కృత్రిమం..

ఎంత దూరానున్నా ఎప్పుడూ ఎడబాటు అనిపించలేదు
ఎదురుగా నిలబడున్నా ఇంతకూ నువ్వెవరన్న ప్రశ్నే..
నా అన్న భావం పరాయిదై వలపు వగరుగా అనిపించి
నకిలీతనపు నవ్వులద్దుకుని నగ్నంగా నర్తిస్తున్న నైజం!

పలికినా పలక్కపోయినా మౌనంలో భాష కొరవడలేదు
ఇప్పుడు పదే పదే పిలిచి పలుకరించినా ఏదో దిగులే..
నా వాడు కాడన్న సంశయంతో ముద్దుగా పిలవాలన్నా
ఎందుకో వద్దని లేని గాంభీర్యాన్ని అద్దుకున్న ముఖం! 

తిన్నావాని అడిగితే చాలు కడుపునిండి ఆకలేవేయలేదు
వెళుతూ వెనుతిరిగి చూస్తే వస్తాడన్న నాటి ధీమాయే..
నాతో లేడంటూ నేటి కన్నీటికి కారణమై ఏం చెప్పాలన్నా       
మాట్లాడొచ్చానడిగి మాట్లాడబోయి పలికితే అంతా మౌనం!

బంధానికి బలమని నవ్వబోతే ఆ నవ్వులో జీవమేలేదు
అది చూసి అనురాగమే ముడులు విప్పుకుని ఎగిరె..
నాది నాదన్నది నన్నువీడి ఇంకెవరితోనో ముడివడిపోయి
ఎప్పటికైనా పరాయిదాన్ని నేనేనన్నది ముమ్మాటికీ నిజం!           

           

26 comments:

 1. మనసు చేసే గారణి మాడం ఇదంతా
  కృత్రిమం సహజత్వం అంతా మనం అనుకోవడమే

  ReplyDelete
 2. బాపు బొమ్మ
  బాధ పడుతున్నది

  ReplyDelete
 3. manishiki marpu anedin sahajam. tappadu jeevitani

  ReplyDelete
 4. అంతా కృత్రిమం అని తోచేనా మీ మనసున... ఔరా!! ఇదేమి మాయ??
  ప్రవరాఖ్యురాలి యద లేపనం కన్నీటికీ కరిగిందా??
  లేక కన్నీటి కసి మీ యదను కోసిందా??

  ReplyDelete
 5. ఏమో ఏమో ఇది నీకేమో ఏదో అయినది...మనసంతా బెంగగా ఉన్నది

  ReplyDelete
 6. బంధానికి బలమని నవ్వబోతే ఆ నవ్వులో జీవమేలేదు
  :( :( :( :) :) :) :( :( :(

  ReplyDelete
 7. మనసు కుదుట పరచుకుంటే అంత కూల్ ఉండొచ్చు

  ReplyDelete
 8. మనం పరాయి అనుకుంటే పరాయి
  లేదనుకుంటే అంతా మనమంచికే అనుకోవాలి మేడం

  ReplyDelete
 9. manasu tera teesina moosina vedane

  ReplyDelete
 10. నకిలీతనపు నవ్వులద్దుకుని నగ్నంగా నర్తిస్తున్న నైజం!Fantastic

  ReplyDelete
 11. గీ ఎండలకే పరేషాన్ అయితున్నం
  ఎంక గిట్ల ఏడిపిస్తే గెట్లనో ఏమో

  ReplyDelete
 12. ఈ వేదనావ్యధలు ఎందుకు తొందరలో బయటపడి వచ్చెయ్ పద్మార్పితా

  ReplyDelete
 13. నా అన్న భావం పరాయిదై sad

  ReplyDelete
 14. వెనుదిరిగి చూస్తావన్న ఆశతో...వూహతో గడిపేస్తున్నా ఈ నీవులేని నిస్సారజీవితాన్ని

  ReplyDelete
 15. మహానటి సావిత్రి పుట్టిన తేదీ మీరు పుట్టిన తేదీ ఒకటే....పోలికలు లేకపోయినా మనోవ్యధలో పోలికలు రాకుండా చూసుకోండి.మీరు వ్రాసే పద్ధతి చూస్తే చెప్పాలనిపించింది.

  ReplyDelete
 16. వ్యధ వ్యధకూ మధ్యన ఎంతో కొంత వెలుగు ఉంటుంది నమ్మండి.

  ReplyDelete
 17. అందరూ ఒకే విధంగా ఉండరు
  మనిషి నైజం మారుతు ఉంటుంది
  వాటికి అనుగుణంగా మనం నడుచుకోవాలి

  ReplyDelete
 18. Padma madam ji please meru "Mahanati" movie ni tappaka choodandi.

  ReplyDelete
 19. నీహారికగారి కామెంట్ ని ఏకీభవిస్తాను నేను.

  ReplyDelete
 20. కృత్రిమం అని నిర్థారించుకున్న తరువాత ఏ బంధమైనా అశాశ్వితమే
  వగచి కన్నీరు పెట్టుకుని లాభం ఉండదు పద్మా..వృధా ప్రయాస అనుకుంటా

  ReplyDelete
 21. వ్యాఖ్యలు రాయడానికి వాక్యాలు దొరకడం లేదు
  వేదనో లేక విరహమో తెలియదు కానీ మనసు పోరల్ని గాట్లకు గురిచేస్తున్నాయి

  ReplyDelete
 22. అస్లీ నకిలీ ఏమైనా బాపూ బొమ్మకు చింత వలదు.

  ReplyDelete