జీవన పజిల్

జీవితం ఒక రంగుల రూబిక్స్ క్యూబని తెలిసె
చెల్లాచెదురుగా పడున్న రంగుల చతురస్రాలని
వరుసక్రమంలో ఆకర్షించేలా సర్దబోవ అనిపించె
చూస్తే ఇంపుగా ఉండి ఆడుకునే ఒక పజిలని
అటుదిటు తిప్పి సరిచేస్తే అన్నీ ముక్కలేనని!

జీవితాన్ని మక్కువతో మొక్కి కొనసాగితే తెలిసె
ఒకేరంగున్న ఘనాలైన ఒక్కచోట కలిసుండవని
చూడబోవ త్రిమితీయ రూపాలతో తికమక పెట్టి
పారాహుషార్ అంటూ సంకేతాలు అందిస్తాయని
చదువబోతే అన్నీ అర్థంకాని కోడ్ భాషాక్షరాలని!

జీవితంలో సమస్యలు స్పష్టంగా కనబడితే తెలిసె
బ్రతుకైనా పజిలైనా పరిష్కరించాల్సింది మనమని
జనాలు ఎదుగుతుంటే నాలుగు రాళ్ళురువ్వి నవ్వి
వీలుకుదిరితే క్రిందకు దించే ప్రయత్నమే చేస్తారని
కష్టాలని కాలితో తన్నితే జీవితం కుదుటపడునని!

79 comments:

  1. రంగుల రుబిక్స్ క్యూబ్ తో ఝంఝాటం
    కాని రంగులన్ని వరుసగా అమర్చాలని ఆరాటం
    జీవితం రాగద్వేషాల కలగాపులగం
    ఏ ఒక్కటి మిస్ ఐనా అతలాకుతలం

    అపుడపుడు జీవితం జిగ్సా పజిల్
    ఏ ముక్క ఎక్కడుందో వెదికే లోపు హడల్
    అన్ని ఆకారాలు ఒక్కలా ఉన్నా కావు మింగిల్
    బంధాలన్ని యేనాటికైనా ఒక్క తాటిపై నిలిచేనని జింగిల్

    అపుడపుడు జీవితం అనిపిస్తది పొడుపు కథ
    అల్లకల్లోల ఆలోచనలతో భారమైన మానసిక వ్యథ
    సమాధానము తెలిసినా గాని మెలికలతో మోత
    సమస్య చిన్నదే కాని చిక్కుముడులతోనే వాత

    పద్మ గారు.. కవితల తోరణం తో ఎన్నో రకాలుగా అలరిస్తు.. నిరంతరాయముగా మీ కవిత సుమఝరి.. ప్రతి ఒక్కరి మన్ననలు పొందాలని ఒక శ్రేయోభిలాషిలా కోరుకుంటు.. మీకు టీచర్స్ డే విషెస్.. ఎప్పటిలానే మీ కవిత దానికి తగట్టుగా చిత్రం చాలా బాగుంది..

    ~శ్రీ~
    రామదూత రామబంటు

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్యూ వెరీ మచ్. మీ ప్రోత్సాహ ప్రోధ్బలాలే నాతో ఇలా రాయిస్తున్నాయి. ధన్యురాలిని.

      Delete
  2. Replies
    1. Sorry to say this..I don't know Arabic nor Urdu. More over this blog is for telugu knowing people.

      Delete
  3. జీవితంతో ఆడుకోవడం ఆషామాషీ కాదు పద్మగారు.

    ReplyDelete
    Replies
    1. అనితరమైన వాటితో ఆడుకోవడమే గొప్ప.

      Delete
  4. జీవితంతో మనం ఆడుకోకపోతే అది మనతో ఆడుకుంటుందని బాగా సెలవిచ్చారు.
    అందరికీ ఆడుకుని గెలవడం సాధ్యం కాదండీ.

    ReplyDelete
    Replies
    1. కష్టపడి సాధ్యం చేసుకోవాలి అదే అసలైన కిక్ :)

      Delete

    2. కిక్ టూ నా త్రీ నా పద్మార్పిత గారు :)

      జిలేబి

      Delete
    3. 3 కిక్ స్పెషల్ ;)

      Delete
  5. Outstanding words with awesome poster.

    ReplyDelete
  6. జీవితం పజిల్
    పరిష్కారం ప్లే
    బాగుంది లైఫ్.

    ReplyDelete
  7. "ఒక పరిష్కారం కాని పజిల్ వలె అందమైనది జీవితము"

    ReplyDelete
    Replies
    1. పరిష్కరించి అందం చూడాలి.

      Delete
  8. పద్మా ప్రస్తుతం లైఫ్ నాతో ఆడుకుంటున్నది.దాని ప్రతిబింబంలా మలచావు నీ కవితని
    కష్టాల కాలితో కిక్ చేయనులేను. జాబ్ వదల్లేని పరిస్థితి, ఎప్పటికి సెట్ అవుతుందో?

    ReplyDelete
    Replies
    1. ఈ స్టేజ్ ప్రతి మనిషికీ ఎప్పుడోకప్పుడు తప్పదండి సంధ్యగారు.
      మీరు చాలా నిబ్బరం గుండెధైర్యస్థులు...గుడ్ లక్

      Delete
  9. జీవిత పజిల్ విప్పడం సులభమా

    ReplyDelete
    Replies
    1. ఈజీగా ఉంటే ధ్రిల్ ఉండదుగా :)

      Delete

  10. జీవితపు పజిలు విప్పగ
    ఓ వనితా సాధ్యమౌన ? మోకరిలదగు
    న్బోవె సుఖమయముగ బతుక
    నీవున్ మహిలో జిలేబి నిక్కంబిదియే !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జీవితపు పజిల్ విప్పలేను కనుకనే ఈ ప్రగల్భాలు..చేయలేని వారే చాటంత చేసి చెబుతారు అంటారా? కానివ్వండి :)

      Delete
  11. పోనీలెండి..కొన్ని సారూప్యత గల పక్షులైనా పద్మార్పిత గూటికి ఈ విదంగా చేరుతున్నాయి.

    ReplyDelete
    Replies
    1. మీరు సాదాసీదా సింపుల్ మనసు/మనిషి అని తెలిసె..థ్యాంక్యూ

      Delete
  12. హయ్యారే హవ్వ...జీవితాన్ని కాలితో తన్నమందువా ఎంత మాటంటివి.

    ReplyDelete
    Replies
    1. బుద్ధిగా ముద్దుగా చెబితే విననప్పుడు తప్పదుగా

      Delete
  13. పారాహుషార్ అంటూ సంకేతాలు అందిస్తాయని
    చదువబోతే అన్నీ అర్థంకాని కోడ్ భాషాక్షరాలని

    ReplyDelete
    Replies
    1. Transmitting Signal: Hello
      Receiving Signal: *%_%* °○°

      :) RK Gaaru (:

      Delete
    2. అంతే కదండీ..జాగ్రత్తగా ఉండూ అంటూ వివిధ రూపాల్లో సంకేతాలు పంపుతాయిగా.

      Delete
  14. బ్రతుకైనా పజిలైనా పరిష్కరించాల్సింది మనమే
    ఈ ఒక్క లైన్ చాలు బ్రతుకు సక్రమంగా గడపడానికి

    ReplyDelete
    Replies
    1. ఎవరో వచ్చి ఏమీ చేయరు కదండీ

      Delete
  15. జీవన ప్రహేళిలో ప్రయాణించాల్సిన దూరం చాలానే ఉంది. ప్రతి మలుపులో ఇలా దుఃఖాన్ని తన్నేస్తూ సాగిపోవడమే కదా జీవితం.... సూపర్ అర్పిత గారు... సలామ్!!

    ReplyDelete
    Replies
    1. తన్నగలమో లేదో కష్టమో కానీ...ప్రయత్నించడం అయితే మానేయవద్దు కదండీ... thank you.

      Delete
    2. చాలా చాలా దన్యవాదాలు ఫ్యాన్స్ బ్లాగర్ కు నేను వ్రాసిన పంక్తులు తీపిగుర్తులుగా పోస్ట్ పెట్టినందుకు.

      Delete
  16. జీవితాన్ని ఊహించి
    కలగంటే కల్లలు అవుతాయి
    కష్టాలను కాలరాసి సాగితే
    కొంత సాంతనైన మిగులుతుంది
    కాలం అన్నిటికీ పరిష్కారం చూపి
    జీవించే మార్గం చూపుతుంది
    ప్రయత్నించి పట్టుదలతో సాధిస్తే
    విజయంతో పాటు విజ్ఞాం పెరిగి
    మరికొందరికి మార్గదర్శం అవుతాం
    కష్టాలని తట్టుకోలేమని ఏడిస్తే
    కృంగిపోయి ఎవ్వరికీ పనికిరాము..

    ReplyDelete
    Replies
    1. ప్రయత్నిస్తే ఫలితాలు బాగుంటాయని కవిత రూపంలో బాగాచెప్పారు. ధన్యవాదాలండి.

      Delete
  17. ఇంతకీ జీవితపు రూబిక్స్ క్యూబ్ లో మీకిష్టమైన నలుపు ఉందా??
    లేదా రంగుల్లోనే కాంప్రమైజింగా...జింగా లలా?

    ReplyDelete
    Replies
    1. తెలుపు/White, ఎరుపు/Red, నీలం/Blue, ఆరెంజ్/Orange, ఆకుపచ్చ/Green, పసుపు/Yellow మొత్తం ఆరు రంగుల మిళితం ఈ రూబిక్స్ క్యూబ్...అనుకుని ఇష్టమైనవి ఉండక దక్కకపోవడమే జీవితం కదండీ...ఏముంది పట్టుదలతో కావాలి అనుకుంటే ఏదో ఒక రంగుకి నలుపు స్టికర్ అంటించడమే...లేదా ఉన్న రంగుల్లో దేన్నో దాన్ని ఇష్టపడ్డమే. అయినా అన్ని రంగులకూ మూలం తెలుపు మనసు తెలుపైతే చాలులెండి.

      Delete
    2. పద్మార్పితగారు తెలుపు రంగు వక్రీభవనమే ఇన్ని రంగులు..ఎంతో అద్భుతంగా ఉంది మీ వివరణ

      Delete
  18. ఒకే రంగు ఉన్న ఘనాలు ఒక చోట ఉండవు అలాగే మనుషులు అంతా కలసి ఉండరని నిఘూడమైన అర్థాన్ని ప్రతిబింబింప జేసారు. మీ కవిత ఎప్పటి వలనే ఆలోచనాత్మకం.

    ReplyDelete
    Replies
    1. మీ అభిమాన స్పూర్తి వాక్యాలకు ధన్యవాదాలు.

      Delete
  19. ఒక్కసారి గెలిస్తే మానేయముగా మళ్ళీ మళ్ళీ గెలవ్వాలి అనుకుంటాము. అలాగే ఒక్కసారి ఓడిపోయామని మానేయకూడదు పద్మా...ఏదేమైనా ఆడుతూనే ఉండాలి జీవితమైనా ఆట అయినా సరే. Correct

    ReplyDelete
    Replies
    1. మీరు చెప్పింది సత్యం.
      ఆపక ఆడుతూనే ఉండాలి

      Delete
  20. నమస్కారం _/\_
    మీ బ్ల్లాగ్ కూడలిలో కలుపబడింది. http://koodali.club/
    తెలుగు సాహిత్య ప్రియులను, బ్లాగ్ లోకంలో తెలుగు నెటిజన్లను మరియు ఎంతో మంది బ్లాగర్లను పరిచయం చేసిన 'కూడలి' అగ్రిగేటర్ అస్తమయం అవడం అందరికీ బాధ కలిగించింది. కూడలి లేని లోటును ఎన్నో తీరుస్తున్నా, దానికి అలవాటుపడ్డ వారు మాత్రం నైరాశ్యంతోనే ఉన్నారు. ఆ లోటును తీర్చడానికి కొంతవరకూ చేసిన ప్రయత్నమే ఈ కూడలి.క్లబ్ http://koodali.club/

    కూడలి.క్లబ్ ని మీ బ్లాగులో జత చేయగలరు.

    ReplyDelete
    Replies
    1. మీరు కూడలి లేని లూటును పూరించారు
      మీ ఈ ప్రయత్నానికి నా హృదయపూర్వక వందనములు.

      Delete
  21. అర్పిత మనం ఆలోచించే విధానాన్నిబట్టి స్థితి మారుతుంది. జీవితం నిండా రోజూ బోలెడన్ని పజిల్స్ థ్రిల్స్ ఇంకా ఎన్నో అడ్డంకులు వాటిని ఆడడమే మన వంతు గెలుపు ఓటమి మనచెతుల్లో ఉండదు. దేన్నైనా స్వీకరించడమే తప్పదు.ఆటవస్తువును ఉపమానంగ వాడి చక్కని పోస్ట్ వ్రాసావు. అభినందనలతో-హరినాధ్

    ReplyDelete
    Replies
    1. మీ అమూల్యమైన అభిప్రాయాలకు ఆశీర్వచనాలకు ధన్యవాదములు

      Delete
  22. అదృష్టవంతులకే జీవితంలో సమస్యలు స్పష్టంగా కనబడేది లేకుంటే మాబోటి వారికి తెలియకుండానే సమస్యలు వచ్చి పడతాయి ఇష్టమైన కష్టమైన అడవలసిందే. చిత్రం చాలా చక్కగా నప్పింది.

    ReplyDelete
    Replies
    1. అదృష్టం దురదృష్టం అనుకోవడం అంతా మన ఆలోచనల్లో ఉందండీ.thank you.

      Delete
  23. మీరెలా రాస్తారో చెప్పడానికి పైన కామెంట్లే చాలు ..కానీ మీరు ఎంచుకొనే అంశం .. వాహ్ .. మీరు స్పృశించని అంశం అంటూ బహుశ మిగలలేదు

    ReplyDelete
    Replies
    1. మీరు మరీ పొగిడేస్తున్నారు
      అభిమానం అలా మీతో అనిపిస్తుంది కానీ నాకు తెలిసింది చాలా తక్కువండీ. బ్లాగ్లో మీ కమెంట్ ఆనందదాయకం. థ్యాంక్యూ

      Delete
  24. ఏ వస్తువైనా మీ కవితల్లో ఇముడయింపచేసి వాటికి ప్రాణం పోస్తారు
    అలా ఈసారి ఒక ఆటపరికరం తీసుకుని జీవితాన్ని దానితో ముడివేయడం చాలా బాగుంది పద్మగారు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండీ మీ ప్రేరణా వాక్యాలే నాకు స్పూర్తి.

      Delete
  25. కను వీడిన కన్నీరు
    బూడిదలో పోసిన పన్నీరు
    చేజారిన స్నేహం గడచిన కాలం
    నిజాయితి గల ఆత్మీయ బంధం
    తాలుకు విలువ కోల్పోయాకే తెలిసేది
    కాదనలేని సత్యమిది

    ReplyDelete
    Replies
    1. అక్షర సత్యాలు రాసారు.

      Delete
  26. కాలితో తన్నితే కుదుటపడే కష్టాలు..నిజమైతే ఎంత బాగుంటుంది.

    ReplyDelete
    Replies
    1. అలాగని అయిన వాటినీ కానివాటినీ తన్నితే కష్టమేనండీ :)

      Delete
  27. Bagundi blog kanulaku vindu chestu.

    ReplyDelete
  28. రూబిక్స్ క్యూబ్ ఆటలాంటిది జీవితం అన్ని సక్రమంగా గళ్ళలో ఉంచితే జీవితం పరిపూర్ణం. ఇలాంటి అద్భుతమైన ఆలోచన రావడమే తడవుగా దాన్ని అందమైన అక్షరాల్లోకి మలచి ముందుంచారు. శభాష్..మీకు మీ కవితకు దానికి అతికినట్లుగా అందించిన చిత్రానికి.

    ReplyDelete
    Replies
    1. మీ అభిమానంతో కూడిన ప్రేరణా వాక్యాలకు అభివందనములు.

      Delete
  29. గిట్ల తెల్వని ఆటలు ఏం ఆడేది తెలిసిన ఆట గిల్లిదండా లెక్క జీవితమని సెప్పరాదుండ్రీ

    ReplyDelete
    Replies
    1. పేరు ఏదైనా ఆట ఏదైనా జీవితం ఆడవలసిందే...నేను చెప్పేది ఏముంది సెప్పుండ్రీ. నమస్తే

      Delete
  30. బ్రతుకైనా పజిలైనా పరిష్కరించాల్సింది మనం..నైస్ లైన్

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్యూ గౌతమీ

      Delete
  31. జీవితమే ఒక అట
    అది వెలుగు నీడల సయ్యాట
    ఆట ఆగిందా
    ఒక సీటు గోవిందా
    అన్నారు ఒక సినిమా కవి.

    ReplyDelete
    Replies
    1. పెడ్డవారు చెప్పిన మాటలు ఆణిముత్యాలు.

      Delete
  32. ఊపిరి ఉన్నంత వరకు ఆడక తప్పని ఆట జీవితం
    అది రూబిక్స్ క్యూబ్ అయినా చదరంగమే అయినా
    అన్నిరంగులు సమ్మేళం అంతు చిక్కని జీవితం
    ప్రణయాలు పంతాలు వ్యామోహపు చింతలు
    జననం మరణం చివరికి అంతమవడమే జీవితం

    ReplyDelete
    Replies
    1. శర్మగారు మీ అనుభ అమ్మూల్య అభిప్రాయాలని కాదనగలమా. మీకు శతాభివందనములు

      Delete
  33. Life is like a Rubik's cube, you go through twists and turns, but there is always a solution (జీవితం ఒక రూబిక్స్ క్యూబ్ లా ఉంటుంది, మలుపులు మరియు మెలికలు. కానీ తప్పక ఒక పరిష్కారం ఉంది)
    The game of life has two participants...spectators and players. Pick one.

    ReplyDelete
  34. మీరు స్మురించని అంశంపై నేను వ్రాయాలని కోరిక
    తీరునా ఇది పద్మార్పితగారు..?

    ReplyDelete
  35. జీవితం ఇది ఒక్క ఆట కాదు అన్ని అటల సమ్మేళనము.

    ReplyDelete
  36. ఈ గేం సూపర్ నచ్చింది నాకు

    ReplyDelete
  37. రూబిక్ క్యూబుకీ వేదాంతానికీ ముడిపెట్టి
    భలే కవిత రాశారండీ!
    పద్మార్పిత అంటేనే రమ్యార్చన కాబోలు!

    ReplyDelete


  38. రూబిక్ క్యూబుకు భళిభళి
    శోభిలు వేదాంతమునకు సోకుల్మాడన్
    మా బాగుగా ముడెట్టా
    రే! పద్మా !మీకు సాటి రెప్పంబెవరే !

    జిలేబి

    ReplyDelete