ప్రేమలో పీ.హెచ్.డీ

పొంగేటి పరువాల పట్టా చేతబట్టుకుని
మిడిసిపాటు వయ్యారంతో ప్రేమించబోతే
వలపుల ఓనమాలు చేయిపట్టి దిద్దించి
ఒడిలోన వేడి సెగరేగితే నిగ్రహమంటావు! 

మురిపాల ఈడు కంటపడనీయక దాచి

ఆశలే అణచి అలరించక అత్తర్లే చల్లబోతే 
సరసాక్షరాలు సరిగ్గా వ్రాయమని సైగచేసి  
కుసుమించే గంధమని తనువు తడిమేవు!

వయసు వసంతం వలపు బాణం వేయ

అందాలు హారతై నీకు దాసోహమనబోతే 
అధరపు అంకెలతో ఎక్కాలు వల్లించమని
ఎడబాటులో ఏబీసీడీలు నేర్పుతానంటావు!

అవునంటే కాదనే భోధనలతో తికమకపడి

పదాలు పైటజార్చి నిన్ను పెనవేసుకోబోతే 
హద్దులు అన్నీ చెరిపేసి ముద్దులెన్నో ఇచ్చి 
మొత్తానికి ప్రేమలో పీ.హెచ్.డీ చేయించావు!     

28 comments:

 1. !*_*!

  మీ పద విన్యాసానికి దానికి ధీటుగ సరితూగే చిత్రానికి
  ఏమీ కమెంటాలో తెలియక తికమక
  అక్షరాలన్ని భావాలతో కలగలిసి ఉర్రూతలూగిస్తే
  చిత్రం పరిపరి విధాల ముచ్చట గొలిపిస్తోంది

  జీవితములో ముఖ్యమైన ఘట్టాలను ఏర్చి
  వాటి వాటి ప్రాముఖ్యతను పదాలలో కూర్చి
  అంచెలంచెలుగ ఒకరి పై మరొకరికి నమ్మకం ఉండాలని
  ఒక్కో జీవితపు మెట్టు అధిరోహిస్తు ఉండాలని
  పరిపక్వత కలిగిన మంచి మాటలను మరులు గొలిపే చిత్రం తో రంగరించటం అది మీకే చెల్లుతుంది పద్మ గారు.

  అమ్మ కడుపున జన్మ పొందినపుడు నర్సరి
  అమ్మ మాటలు నేర్పుతున్నపుడు ప్రైమరి
  నాన్న సంస్కారము నేర్పుతున్నపుడు సెకండరి
  మన గురించి వేరొకరు మంచిగా చెబుతున్నపుడు ప్రీ వర్సిటి
  బంధాలలో పరమార్థం తెలుసుకున్న నాడు వర్సిటి
  జీవితాన్ని భాగస్వామితో పంచుకున్నపుడు గ్రాజ్యుయేషన్
  జీవితమంత సంతోషాలను బాధలను సరి సమానంగ చూసిన రోజున పోస్ట్ వర్సిటి
  మరి ఇదే కదా జీవితానికి దేవుడు నేర్పే చదువు
  బంధాల అనుబంధాల బాంధవ్యాల ఆత్మీయతల కొలువు

  ~శ్రీ

  ReplyDelete
  Replies
  1. బృందావనిన మృదు మంజుల రవళుల నూపూర నాద విన్యాసం
   ఆఘమేఘాలపై రాధరమణుడు అందియల సమ్మోహన రాగానికై వేచే మధువనిన రాధికమనోహరుడై ముకుంద వాసుదేవ చక్రపాణి

   Delete
  2. కాలుష్యరహిత పంచభూతహిత పండుగకు ఘన స్వాగతం దీపావళి శుభాభినందనలు పద్మ గారు..!
   ది ఈ-వాళి: డిలైట్-ఫుల్ ఎకొనామికల్ ఎకొలాజికల్ ఎలెక్ట్రానిక్ వెదర్-ఫ్రెండ్లి ఆస్పిషియస్ లాంగ్-లాస్టింగ్ ఇన్స్ పైరింగ్ ఫెస్టివల్ ఆఫ్ లైట్ యాండ్ ప్రాస్పరిటి.

   Delete
 2. పరువం పదాల్లో కురిసి పరువశింపజేసింది.
  చిత్రంలో పడతి చూడ ముచ్చటగా ఉంది...

  ReplyDelete
 3. పడతి పరువాలు పొంగి
  పులకరించేను పువ్వులై..

  పరవశాన్న పదాలుగా మారి
  పరిమళించేను నీ కవితై..

  పగలే వెన్నెలగా తోచే
  ప్రకృతే కురిసె వానజల్లై..

  ReplyDelete
 4. అర్పిత అల్లరిచేసె అందమైన అమ్మాయి
  అక్షరాలు అల్లడంలో అందెవేసిన చేయి
  చలోక్తులు చలాకీ కవితలు నీ సొంతం!

  ReplyDelete
 5. నవ్వుల నాగమల్లి కవితల కల్పవల్లి మీరు. beautiful & lovely presentation.

  ReplyDelete
 6. love guru సంధించే ప్రణయాక్షర బాణాలకు
  హృదయకుసుమాలు
  రాలిపడి
  విలవిల లాడుతున్నాయి

  ReplyDelete
 7. love guru సంధించే ప్రణయాక్షర బాణాలకు
  హృదయకుసుమాలు
  రాలిపడి
  విలవిల లాడుతున్నాయి

  ReplyDelete
 8. పరువాల పడతిని ఒదిలి పరిపరివిధముల సాకులు వెతికెనేలనో ఆ అల్పజీవి.

  ReplyDelete
 9. ముట్టుకుంటే ముద్దువీణ..ఓ
  హత్తుకుంటే హాయి వీణ...ఓ
  పడుచుగుండేకు పల్లవి తానై
  పడతి నడకకు చరణం తానై
  జాణలో వీణలే..జావళీ పాడనీ

  ReplyDelete
 10. పులకరింతలు రేపుతావు
  పలకరిస్తే పారిపోతావు
  తళుకులెన్నో ఆరబోస్తావు
  అందకుండా జారుకుంటావు
  ముద్దులెన్నో మూటగట్టి పెట్టి
  కన్నుకొట్టి ఉసిగొలిపాను అంటావు
  పరువాల జావణి నీకిది తగునా?
  మీ కవితకు...నా కమెంట్

  ReplyDelete
 11. ఎడబాటులో ABCDలు ఆహా ఓహో............... :) :)
  కోపంలో ఆంగ్లభాషను అనర్గళంగా మాట్లాడేస్తారు ఇలాగే అనుకుంటాను
  ఎదైనా ఇలాంటి కవితలు వ్రాయడంలో మీది అందెవేసిన చేయని ఋజువు చేసారు.

  ReplyDelete
 12. భంగిమలు గంగ పొంగులుగా హావ భావములు నింగి రంగులై పరువాల పున్నమి వచ్చి తన సోయగాల వెన్నెలని కురిపిస్తున్నట్లు కవితలో రసఝరులు జాలువారెను.

  ReplyDelete
 13. సొగసైన అందాలు తనివితీరా విందు చేసుకొమంటుంటే..
  మది తడబాటుతో ఎడబాటు పాఠాలు నేర్పుతానంటాడేమి ఖర్మ..!

  ReplyDelete
 14. గుండెలో వలపు తూటాలు గుచ్చేసినారు.

  ReplyDelete
 15. చాలామంది మొదటి తరగతి పాఠాలు చదువుతూనే ఆపివేస్తారు.
  మీరు PhD..పూర్తి చేయడం గ్రేట్

  ReplyDelete
 16. పొంగేటి పరువాల పట్టా చేతబట్టుకుని..ఆరంభ అక్షరాలే అదరగొట్టారు.

  ReplyDelete
 17. పద్మగారు అన్యాయం..........
  పీ.హెచ్.డి పూర్తి చేసి పార్టీ ఇవ్వరా?
  అంతర్లీనంగా మహిళ మనసు తెలియపరిచారు.

  ReplyDelete
 18. మీ శైలిలో బాగుంది కవితాచిత్రం
  అభినందనలు పద్మార్పిత

  ReplyDelete
 19. నీ రచనలు చదివితే
  మనసున పులకించె జల్లు
  ఎంతో హాయి ఆ హరివిల్లు
  నీ రసరమ్య వాక్యాలు
  సిరి సిరిమువ్వల ఘల్లు
  పరవశంగా నర్తించి ఒళ్ళు

  ReplyDelete
 20. చినదాని తలపులు బహు చిత్రము,పిలగాడి పిలుపులు ఒక మంత్రము
  ఇద్దరి సరిజోడు అన్నది లోకము, నీ కవితల ప్రభావం నేను కవిని అయినాను
  I am feeling amazing by reading your posts. thanks dear.

  ReplyDelete
 21. ఎడబాటులో ABCD మీకే సాధ్యం
  చిత్రం కవ్విస్తున్నది కవిత కూడా

  ReplyDelete
 22. మిస్స్ అయ్యాను మీ పోస్టులు

  ReplyDelete
 23. ప్రేమలో పీ.హెచ్.డీ

  ReplyDelete
 24. అందరి ఆత్మీయ అభిమాన స్పందనలకు పద్మార్పిత ప్రణామములు _/\_

  ReplyDelete