మనసు మెదడు బుద్ధి అన్నీ వశం తప్పేంతగా
నాలో ఇమిడిపోయి నువ్వు కైవశం చేసుకుంటివి
ఇదిగో అదిగో వస్తున్నావు అనుకునే ఆరాటంలో
సిగ్గుపడ్డ మోముని ముంగురులు కప్పేలా చేస్తివి
ప్రియా ఇంతలా ఎలా నన్ను నువ్వు మార్చేస్తివి!
మనసు పొరల్లో కోరికలు పురివిప్పి నర్తించేంతగా
నా ఆలోచనల్లో నువ్వు మెదులుతూ మురిపిస్తివి
ఏదోలెమ్మంటూ సర్దుబాటు చేసుకునే ప్రయత్నంలో
ప్రకృతి అందించిన అందాల్లో నువ్వు అగుపడితివి
ప్రియా ఇంతలా ఎలా నన్ను నువ్వు ఏమారిస్తివి!
మనసు నిగ్రహించుకుని నేను సింగారించుకునేంతగా
నాలోని ఆహభావాల పై నీవు అజమాయిషీ చేస్తివి
నీది కాని నాదన్నది ఏమున్నదిలే అనుకునేంతలో
ఈర్ష్యకే కన్నుకుట్టేంతగా వలపందించి అలరించితివి
ప్రియా ఇంతలా ఎలా నన్ను నువ్వు మాయచేస్తివి!
నాలో ఇమిడిపోయి నువ్వు కైవశం చేసుకుంటివి
ఇదిగో అదిగో వస్తున్నావు అనుకునే ఆరాటంలో
సిగ్గుపడ్డ మోముని ముంగురులు కప్పేలా చేస్తివి
ప్రియా ఇంతలా ఎలా నన్ను నువ్వు మార్చేస్తివి!
మనసు పొరల్లో కోరికలు పురివిప్పి నర్తించేంతగా
నా ఆలోచనల్లో నువ్వు మెదులుతూ మురిపిస్తివి
ఏదోలెమ్మంటూ సర్దుబాటు చేసుకునే ప్రయత్నంలో
ప్రకృతి అందించిన అందాల్లో నువ్వు అగుపడితివి
ప్రియా ఇంతలా ఎలా నన్ను నువ్వు ఏమారిస్తివి!
మనసు నిగ్రహించుకుని నేను సింగారించుకునేంతగా
నాలోని ఆహభావాల పై నీవు అజమాయిషీ చేస్తివి
నీది కాని నాదన్నది ఏమున్నదిలే అనుకునేంతలో
ఈర్ష్యకే కన్నుకుట్టేంతగా వలపందించి అలరించితివి
ప్రియా ఇంతలా ఎలా నన్ను నువ్వు మాయచేస్తివి!
ప్రతిక్షణం అనుక్షణం నా మనసు నిన్నే కోరుకుంటుంది. నువ్వు ఎదురైనప్పుడల్లా శరీరం పులకరించిపోతుంది. నిన్ను చూస్తు, నీతో మాట్లాడుతునే ఉండాలనిపిస్తుంది అంటారు ప్రేమకి ఉన్న లక్షణాలే ఇవని మీకు తెలుసును.
ReplyDeleteచిత్రము అతి సుందరం మీ మాటలు కూడా మధురం.
కవితలు రాసి మురిపిస్తావు
ReplyDeleteచిత్రాలతో మైమరపిస్తావు
భావాల కొలనులో విరబూసిన పద్మానివి నీవు.
soooo romantic jee
ReplyDeleteవలపు నిన్ను చేరగా పెదవిపై చిరునవ్వు ప్రేమగా మారగా మనసు మమత కలిసెను చూడు.
ReplyDeleteసుందరమైన బొమ్మతోపాటు రసరమ్య ప్రేమకావ్యం.
ReplyDeleteచిరుగాలి తరగలకే చిందులేశావు
ReplyDeleteకవితలకే నీవు ఎనలేని హొయలు
వయసు ఊహలు నీలో వగలు వేసేను
గిలిగింతలతో ఒళ్లు తుళ్లింతలయ్యేను..
ప్రేమ సెగలు ఉవ్వెత్తున లేచిపడుతున్నవి.
ReplyDeleteఆ కళ్ళలో కాంతిరేఖ గిలిగింత పెట్టెను నన్ను,ఆ నడకలోని హొయలు కవ్వించును నన్ను, ఓ నా అలివేణీ నువ్వే కదా నా ప్రాణం...ఈ ప్రేమకు విరహానికి మోక్షం ఎన్నటికో.
ReplyDeleteజీవితంలో ఎవ్వరు ఏమార్చేసినా మనకంటూ మన అస్తిత్వం ఎప్పటికీ పదిలమే పద్మా..చిత్రం అమోఘం!
ReplyDelete
ReplyDeleteఏమారిస్తివి గాదే
ఓమాలిని!రమణి! పూవు బోడియ ! సింగా
రీ !మధు పాత్రే మోముగ
నే మైకమున బడినాను నెలతుక! పద్మా :)
జిలేబి
కోమలమైన మనసుకి తెలియవు అలజడుల కటువు
ReplyDeleteనిరామలమైన హృదయాన రావెపుడు అలుపెరుగని నిటూర్పు
గాయలపాలై నిశ్చలంగా ఉన్నా అనిశ్చితమైన ఆలోచనలు కానివ్వవు అలజడులు
కరిగే హృదయం చలించే మనసు ఉన్నంత కాలం లేదెపుడు అడ్డు అదుపు..
అస్తిత్వమును మించిన ఆస్తి.. ఆప్యాయతను మించిన ప్రీతి లేవెక్కడ ఎటుజూసినా..!
ఎట్టెట్టా చేసేది గన్నీ మీరు బద్నాం అయ్యేది మేము. మాయచేసి మరుగొల్పింది నీవు గదటే కోమలీ-
ReplyDeleteగుండెల్లో గుట్టుగా
ReplyDeleteఎదురుగా బుద్దిగా
మందిలో మత్తుగా
పగటిపూట దొంగలా
మాపటేల కింగులా
నిన్ను మాయ చేసెగా
ఏం చేసెనో ఏమో..
ReplyDeleteఈర్ష్యకే కన్ను కుట్టింది
:) :) :)
పరితపించే హృదయం
ReplyDeleteమనసు మైండ్ దొబ్బితే బుద్ది మాత్రం ఏం పనిచేస్తుందని అది లేకపోతే ఏదో అవుతుంది.
ReplyDeleteఎవ్వరూ కాపాడలేని స్థితి పాపం..చిత్రము బహుత్ కూబ్
BEAUTIFUL PIC & POETRY
ReplyDeleteమీ మాయలతొ మంత్రముగ్ధులను చేస్తారు. ఆనక అమాయకంగా అడుగుతారు. ఏమి ఈ జాణతనం?
ReplyDeleteGreat words with beautiful pic
ReplyDeleteఆ అమాయకపు అల్లరి
ReplyDeleteచిలిపి ప్రశ్నల లాహిరి
నీకేలనే ప్రియంవదా..
నువ్వేం మాయ చేశావో గానీ...అనే పాట గుర్తుకొస్తుందండి
ReplyDeleteమాయ మీరు చేసి నింద అతడి పై వేసారు.
ReplyDeleteవసంతాన్ని ఎంత అందంగా వర్ణించారు. వసంతం ఎప్పుడూ నవ వసంతమే. వసంత గాలులు మదన శరాలు. తాకినంతనే వలపు భావావేశాలు.. వీటన్నిటినీ శృంగార అక్షరాలుగా మలిచి.. ఇలా తుంటరి కవిత అల్లినట్టున్నారు. వసంతంలో రగిలే కోరికలకు మనసు, బుద్ధి పరవశంలోనే ఉంటాయి కదా. ముంగురుల్లో దాగిన సింగారాల మోము ఉహాచిత్రమే... మదిలో కామ దహనం. వయ్యారాల వనితా సోయగాల కన్న ప్రకృతిలో ఇంకేం అందముంది...? నాకు తెలిసైతే లేదు. రసరమ్య వసంత నిశోదయాల్లో మనసు నిగ్రహించుకోడం కన్నా దారుణం మరోటి ఉంటుందా...? మీ అక్షర సుమాల సుగంధాలు, వసంత వర్ణాలను గగన జఘనంతో ఓడించిన మీ రంగుల చిత్రంలో చిన్నది... ఎదలో తెలియని భావావేశాన్ని నింపాయి. వెరీ గుడ్ ఫ్లవరీ లాంగ్వేజ్...
ReplyDeleteప్రేమ మీ అక్షరాల్లో ఎప్పుడూ హొయలు పోతూనే ఉంటుంది.
ReplyDeleteమాడమ్ జీ
ReplyDeleteబ్లాగ్ సృష్టికి
మీ ఊహాత్మక భావాలకు సలాం!
అందమైన మోమును ముంగురులు సైతం తాకాలి అనుకోవడంలో తప్పులేదండీ, స్త్రీ & ప్రకృతిని అందరూ ఆస్వాదించాలి అనుకుంటారు.
ReplyDeleteఅతిమధురం మీ భావాక్షరాలు.
ReplyDeleteప్రేమార్పితపు కవితాజరిలో కుసుమాలు కరువైనవి ఎందువలన!!!???
ReplyDeleteఅందరికీ నా వందనములు _/\_
ReplyDelete