ఏదో చేస్తివి!

మనసు మెదడు బుద్ధి అన్నీ వశం తప్పేంతగా
నాలో ఇమిడిపోయి నువ్వు కైవశం చేసుకుంటివి
ఇదిగో అదిగో వస్తున్నావు అనుకునే ఆరాటంలో
సిగ్గుపడ్డ మోముని ముంగురులు కప్పేలా చేస్తివి
ప్రియా ఇంతలా ఎలా నన్ను నువ్వు మార్చేస్తివి!

మనసు పొరల్లో కోరికలు పురివిప్పి నర్తించేంతగా
నా ఆలోచనల్లో నువ్వు మెదులుతూ మురిపిస్తివి
ఏదోలెమ్మంటూ సర్దుబాటు చేసుకునే ప్రయత్నంలో
ప్రకృతి అందించిన అందాల్లో నువ్వు అగుపడితివి
ప్రియా ఇంతలా ఎలా నన్ను నువ్వు ఏమారిస్తివి!

మనసు నిగ్రహించుకుని నేను సింగారించుకునేంతగా
నాలోని ఆహభావాల పై నీవు అజమాయిషీ చేస్తివి
నీది కాని నాదన్నది ఏమున్నదిలే అనుకునేంతలో
ఈర్ష్యకే కన్నుకుట్టేంతగా వలపందించి అలరించితివి
ప్రియా ఇంతలా ఎలా నన్ను నువ్వు మాయచేస్తివి!

29 comments:

  1. ప్రతిక్షణం అనుక్షణం నా మనసు నిన్నే కోరుకుంటుంది. నువ్వు ఎదురైనప్పుడల్లా శరీరం పులకరించిపోతుంది. నిన్ను చూస్తు, నీతో మాట్లాడుతునే ఉండాలనిపిస్తుంది అంటారు ప్రేమకి ఉన్న లక్షణాలే ఇవని మీకు తెలుసును.
    చిత్రము అతి సుందరం మీ మాటలు కూడా మధురం.

    ReplyDelete
  2. కవితలు రాసి మురిపిస్తావు
    చిత్రాలతో మైమరపిస్తావు
    భావాల కొలనులో విరబూసిన పద్మానివి నీవు.

    ReplyDelete
  3. వలపు నిన్ను చేరగా పెదవిపై చిరునవ్వు ప్రేమగా మారగా మనసు మమత కలిసెను చూడు.

    ReplyDelete
  4. సుందరమైన బొమ్మతోపాటు రసరమ్య ప్రేమకావ్యం.

    ReplyDelete
  5. చిరుగాలి తరగలకే చిందులేశావు
    కవితలకే నీవు ఎనలేని హొయలు
    వయసు ఊహలు నీలో వగలు వేసేను
    గిలిగింతలతో ఒళ్లు తుళ్లింతలయ్యేను..

    ReplyDelete
  6. ప్రేమ సెగలు ఉవ్వెత్తున లేచిపడుతున్నవి.

    ReplyDelete
  7. ఆ కళ్ళలో కాంతిరేఖ గిలిగింత పెట్టెను నన్ను,ఆ నడకలోని హొయలు కవ్వించును నన్ను, ఓ నా అలివేణీ నువ్వే కదా నా ప్రాణం...ఈ ప్రేమకు విరహానికి మోక్షం ఎన్నటికో.

    ReplyDelete
  8. జీవితంలో ఎవ్వరు ఏమార్చేసినా మనకంటూ మన అస్తిత్వం ఎప్పటికీ పదిలమే పద్మా..చిత్రం అమోఘం!

    ReplyDelete


  9. ఏమారిస్తివి గాదే
    ఓమాలిని!రమణి! పూవు బోడియ ! సింగా
    రీ !మధు పాత్రే మోముగ
    నే మైకమున బడినాను నెలతుక! పద్మా :)

    జిలేబి

    ReplyDelete
  10. కోమలమైన మనసుకి తెలియవు అలజడుల కటువు
    నిరామలమైన హృదయాన రావెపుడు అలుపెరుగని నిటూర్పు
    గాయలపాలై నిశ్చలంగా ఉన్నా అనిశ్చితమైన ఆలోచనలు కానివ్వవు అలజడులు
    కరిగే హృదయం చలించే మనసు ఉన్నంత కాలం లేదెపుడు అడ్డు అదుపు..
    అస్తిత్వమును మించిన ఆస్తి.. ఆప్యాయతను మించిన ప్రీతి లేవెక్కడ ఎటుజూసినా..!

    ReplyDelete
  11. ఎట్టెట్టా చేసేది గన్నీ మీరు బద్నాం అయ్యేది మేము. మాయచేసి మరుగొల్పింది నీవు గదటే కోమలీ-

    ReplyDelete
  12. గుండెల్లో గుట్టుగా
    ఎదురుగా బుద్దిగా
    మందిలో మత్తుగా
    పగటిపూట దొంగలా
    మాపటేల కింగులా
    నిన్ను మాయ చేసెగా

    ReplyDelete
  13. ఏం చేసెనో ఏమో..

    ఈర్ష్యకే కన్ను కుట్టింది

    :) :) :)

    ReplyDelete
  14. పరితపించే హృదయం

    ReplyDelete
  15. మనసు మైండ్ దొబ్బితే బుద్ది మాత్రం ఏం పనిచేస్తుందని అది లేకపోతే ఏదో అవుతుంది.
    ఎవ్వరూ కాపాడలేని స్థితి పాపం..చిత్రము బహుత్ కూబ్

    ReplyDelete
  16. మీ మాయలతొ మంత్రముగ్ధులను చేస్తారు. ఆనక అమాయకంగా అడుగుతారు. ఏమి ఈ జాణతనం?

    ReplyDelete
  17. Great words with beautiful pic

    ReplyDelete
  18. ఆ అమాయకపు అల్లరి
    చిలిపి ప్రశ్నల లాహిరి
    నీకేలనే ప్రియంవదా..

    ReplyDelete
  19. నువ్వేం మాయ చేశావో గానీ...అనే పాట గుర్తుకొస్తుందండి

    ReplyDelete
  20. మాయ మీరు చేసి నింద అతడి పై వేసారు.

    ReplyDelete
  21. వసంతాన్ని ఎంత అందంగా వర్ణించారు. వసంతం ఎప్పుడూ నవ వసంతమే. వసంత గాలులు మదన శరాలు. తాకినంతనే వలపు భావావేశాలు.. వీటన్నిటినీ శృంగార అక్షరాలుగా మలిచి.. ఇలా తుంటరి కవిత అల్లినట్టున్నారు. వసంతంలో రగిలే కోరికలకు మనసు, బుద్ధి పరవశంలోనే ఉంటాయి కదా. ముంగురుల్లో దాగిన సింగారాల మోము ఉహాచిత్రమే... మదిలో కామ దహనం. వయ్యారాల వనితా సోయగాల కన్న ప్రకృతిలో ఇంకేం అందముంది...? నాకు తెలిసైతే లేదు. రసరమ్య వసంత నిశోదయాల్లో మనసు నిగ్రహించుకోడం కన్నా దారుణం మరోటి ఉంటుందా...? మీ అక్షర సుమాల సుగంధాలు, వసంత వర్ణాలను గగన జఘనంతో ఓడించిన మీ రంగుల చిత్రంలో చిన్నది... ఎదలో తెలియని భావావేశాన్ని నింపాయి. వెరీ గుడ్ ఫ్లవరీ లాంగ్వేజ్...

    ReplyDelete
  22. ప్రేమ మీ అక్షరాల్లో ఎప్పుడూ హొయలు పోతూనే ఉంటుంది.

    ReplyDelete
  23. మాడమ్ జీ
    బ్లాగ్ సృష్టికి
    మీ ఊహాత్మక భావాలకు సలాం!

    ReplyDelete
  24. అందమైన మోమును ముంగురులు సైతం తాకాలి అనుకోవడంలో తప్పులేదండీ, స్త్రీ & ప్రకృతిని అందరూ ఆస్వాదించాలి అనుకుంటారు.

    ReplyDelete
  25. అతిమధురం మీ భావాక్షరాలు.

    ReplyDelete
  26. ప్రేమార్పితపు కవితాజరిలో కుసుమాలు కరువైనవి ఎందువలన!!!???

    ReplyDelete
  27. అందరికీ నా వందనములు _/\_

    ReplyDelete