ...అత్యంత ఆలోచనలు నిండిన పోస్ట్.
తీర్పు కాదు ఆవేదన వ్యక్తపరిచాను...థ్యాంక్యూ
Deleteరాయడానికి మాటలు లేవు.
ReplyDeleteఅత్యంత అధ్భుతంగా వ్రాసి ఆలోచింపజేసారు మనుషుల మెదడుని.
థ్యాంక్యూ వేరీమచ్ ఆకాంక్షజీ
Deleteరాయాలంటే కాలవసింది అక్షరాలనుకుంటా ఆకాంక్ష గారు.. చెప్పాలంటే మాటలుండవు.. మౌనం తప్ప.. సరదా వ్యాఖ్య.. ఏమనుకోమాకండి
DeleteSridhar Bukya...ఆకాంక్షగారు :) :)
Deleteఅవయవాలు ఎదిగి ఆకలి ఆకారాలు మార్చి..ఒక్క ముక్కలో సున్నతంగా మగాళ్ళ చెంప చరచినట్లుందండి.
ReplyDeleteధన్యవాదాలు.
Deleteనేటి పరిస్థితులకు అనుగుణంగా తిరుగులేని పోస్ట్ వ్రాసారు.
ReplyDeleteరోజు రోజుకీ మనుషులలో కోరికలు విపరీతధోరణిగా రూపాంతరం చెందుతున్నాయి.
కొందరిలోనైనా మార్పును కోరుకుందాము మీ పోస్ట్ ద్వారా.
పద్మార్పితా మీకు వందనములు.
ధన్యవాదాలు మీ స్పూర్తి వ్యాఖ్యాలకు
Deleteప్రేమ భావాలని పండించించే నీలో సమాజాన్ని ప్రశ్నించి సంస్కరణల వైపు నడిపించే చాతుర్యం ప్రజ్ఞ ఉండడం బహుప్రశంసనీయం.భావప్రకటన అమోఘం...అనిర్వచనీయం.
ReplyDeleteపదేళ్ళలోపు పిల్లని, వృద్ధులని కూడా చూడకుండా జరుగుతున్న అత్యాచారాలు బాధాకరం.
మీరన్నట్లు...ఇలాంటి విషయాలు విన్నప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది.
Deleteమీకు చేతులు జోడించి నమస్కారములు అమ్మ.
ReplyDeleteమీకు ప్రతినమస్కారం.
Deleteశభాష్...క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్.
ReplyDelete
Deleteథ్యాంక్స్..థ్యాంక్స్ ..థ్యాంక్సండీ
మీ రచనల్లో ఇది మాస్టర్ పీస్..CONGRATULATIONS
ReplyDeletethank you very much.
Deleteమాటల్లేవు
ReplyDeleteచదివి అచేతనం అవడం తప్ప
పురుషులు అందరినీ కడిపడేసారు
మాటలు లేవని అంటూనే పురుషులని కడిపడేసానని నిందవేసారుగా :)
Deleteఆడదానిపై ఆధారపడ్డ పరాన్నజీవివి నువ్వు
ReplyDeleteఆడది కనపడితే ఆత్రుతతో పెరుగు నీ కొవ్వు
జన్మస్థలమైన అంగానికై ఆరాటపడేవు నువ్వు
ప్రతీపదం దేనికదే వాడిగా సంధించిన బాణం
మీకే చెల్లును ఇలా వ్రాయడానికి ధైర్యము
నిర్మొహమాటంగా వ్రాసిన నిజాలు....కుడోస్
మొహమాటం ఎందుకండి భావావేదనకి...థ్యాంక్యూ
Deleteమీ భావాక్షర రూపాలకు నా సాష్టాంగప్రణామములు.
ReplyDeleteఅమ్మో ఇంత భారమా :)...థ్యాంక్యూ
DeleteSree andariki namaste.
ReplyDeletemeeku kudaa..
Deleteమరో అధ్భుతం సృష్టించారు
ReplyDeleteథ్యాంక్యూ
Deleteఆడదానిపై ఆధారపడ్డ పరాన్నజీవి-గ్రేట్ లైన్ పద్మార్పితగారు.
ReplyDeleteధన్యవాదాలు మీకు
Deleteఈ పోస్ట్ మిమ్మల్ని ఎంతో ఎత్తుకి తీసుకుని వెళ్ళినట్లుంది.
ReplyDeleteనేటి సమాజానికి సరిపడే పోస్ట్ వ్రాసారు.
ఎంత ఎత్తుకి ఎదిగినా క్రింద ఉండ వలసిందే కదండీ..కొందరైనా మారితే సంతోషం
DeleteGreat Post
ReplyDeletethank you.
Deleteస్త్రీ....అద్భుత అభివర్ణన వేదనావేశంతో.
ReplyDeleteధన్యవాదాలండీ మీకు.
Deleteనమ్మసక్యం కాని నిజాలు
ReplyDeleteనీకు సాధ్యమని తెలిపిన కావ్యం.
గోవర్ధనశర్మగారు...మీ బిజీ షెడ్యూల్లో కూడా ఇలా నా బ్లాగ్ చూడ్డం నాకు ఎంతో ఆనందం. థ్యాంక్యూ వెరీ మచ్.
Deleteమీరు వ్రాసిన ఈ అధ్భుతమైన పోస్ట్ కు గౌరవ సూచకంగా గాలిలో 101 సారులు తుపాకీని కాలుస్తున్నాను అందుకోండి.
ReplyDeleteధన్యవాదాలండి.. గాలిలో తూటాలు కాల్చి అదీ 100 కాల్చి వేస్ట్ చేయకండి.
Deleteచాలా అధ్భుతంగా వ్రాసారు
ReplyDeleteI missed this excellent post.
ధన్యవాదాలండి..
Deletemeeku namaste
ReplyDeletemee post ku pedda namaste.
thank you.
Deleteమీకు అక్షరాలకు పాదాభివందనములు.
ReplyDeleteAwesome Padmarpitagaru
ReplyDelete