అస్థిర హామీ..

సంతోషంగా ఉంటానని ఒట్టేసి నీకు చెప్పి
మారిపోతానని నీకు హామీ ఇవ్వలేనుగా..
నా మనోభావాలు క్షణికాలేనని మభ్యపెట్టి
నీ ఆనందంకోసం అంటాకానీ నిజంకావుగా..

నిన్ను ఎప్పుడైనా తెలియక బాధిస్తానే తప్ప
తెలిసెన్నడూ నీ భావాలనైనా గాయపరచనుగా..
నీకు ఇబ్బంది కలిగించే పరిస్థితిని కలిగించక
వాగ్దానం చేసి నిబ్బరంగా మసలుకుంటానుగా..

నీకు ఎల్లప్పుడూ అన్నింటా మద్దతుని ఇచ్చి
నీ విజయాలకు నేను వారధిని అవుతానుగా..
నవ్వడం ఏడవడం నీతో కలిసి మెలిసి చేస్తూ
నిన్ను ప్రేమించే వారిలో నాదే ముందు పేరుగా..

భాగస్వామ్యం కోరక బాధల్లో భాగం పంచుకుంటూ
నిజాయితీకి నిర్వచనమే నేనని నిరూపించుకుంటాగా!

19 comments:

  1. ఎన్ని జన్మల పుణ్యం మూట కట్టుకున్నాడో కదా ఈ సఖుడు..!
    ఇంత అమృతతుల్య ప్రేమాభిమానాలను గ్రోలుతున్నాడు..!

    ReplyDelete
    Replies
    1. అవునండీ...ఇలా ప్రేమ పొందిన ఎవరైనా అదృష్టవంతులే.

      Delete
  2. స్థిరమైన ప్రేమకి అస్థిర హామీలు ఎందుకో?

    ReplyDelete
  3. అసలు హామీలతో పని ఏమిటి ప్రణయంలో.

    ReplyDelete
  4. ప్రేమించడమే పనిలేని పని
    పైగా హామీలు ఎందుకు చెప్పండి.

    ReplyDelete
  5. బాగుంది మేడం.

    ReplyDelete
  6. కాలమే అస్థిరమైనపుడు
    ఒక్కోసారి ఆడిన మాట
    చేసిన బాస మరుగున పడును
    కాని
    కాలము ముంగిట గల మధుర క్షణాలు
    కాలము చేసే తీపి గాయలు
    ఎల్లకాలం ఓ మధురానుభూతికి తెరలు తీసేను
    కలకాలం తీపి జ్ఞాపకమై శోభిల్లేను.

    ~శ్రీ~

    ReplyDelete
  7. Wish You Happy Women's Day

    ReplyDelete
  8. అందమైన చిత్రం దానికి ఏదో ఒకటి స్థిరపరచండి.

    ReplyDelete
  9. నిర్మొహమాటంగా అన్నీ చెప్పారు/వ్రాశారు
    ఇంకా ఏం మిగల్లేదు అనుకుంటాను హామీలు

    ReplyDelete
  10. ముందస్తు మీకు మహిళాదినోత్సవ శుభాకాంక్షలు
    అనుకున్నవి ఎవరూ అన్నీ పరిపూర్తి చేయలేరు
    అలాంటప్పుడు హామీలు బాసటకు అనవసరం అనిపిస్తుంది

    ReplyDelete
  11. ఇటువంటి హామీలు ప్రేమలో సహజం
    కాలానుగుణంగా మారుతుంటాయి.

    ReplyDelete
  12. Very nice feel unna lyrics.

    ReplyDelete
  13. భరోసా ఇవ్వలేని మనిషి హామీలు ఇస్తారు.

    ReplyDelete
  14. ఒట్టు వేసి బాసలు చేయించి నిలబెట్టే బంధాలు తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటివి పద్మగారు.

    ReplyDelete
  15. మన సౌఖ్యం కోరి మనవి అనుకున్నవి మనతోనే ఉంటాయి కానివి దిగులుకు గురిచేస్తాయి.

    ReplyDelete
  16. మనసులు మౌనంగా మాటలు చెబితే అవి చేసే బాసలు ఎంత అద్భుతంగా ఉంటాయో చెప్పలేము. ఆ మౌనం ఎన్ని భావాలతో సేదదీరుస్తుందో అవి ఎన్ని అనుభవాలైనా నేర్పవు అనిపిస్తుంది. మౌనం మాట్లాడదు అంటారు కానీ అది నిజం కాదు అంతరంగాన్ని తట్టిలేపే భాష మౌనాన్ని మించి వేరేదీ లేదు.

    ReplyDelete
  17. ఉగాది కొత్త సంవత్సరం కొత్త కవితతో మొదలు పెట్టండి.

    ReplyDelete
  18. అందరికీ అర్పిత అభివందనములు _/\_

    ReplyDelete