ఊపిరున్న శవం..

నా భావాలను వెళ్ళబుచ్చి ఎవరిని మెప్పించి
ఏం సాధించానో ఏమో తెలియకపోయినా...
ఉన్నదున్నట్లు చెప్పుకుంటే తిప్పలు తప్పించి
ఒరిగేది ఏమీ ఉండదని ఆలస్యంగా తెలుసుకున్నా!

నా నీడని వేరొక అందమైన రూపంలో రంగరించి
ఏం పొంది ఆనందించానో తెలియకపోయినా...
కలలన్నీ కరిగి ఆవిరైపోవగా కన్నీరంతా హరించి   
కాటికేగబోవ ఊపిరి ఉందంటే జీవచ్ఛవమై ఉన్నా!

నా ఆలోచనలకి అనుగుణంగా అందరినీ ఎంచి
ఏం లాభాన్ని పొందానో తెలియకపోయినా...
ఉన్న మనసుకి లేని పిచ్చిని కూడా ఎక్కించి
వెర్రిదాన్నని పచ్చబొట్టుతో పద్మ అనిపించుకున్నా! 

నా అంతరంగం ఎంతో నిర్మలమైందని భ్రమించి
ఏం ఆశల అందలమెక్కానో తెలియకపోయినా...
ఉన్న ఆత్మనిబ్బరాన్ని నలిపేసి నట్టేట్లో ముంచి
పరులను నమ్మి నన్ను నేను హత్య చేసుకున్నా! 

27 comments:

 1. భావాలు వెలిబుచ్చడంలో ఎవరూ ఎన్నటికీ పరిపూర్ణతను సాధించలేరు.
  ఎదుటివారు అర్థం చేసుకున్నప్పుడు అసలు ఏ భావంతోనూ పనిలేదు.

  ReplyDelete
 2. విరిగిన మనసు అలజడి.

  ReplyDelete
 3. మీరు గడుసరి అవునో లేక అమాయకులో అర్థం కావడంలోదు మీ కవిత చదువుతుంటే.

  ReplyDelete
 4. ahh...why always sad :(

  ReplyDelete
 5. ఆమె బ్రతికి వున్న జీవచ్చవం
  అతని గుండెతో ఆమె గుండె మాట్లాడుతోంది
  అతని గుండెలో తన ప్రతిరూపాన్ని చూసుకొని
  మురిసి కన్నీటితో మెరిసిపోతోంది
  ఇదే ఇద్దరి మమకారపు జ్యోతి
  ప్రేమ పుట్టనే కూడదు పుడితె చావదు

  ReplyDelete
 6. హత్య గావించబడ్డారా??
  లేక హత్య చేసారా మీ భావాలను??
  ఏమో ఏంటో ఎన్ని బాధలో???

  ReplyDelete
 7. వామ్మో భావాలు ఇంత బాధపెడతాయా

  ReplyDelete
 8. ఏదో లోటు కవితలో లేదా చిత్రంలో

  ReplyDelete
 9. Padmaji come out from that world..

  ReplyDelete
 10. ఎన్ని భావాలు వెళ్ళబుచ్చినా
  ఎవరి భావాలు వారికె సొంతం

  ReplyDelete
 11. నా అంతరంగం ఎంతో నిర్మలమైందని భ్రమించి

  ReplyDelete
 12. ఇంత మంది ఆరాధకుల అభిమానాన్ని సొంతం చేసుకొని కూడ "నేను ఏం సంపాధించాను" అని అడుగుతారా...?

  ReplyDelete
 13. ఊపిరితో ఉన్న శవం
  మీకు అస్సలు సరిపడని పదం
  పద్మార్పిత అంటే పవర్ఫుల్...

  ReplyDelete
 14. oh...no my heart is paining

  ReplyDelete
 15. ఎండకు ఆవిరైన మనసును సేదతీర్చండి

  ReplyDelete
 16. ఊపిరిలేని మనసుది ఎంత కష్టం
  వయసుతో పని లేని వాత్సల్యం
  హద్దులులేని అనురాగం బంధం
  ఏ ఊపిరి ఎవరిదో పోల్చుకోవడం
  అదుపు తప్పిన ఆక్రోషం
  నిలకడలేని కోరికలకు కళ్ళెం
  వేయడం బహుకష్టం బహుకష్టం..

  ReplyDelete

 17. మరువలేని జ్ఞాపికలు మీ పదకవితలు

  ReplyDelete
 18. పచ్చబొట్టు పొడిపించుకున్న మనసు.

  ReplyDelete
 19. ఇందరి అభిమానం చూరగొన్న మీకు ఇంకేం కావాలి మాడంజీ

  ReplyDelete
 20. మీ భావాలు వెళ్ళబుచ్చిన ప్రతీమారూ ప్యాన్స్ తండోప తండాలు వచ్చిపడుతుంటే ...ఏం సాధించాను అంటే ఎలా ఏమీ

  ReplyDelete
 21. పద్మ...నీలో ఈ మధ్య గమనించాను నిరాశావాదంపాళ్ళు జాస్తిగా కనబడుతున్నాయి. నువ్వు ఇలా ఉండడం అస్సలు నచ్చడంలేదు. అందుకే నీ పోస్ట్లు చూసి కూడా కమెంట్స్ పెట్టాలి అనిపించడంలేదు. నువ్వు ఎప్పుడూ ఎంతటి క్లిష్టమైన సమస్యలని సైతం నవ్వుతూ అధికమించడమే నాకు తెలుసు. ఇలా నిరుత్సాహంతో నీరుగారిపోవడం అస్సలు సమ్మతించము ఇది నీకు సరిపడదు.

  ReplyDelete
 22. అందరి స్పందనలకూ అర్పిత వందనములు. _/\_


  ReplyDelete
 23. నిట్టూర్పుల వేడికి ఎండుటాకులై దొర్లుతున్నవి మీ భావాలు

  ReplyDelete
 24. గతించిన కాలం మారిపోదు, పాతస్మృతులను చెరిగిపోవు. రాబోయే జీవితమలుపు ఎలాంటిదో భవిష్యత్తులో కాని తెలియదు.
  జరిగిన విషయాన్ని తలుచుకొంటూ జరగబోయేదాని గురించి మధనపడుతూ వర్ధమానాన్ని ఓ పీడకలలా గడపకు. ఈ నిరాశావాదం వదిలెయ్యి నేస్తం.

  ReplyDelete
 25. నా అంతరంగం ఎంతో నిర్మలమైందని భ్రమించి.... Bhrama kaadu adi ..Nijam

  ReplyDelete
 26. ఈ నిరాశా నిట్టూర్పులకు చరమగీతం పాడు.

  ReplyDelete