గాజుల సవ్వడి..

గాజులు తొడుక్కుని గదిలోన కూర్చో అంటూ
గలగలా వాగేసి స్త్రీని బలహీనురాలంటే ఎలా?

చిన్నప్పుడు విన్న తల్లి చేతి గాజుల సవ్వడి
ఉదయాన్న లేలెమ్మంటూ మేల్కొల్పిన ధ్వని
గోరుముద్దలు తినిపిస్తూ బుజ్జగింపులా రాగం
నిన్ను జోలపాడి నిద్ర పుచ్చుతూ చేసే శబ్ధం 
అమ్మ చేతి గాజులు దీవించు నిన్ను అలా..
తల్లిచేతి గాజులు ఎప్పుడూ మ్రోగాలని కోరుకో
అవి మ్రోగినంత కాలం తండ్రిప్రేమకి కొదవులేదు
తల్లితండ్రులు ఆశీర్వాదం లేనిదే నీవు ఎదగవు!

భార్యా చేతిగాజుల సవ్వడి గురించి ఏం చెప్పేది
వేచిన చేతులు తలుపు తీసును చిలిపి సడితో
వేడి కాఫీ చేతికి అందిస్తూ మనసున ఒదిగేను
వంటింటి నుండి ఘుమఘుమలాడు గలగలలు
రాత్రివేళ మ్రోగు కొంటెగా కవ్వించు మువ్వలా..
భార్యచేతి గాజులను బహుగట్టిగా ఉండాలనుకో
అవి మ్రోగినంత కాలం నీ ఉనికికి ఢోకా లేదు
చేతిగాజులు పగిలి మౌనమే రోధిస్తే నీవుండవు!   

సోదరిగాజుల ధ్వనిలో ఉన్నాయి వాదోపవాదాలు
నీ నుదుటిపై బొట్టుపెట్టి కట్టును రక్షాబంధనాలు
కూతురి చేతిగాజులు నాన్నా అంటూ మదినితాకి
అత్తారింటికి వెళుతూ కంటనీరు పెట్టించి తడిమేను
కోడలి గాజులే కొడుకు పెదవిపై విరిసె నవ్వులా..
సోదరి గాజుల సవ్వడితో రక్తసంబంధాన్ని పెంచుకో
కూతురు కోడలి సడి విననిదే అనుబంధమే లేదు
ఈ గాజుల సవ్వడి లేక నీవు నిరాధారమయ్యేవు! 

24 comments:

 1. మాడంగారు అందరి గాజుల సవ్వడులు తెలిపితిరి
  ప్రియురాలి చేతిగాజులు సడిచేయవా లేక మరచితిరా?
  మమ్ము కంఫ్యూజ్ లో పెట్టి చంపితిరి .........

  ReplyDelete
 2. తెలుగువెలుగులా ప్రకాసించే ఓ స్త్రీ తేజమా
  మారుతున్న సమాజానికి అనుగుణంగా మారి
  నీ చలాకీతనం,ధైర్యం,సాహసం,ప్రతిభా హెచ్చి
  గలగలలాడె గాజుల సవ్వడులు తరిగిపోయాయి
  జాలువారిన కురులలో పువ్వులు కనుమరుగైనాయి
  చదివి వినవలసిందే ఇప్పుడు గాజుల సవ్వడులు..

  ReplyDelete
 3. పదహారణాల పుత్తడిబొమ్మ నడయాడేవేళ మువ్వల ఘల్లులే
  అచ్చతెలుగు ఆడపిల్ల చేతి గాజులు పలికే సప్తస్వరాలే
  తన నుదురున తిలకం మోమును చూడముచ్చట గొలిపే
  గలగల సవ్వళ్ళలో చెప్పకనే చెప్పే ఊసులు మరులు గొలిపే
  అసలు సిసలైన అందం భారతీయ సాంప్రదాయపు కట్టుబాట్లని తెలిపే
  గాజులు మువ్వలు అందియలు జుమ్కిలు ఇలా అన్నిటిలో అంతరార్థం తెలిపే
  జీవితానికి పరిపూర్ణతను అందించటం లో ఇద్దరి పాత్రల ప్రాముఖ్యత
  ఏ ఒక్కరు తక్కువ కాదు ఏ ఒక్కరు ఎక్కువ కాదనే సారూప్యత

  సాహో పద్మ గారు

  ReplyDelete
 4. అందరి భార్యల గాజుల సవ్వడులు మధురం కాదు సుమా!మంచి కవితను అందించారు.

  ReplyDelete
 5. ఈ గడ్డ మీద పురుడుపోసుకున్న ప్రతి బిడ్డ
  తొలిగా వినే మధుర సంగీతం- గాజుల గల గలలే
  వంటింట చిటపటలాడినా,
  రణరంగాన మృత్యు భేరీ మృదంగాలైనా
  సమాజాన్ని వూరడించే ప్రేమ, ఆప్యాయతల చిరు గంటల నాదాలైనా
  అవి ఎన్నటికీ ఆగిపోని హృదయనాదాలు- మా జీవన వేదాలు

  ReplyDelete
 6. http://varudhini.blogspot.in/2017/10/blog-post.html?showComment=1507609571695#c3476325523312171638

  ఈ ముతకటపాలను పద్మార్పితతోనే సరిపెట్టండి...పద్మార్పిత అమ్మ, పద్మార్పిత అమ్మమ్మ, పద్మార్పిత నానమ్మలు ఏ పాపం ఎరుగరు. వారు అమాయకులు ... దయచేసి వదిలేయండి ... చేతులు జోడించి ప్రార్ధిస్తున్నాను.

  ReplyDelete
 7. ఇప్పుడు ఎక్కడివి గాజుల సవ్వడులు
  అన్నీ రబ్బరు గాజులు శబ్దం చేయవు

  ReplyDelete
 8. భార్య గాజులు చేసే ధ్వని అన్నీ మంచి పాయింట్స్ రాసినారు గరిట తిప్పడంతో పాటు గరిట తిరగవేస్తుంది ఇది మరచినారు...హా హా హా

  ReplyDelete
 9. తొలి చూలుకు కమ్మనైన కానుకలు ఈ గాజులు
  అమ్మతనానికి అర్ధం చెప్పినా కొసరి తినిపించే అనురాగానికి ఆనవాళ్ళు ఈ గాజులు
  తోడు రారమ్మని పిలిచే జాబబిలమ్మ పాటల సప్తస్వరాలు..ఈ గాజుల గలగలలు!!
  ముత్తైదువు ఐదవతనానికి ఆయువు పట్టులు ఈ గాజులు
  ఆదమరిచి నిదురించే చిన్నారిపాపలకు అమ్మ చేతి గాజుల సవ్వడులే మేలుకొలుపులు..
  పద్మా...మట్టిగాజుల్లోని మర్మాన్ని చెప్పావు బాగుంది నీ గాజుల సవ్వడి పవర్!!

  ReplyDelete
 10. గాజుల గలగలలు...అసలు పండగలు, పెళ్లి పేరెత్తితే గాజుల గల గలలు లేకుండా జరగదనే చెప్పాలి. ఆయా పండ గలో, సందర్భానుసారంగా తీసే దుస్తులకు తగ్గ మ్యాచింగ్ గాజులు లేకుంటే ఆవస్త్ర అలంకరణ పూర్తవ్వదు. గలగలలాడే రంగు రంగుల మట్టిగాజులు ముంజేటి మీద నాట్యం చేస్తూ తమ హుందా తనాన్ని నిలుపుతుంటాయి...ఏమంటారు

  ReplyDelete
 11. ఇప్పుడు అంతా యాంత్రికతే
  తినే తిండి, పిల్చే గాలికి కూడా లెక్కే
  జీవితాన్ని కంప్యూటర్ పెట్టెలో లాక్ చేసేసి
  జీవాన్ని, ప్రాణాన్ని క్లికుల్లో లెక్కించేస్తున్నాం
  స్నేహం, బంధం, బంధుత్వాలు అన్నీ ఆర్ధికతత్వాలే.
  ఇక గాజుల గలగలలు కూడా కృత్రిమమే

  ReplyDelete
  Replies
  1. మామా సూపర్ టచ్ చేసావ్, టచ్లో ఉండు.

   Delete
 12. WOMEN BANGLES ARE WEAPONS.

  ReplyDelete
 13. కాలం మారినా, నాగరికత ఎంత పెరిగినా వనితల మనసులు దోచేవి గాజులు. రూపలు ఎన్నో మారుతున్నాయి అయినా సింగారంలో గాజుల స్థానం మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. చేతికి గాజులు అందము..చెంపకు సిగ్గులు అందము.

  ReplyDelete
 14. గాజుల గలగల వినిపిస్తుంది శ్రావ్యంగా.

  ReplyDelete
 15. Good Post
  Touched all relations.

  ReplyDelete
 16. ప్రస్తుతం ట్రెండ్
  గాజులు మోత బరువు
  అనుకుంటున్నారు..
  మరి మీరు ఇలా వ్రాశారు :)

  ReplyDelete
 17. మెసేజ్ కంప్యూజ్డ్ గా ఉంది, ఇంకా ఓల్డ్ ఔట్ డేటెడ్ మాడంజీ.

  ReplyDelete
 18. చేతి గాజుల శ్రావ్యగీతికలు
  ఘల్లుఘల్లున ఆ సవ్వడులు
  ఆమె ఆప్యాయతలకు ఆనవాలు
  ఇల్లాలి చేతి గాజుల సవ్వడులు
  మాటలకందని మౌనపు బాసలు
  మగని చెవులకు ఇంపైన రాగాలు
  అలనాటి అమ్మ గాజుల శబ్ధాలు
  జీవితాన్ని తీర్చిదిద్దిన నిచ్చెనలు
  స్త్ర్రీ గాజుల సవ్వడులు ఎప్పటికీ
  మధురం ఆమెకు నీరాజనాలు..

  ReplyDelete
 19. మారుతున్నకాలంతో పాటు ఫ్యాషన్ ప్రపంచంలో మార్పులు వచ్చినా గాజులు తన ప్రత్యేకతని నిలుపుకున్నాయి. నేటితరాన్ని ఆకర్షిస్తున్నాయి అనడానికి తాత్కారణం పెళ్ళిల్లు పేరంటాల్లో గాజులు పంచడం వాడకం. పాతకాలంలో మట్టిగాజులు వేసుకునే వారు. బంగారు, వెండి, లక్క, ప్లాస్టిక్ గాజులపై యువతులు మక్కువ చూపిస్తున్నారు. ప్రాంతాన్నిబట్టి వినూత్నమైన గాజులు అందుబాటులోకి వచ్చి అతివలను అలరిస్తున్నాయి-హరినాధ్.

  ReplyDelete
 20. బాగున్నాయి చేతి గాజుల సవ్వడులు.

  ReplyDelete


 21. బాగున్నాయి సుమ ! జిలే
  బీ గాజుల గలగలలవి వీనుల విందై!
  జాగారములన్ మరి నీ
  సోగకనులు వలపు మీర శోభిల్లెన్ బో !

  జిలేబి

  ReplyDelete
 22. మహిళా పక్షపాతిగా మరోమారు నిరూపించుకొంటిరి.

  ReplyDelete
 23. ఇప్పుడు చేతి నిండు గాజులు ఎవరు వేసుకంటున్నారు?
  అన్నీ ఫ్రెంఢ్ షిప్ బాండ్లు కట్టుకుంటున్నారు.

  ReplyDelete