ఏంకాలేదు!

రెండడుకులు నువ్వు ముందుకు వెయ్యలేదు
నాలుగడుగులు వేసి నేనూ ధైర్యం చెయ్యలేదు
విడిపోతే కానీ ఎడబాటు ఏమిటో తెలియలేదు!

నువ్వొస్తావని పాతికేళ్ళు నేను వేచి చూడలేదు
నువ్వో పాతికవసంతాల ముందు కబురంపలేదు 
వలపు జ్యోతులే ఆరిపోయాయి వెలుతురేలేదు!

నీవు లేవన్న వ్యధను మనసూ మరచిపోలేదు
గుర్తుకురాకని ఎంత వేడినా నువ్వూ మానలేదు
నీ గమ్యమే నాకు శాపమని నాడు తలచలేదు!

సాంత్వన మాటలెన్ని చెప్పుకున్నా ఊరటలేదు
ఓదార్పులే ఇచ్చిపుచ్చుకున్నా కన్నీరాగడంలేదు
దాహార్తితో అరచిన ఆశాశయాల దాహం తీరలేదు!
 
కాలమే పగతో కాలకూటవిషమౌనని అనుకోలేదు
కలలన్నీ సమాధైపోయె కనులు ఇది కాంచలేదు
హృదయం నుండి ఊపిరి వెళ్ళి మరల రానేలేదు!

20 comments:

  1. ఏం జరగులేదు సంతోషం అదే జరిగి ఉంటే..

    ReplyDelete
  2. ~°~
    చివురులు తొడిగే ఆశ కు నిరాశ నిర్వేదపు మచ్చలా
    వెన్నెల కురిపించే చంద్రునికి అమవస గ్రహణమా
    మనిషిలో మానవత్వపు ఛాయలకు ఈర్శ్య ద్వేషమా
    ~!~

    ReplyDelete
  3. మీ కలపు పదునైన భావాలు అమోఘం.

    ReplyDelete
  4. ఇద్దరూ ఇద్దరే
    ఎవరూ తెగువ చూపలేదు
    ముందడు వేసి ఉంటే కధ మరో మలుపు తిరిగేది
    మీ ప్రేమ భావాలు అద్భుతం

    ReplyDelete
  5. superb
    maatalu levandi

    ReplyDelete
  6. గుర్తుకురాకని ఎంత వేడినా నువ్వూ మానలేదు
    నీవు చేసిన ఎద గాయమూ మానలేదు

    ReplyDelete
  7. మనసుని మీ కవిత పాతజ్ఞాపకాలను గుర్తుచేస్తూ ఎటో తీసుకెలళ్ళింది పద్మా..

    ReplyDelete
  8. Very nice emotional touch

    ReplyDelete
  9. సాంత్వన మాటలెన్ని చెప్పుకున్నా ఊరటలేదు..

    ReplyDelete
  10. నన్ను నాకు కాకుండా చేసినంత బాధగా ఉంది మీ కవిత.
    ఎమోషనల్ టచ్ తో అసాంతం తెలియని వేదన నింపిన కవిత.

    ReplyDelete
  11. నీవు లేవన్న వ్యధను మనసూ మరచిపోలేదు
    గుర్తుకురాకని ఎంత వేడినా నువ్వూ మానలేదు
    మీ ప్రేమ వ్యధ పవర్ అస్సలు తగ్గలేదు

    ReplyDelete
  12. మీరు మీ కవితలతో రాతిగుండెను కూడా కరిగించి సునాయసంగా ఏడిపించగలరు.

    ReplyDelete
  13. అతి సున్నితమైన భావాల్ని అంత కంటే సున్నితంగా చెప్పారు మీ కవితలో.

    ReplyDelete
  14. అందరి ఆదరణాత్మక వ్యాఖ్యలకు అంజలులు ఘటిస్తున్నాను.

    ReplyDelete
  15. హృదయ ఆవేదన లావాలా పొంగినవేళ పెల్లుబికిన కవిత.

    ReplyDelete
  16. ప్రేమ ఉద్వేగం ఎడబాటుల పర్యవసానం మీ ఈ కవిత.
    అద్భుతంగా అందించారు. అభినందనలు.

    ReplyDelete
  17. ఇంకా ఏం కావాలి
    మీరు ఊహల నుండి బయటపడండి.

    ReplyDelete
  18. ఎంతో మానసిక ఆలోచలతో సతమతమౌతున్నట్లు ఉంది పద్మార్పితా నీ మనసు. అది దాటి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను-హరినాధ్

    ReplyDelete