దారిమళ్ళింది..

                                                                    ఈ మధ్య భావాలు ప్రక్కదారులు తొక్కుతున్నాయి
                                                                    వద్దన్నా వినక అనవసరంగా రచ్చకెక్కుతున్నాయి!

సార్ధకత సాంద్రతల అన్వేషణలో దేన్నీ పట్టించుకోక
ఊహల్లో ఉండలేమని వాస్తవానికి దగ్గరౌతున్నాయి!

అందమైన అబద్ధపు తొడుగేసుకుని హాయిగా ఉండక
నీతి నియమాలు మనసాక్షంటూ కొత్తదారి పట్టాయి!
 
సన్నగా ఈలవేసి కన్నుకొట్టి కవ్వించి పబ్బంగడుపక
లేని వలపు ఎలా పుట్టించేదంటూ నిలదీస్తున్నాయి!

ఎవరేమైతే మనకెందుకని పట్టక నవ్వుతూ నవ్వించక
రాని నవ్వు నవ్వలేక ఇదీ ఒకబ్రతుకే అంటున్నాయి!

జీవితపాఠాల్ని చదువుతున్నాయనుకుంటాను చూడక
అందుకే జ్ఞానం ఎక్కువై మనసుని కెలుకుతున్నాయి!

చూడనట్లు పోక ఎందుకొచ్చిన రబస నీకిదన్నా వినక
నన్నో వింతజీవిననెంచి బ్రతికినా చచ్చినట్లంటున్నాయి!
       

22 comments:

  1. మరక మంచిదైనట్లు
    దారి మంచిదైతే దిగులు ఎందుకు?
    బాపుగారి బొమ్మ బాగుంది

    ReplyDelete
  2. అల్లకల్లోలమైన మనసు నిదానమైతే కమ్మని భావాలు
    ప్రకోపం చల్లబడితే పన్నీటి చిరుజల్లులు
    అశనిపాతాల మోతలు అణగారితే ఆహ్లాదకరమైన ఆవరణాలు
    దారి మళ్ళింపులు మంచికి సంకేతాలైతే అవేగా శుభఘడియలు

    ~శ్రీత~
    18.02.2018

    ReplyDelete
  3. బాగున్నాయి మేడమ్ గారు మీ భావకవిత్వాలు

    ReplyDelete
  4. నిజంగా మీరు వింత జీవే...
    బ్రతుకు ఆరాటమే గాని, ఆస్వాదన లేని మా ఈ జీవన గమనంలో
    జీవన స్పందన గుబాళింపులు కురిపిస్తున్న మీరు గ్రహాంతర జీవే...

    ReplyDelete
  5. సన్నగా ఈల వేయకుండానే మనసులో దూరి గజిబిజి చేస్తున్నాయి మీ అక్షరాలు మరింక కన్నుకొడితే ఆగేదెట్టాగా.

    ReplyDelete
  6. సార్ధకత
    సాంద్రతల
    అన్వేషణలో
    కొట్టుమిట్టాడుతూ
    ఎన్నాళ్ళు???

    ReplyDelete
  7. ప్రక్కదారిని కూడా మంచిదే ఎంచుకున్నారు సుమా !

    ReplyDelete
  8. ఎటో వెళ్తూ ప్రక్కదారిలో తప్పనిసరిగా సంపాదించేలా చేస్తోంది
    ఎందుకో మొదలెట్టి ఎటో వెళ్ళిపోతుంటాము
    వెనక్కి తిరిగి గుర్తు చేసుకుని చూసుకుంటే అంతా శూన్యం....

    ReplyDelete
  9. మీ జ్ఞానం ప్రక్కదారి త్రొక్కదు
    మంచి పోస్ట్ పద్మార్పితా.

    ReplyDelete
  10. ఒక బాపూ బొమ్మకు పద్మార్పిత భావాలు బాగు బాగు...

    ReplyDelete
  11. నిజమే మీరు వింతగా కాదు విచిత్రం కూడా. :)

    ReplyDelete
  12. మది భావకుసుమాలు

    ReplyDelete
  13. చూడకనే జీవితపాఠాల్ని చదువుతున్నాయనుకుంటా..

    ReplyDelete
  14. మనసు పడే తపన వివరించారు మీ శైలిలో బాగుందండి.

    ReplyDelete
  15. భావం దానికి తగినట్లు కుదిరేనా బొమ్మ
    మమ్మల్ని చూపు మర్లనీయకున్నాయి..

    ReplyDelete
  16. నీతి నియమాలు మనసాక్షంటూ కొత్తదారి పట్టాయి...అయితే తప్పక దారి మళ్ళినట్లేనండీ.

    ReplyDelete
  17. నా దారి మళ్ళిన భావాలను ఆమోదించిన ఆత్మీయులందరికీ నా అభివందనములు.

    ReplyDelete
  18. దారిమళ్ళినా గమ్యం చేరితే చాలు.

    ReplyDelete
  19. ఇంత జ్ఞానం వినాశనానికే దారి తీయును పద్దు గారు... ఇలా వద్దు

    ReplyDelete