నమ్మకూడదు అనుకుంటూనే నిన్ను నమ్ముతూ
సమాధానంలేని ప్రశ్నవని తెలిసి కూడా ప్రశ్నిస్తూ
అంతరంగంలో అన్నీ నీవనుకుని పైకి ఏం కావని
నా ప్రతీఅడుగులో నీవున్నావని జీవించేస్తున్నాను!
ఎదపై సేదతీరుతుంటే గుండె నిబ్బరమనుకుంటూ
లేనిపోని ఆశయాలెన్నో మనసు నిండా నింపేస్తూ
ఆలోచనలు అన్నింటినీ నువ్వే దొలిచేస్తుంటే బేలనై
నువ్వు నా రేపై మిగులుతావంటూ బ్రతికేస్తున్నాను!
ఎప్పుడూ వెన్నంటి ఉంటానన్న నీ బాసని స్మరిస్తూ
చూసుకుంటే నా ప్రక్కన లేని నీ పై ఆవేశపడుతూ
ఎందుకు స్వార్థం వలలో బంధీవైనావని ప్రశ్నించలేక
నా మదికి సమాధానం చెప్పలేక తల్లాడుతున్నాను!
విడిపోవడానికే కలిసామన్న వాస్తవాన్ని రావద్దంటూ
లేని ఢాబుని కన్నీటి పై కప్పి అజమాయిషీ చేస్తూ
ఇలా కల్సి అలా విడిపోయే కనురెప్పలని ఊరడిస్తూ
ఎప్పటికీ కలిసుండే వరమియ్యమని అడుగుతున్నాను!

కనురెప్పలని శాశ్వితంగా కలిసిపొమ్మని ఇంత నిర్దయగా ఎలా చెప్పగలిగారు ప్రేమార్పితగారూ.
ReplyDeleteఅదే జరిగితే ఇంక కలవడం ఏమిటి కనుమూయడమే కదండీ.
చేసిన బాసలు కన్న కలలు ఎంత నిర్దాక్షిణంగా మోసం చేసినా మరీ ప్రాణం విడవడం సబబు కాదు.
ReplyDeleteచివురులు తొడిగే ఆశ
ReplyDeleteఊపిరులు ఊదే శ్వాస
కనుల కొలనులో కలల ఊట
మంచిని పెంచే మాటల మూట
తరగని గని కాదా జీవికి
తెలుపవా అవి వాటి ఉనికి
~శ్రీత~
నువ్వు నా రేపై మిగులుతావన్న ఆశతో ప్రతి నిశీధిన నీ వుషస్సుల వుషోదయానికై ఎదురుచూస్తునే వున్న...
ReplyDeleteఎప్పటికీ కలిసి ఉండేలా కనురెప్పలు కలిసిపోవడం ఆర్దత వాక్యాలు
ReplyDeletevery deep touching lines
ReplyDeleteమేడంజీ ఇక ఇలాంటివి వద్దు.
ReplyDeleteనమ్మకూడదు అనుకుంటూ నమ్మడం
ReplyDeleteతిట్ట కూడదు అనుకుని తిట్టడం
వినకూడదు అనుకుని చెడు వినడం
చేయ కూడదు అనుకుంటూ పాపం చేయడం
తప్పని పని నేటి తరానికి హెచ్చరిక.
Kisee pe itna yakheen math karna didi.
ReplyDeleteచివరిన ఆర్ద్రతగా ముగించారు.
ReplyDeletesuper touch lu istaru mee poems lo.
ReplyDeleteమనసొక మధుకలశం
ReplyDeleteపగిలే వరకే అది నిత్యసుందరం...
ప్రణయంకి పర్యవసానం ఇదికాదు.
ReplyDeleteఆలోచనలు అన్నింటినీ నువ్వే దొలిచేస్తుంటే... :(
ReplyDeleteఈ మనసు అన్నది ఉంది చూసారు...చెప్పింది వినదు దానికి తోచింది అది చేసి మనల్ని రాసి రంపాన్న పెడుతుంది 😃
ReplyDeleteఅంతం లేని వేదనకు ఆనకట్ట వేయడము
ReplyDeleteఎవరి తరమూ కాదూ..............
నువ్వు నా రేపై మిగులుతావంటూ బ్రతికేస్తున్నాను! మీరే వ్రాయగలరు.
ReplyDeleteనమ్మకూడదు అనుకుంటూనే నమ్ముతాను...
ReplyDeleteఇలా చేసినా కూడా ఇష్టమే అనిపిస్తుంది ఇష్టమైన వారిపై ఇదేమి మాయనో వలపుది.
శాశ్వత నిద్రను వరముగా కోరుకోవడం అపచారం అర్పిత.
ReplyDeleteఅందరికీ అర్పిత అభివందనములు _/\_
ReplyDelete