పద ఇద్దరం అపరిచితులం అయిపోయి మరల
మంచిముహూర్తం చూసుకుని పరిచయమౌదాం!
నీ నుండి నేను నా నుంచి నీవు ఏమీ ఆశించక
తప్పొప్పులు ఎంచక ఇద్దరి చూపులు కలబడేలా
ఒకరినొకరు ఆకర్షించే కిటుకులేవో కనుక్కుందాం!
ఎడబాటు ఎదకొట్టుకోవడం పలుకలేదని అలగడం
ప్రేమలో హెచ్చుతగ్గులని తగవులాడుకోని జతలా
మదిగోడలపై నీ నా పేర్లు పచ్చబొట్టు రాయిద్దాం!
అహపు అడ్డుగోడ తొలగించి క్షమని పందిరిగా అల్లి
పాత వలపుని నరికి తిరిగి పరిచయం పెంచుకుని
బాధల్ని ప్రక్కనెట్టి బలమైన బంధాన్ని ముడివేద్దాం!
గాయమవని కొత్తమనసులు రెండూ పొట్లం విప్పి
ఒకరంటే ఒకరికి ఇష్టం ఆసక్తి పెరిగి పోటీ పడేలా
నాటి తప్పటడుగుల్ని మార్చి సప్తపదిగా నడుద్దాం!
ReplyDeleteఇక్కడ కూడా ముహూర్త ప్రాబల్యమేనా :) హతోస్మి :)
జిలేబి
మరోసారి కమిట్ అయ్యి మరిన్ని తిప్పలు ఎందుకూ అంట?
ReplyDeleteఏక్ నిరంజన్ సోలో లైఫ్ బెటర్ కదా హ హా హా హా అహ
అహపు అడ్డు గోడ తొలగాలంటే మళ్ళీ జన్మ ఎత్తాల్సిందే !
ReplyDeleteనాటి తప్పటడుగులు సరిచేసుకోవడం సాధ్యమా పద్మార్పితగారు?
ReplyDeleteఅక్కా ఈ మీ భావం
ReplyDeleteపెళ్ళి చేసుకుని విడాకులు తీసుకున్న దంపతులు మరల పెళ్లి చేసుకున్నట్లు అనిపిస్తుంది.
మోహన్ గారి పెయింటింగ్ అమేజింగ్.....
గాయం కాని మనసులు ఉండవు
ReplyDeleteఏదో విధంగా అందరూ గాయపడతారు
ఏమొలెండి మీ అంత అనుభవం లేదు
చిత్రం మాత్రం సూపర్.
Super madam
ReplyDeletebeautiful pic & lovely touching lyrics.
ReplyDeleteఒక్కసారి అపరిచితులమై
ReplyDeleteమనం ఇన్నాళ్ళూ వాదించుకున్నా
ఇక పై నా కోసం నీవూ
నీకోసం నేనూ జీవించేద్దాం!
అన్నీ చిరాకులూ మరిచిపోయి
మళ్ళీ ప్రేమలోపడదాం!
జీవిత సాగరాన్ని ఈదుతూ
నీ చేతులు నేనూ నా చేతులు నీవూ
పట్టుకుని జీవితం సాగిద్దాం!
అపరిచితులుగా విడివడి ఒకరికి ఒకరము ఏమీ కానట్లు ప్రేమసాగరములో ఈదుతూ ఈ జీవనయానాన్ని మరోసారి అలసట తెలియని విధంగా అనుభవించడం మీరు చెప్పిన విధంగా ఎప్పటికీ సాధ్యపడదు కదండీ!
ReplyDeleteఅద్భుతంగా మలచినారు
ReplyDeleteపదండి
ReplyDeleteకటీఫ్ కటీఫ్ కటీఫ్
రండి..
దోస్త్ దోస్త్ దోస్త్
హ అహా హా
Lovely new feel
ReplyDeleteఅహపు అడ్డుగోడ తొలగించి
ReplyDeleteక్షమని పందిరిగా అల్లి-Super
గాయమై విడిపోయిన మనసులు మరల క్రొత్త రూపం దాల్చి వికశించునా???
ReplyDeleteOh...
ReplyDeleteStill in love
బంధాల్లో బందీ అయ్యాక... ఈ అపరిచిత వైపరీత్యం ఏలనో...
ReplyDeleteజరగని వాటిపై ఎక్కువగా స్పందించడం అనవసరమే అనిపిస్తోంది.
ReplyDeleteపరిచితులు అపరిచితులు అవుతారా...మీ భవల్లోనే సాధ్యం.
ReplyDeleteGood & Bad
ReplyDeleteపరిచితులు చేసే గాయాల కన్నా అపరిచితులు వదిలే జ్ఞాపకాలే ఎంతో నయం. ఒక్కోసారి అవే పదిలం మధురం అనిపిస్తాయి అప్పుడప్పుడు అపరిచితులు సుపరిచితులుగా మారే ఆస్కారం కూడాలేకపోలేదు.
ReplyDeleteఎడబాటులో ఎదలు కొట్టుకోవడం కామన్
ReplyDeleteమీరు కొంచెం డిఫరెంట్ థింక్ చెయండి మ్యాడం
పరిచయాలు అపరిచితం అవ్వడం కష్టం
ReplyDeleteఅదే మన వ్యక్తిత్వం మంచిది అయితే అపరిచితులు కూడా పరిచయం చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతారు. ఇక ప్రేం విషయానికి వస్తే ఒకసారి అభిమానం ప్రేమ అనేది ఏర్పడిన తరువాత చాలా కష్టం అది త్రుంచుకోవడము తరిగిపోవడము కూడా...
చాలా బాగుంది మీ ఊహ.
ReplyDeleteమీ భావాలకు కొంచెం ఆర్ధ్రత ఎక్కువగానే కలబోసి రాసినట్లున్నారు. మనసు మడతల్లోతరచి చూసేకొద్దీ
ఎన్ని రంగుల చిత్రాలో మీలో.
beautiful painting
ReplyDeleteగొంతు దాటి రానీయకు
ReplyDeleteగుండెలోని భావాలను
గొంతులోనే త్రుంచేయి
మనసులోని మాటలను
కంటిలోనే ఇంకిపోనీయి
కన్నీటి శోకాలను
నవ్వు రాకపోయినా
విరిసి నవ్వనీ పెదవులను
వెలుగు లేనిదే
నీడ కూడా రాదు నీతోను
కాలం కలసిరానిదే
అనుకున్నది జరుగదు...
భావసంఘర్షణ నుంచి ప్రేమ సంఘర్షణ దాకా... మీ అక్షరాలు పదిలం మేడం!!
ReplyDeleteఈ కవిత అద్భుతం!!
https://padmarpitafans.blogspot.in/2018/05/blog-post.html?m=1
ReplyDeleteఆరునెలలుగా అగుపించలేదు అభిమానసంఘం ప్రతినిధి అయ్యుండి మీరు ఈ విధంగా...అంతా కుశలమే కదా???
Deleteపీడా విరగడయ్యింది. మళ్ళీ కలవడం ఎందుకు చెప్పండి ? విడిపోవడములో ఉన్న అనందాన్ని పోగొట్టుకోవడానికా?
ReplyDeleteचलो एक बार फिरसे अजनबी बनजाये हमदोनो
ReplyDeleteమావారు కూడా ఇలాగే అడిగారు కదా అని అపరిచితులమయిపోదాం అనేసుకుని ఒక సంవత్సరం దూరంగా ఉన్నాం.మళ్ళీ కొత్తగా పార్కులో మొక్కజొన్న కండెలు తింటూ ఊసులాడుకుని,సినిమాలు చూసుకుని టా టా బై బై చెప్పుకుని విడి విడిగా బ్రతకడం ఎంతబాగుందో చెప్పలేను. ఏ బాధ్యతా లేకుండా సోంబేరిలాగా(మీనింగ్ అడక్కండి) బ్రతకడం కూడా ఎంజాయ్ చేయాల్సిందే !
Deleteనిహారికగారు బాగా చెప్పారు.
Deleteఒకసారి ఒంటిరి జీవితానికి అలవాటు పడిన ప్రాణి బంధాల వంటి బంధిఖానాలో కూరుకుపోదు ఎగిరిపోవడానికే మొగ్గు చూపితుంది సుమా! పద్మార్పితగారు మీరు ఈ విషయమై ఆలోచించండి ధీర్ఘంగా హాన్.......
నీహారిక గారు,
Deleteఅద్బుతమైన పరధర్మము కన్నా, కాస్త చెత్తగా ఉండే స్వధర్మమే మిన్న అన్నారు. యాజిటీజుగా ఇలానే కాదనుకోండి. కొంచెం డీసెంటుగా, అధ్యాత్మికత మేళవించి. అంటే చెత్తపనైనా మన పని మనం చేసుకోవడమే మంచిది. అనవసర విషయాలలో తల దూర్చకుండా అన్నది. కొంత మంది తమ బరువు దించుకోవడానికి మనమీద లేనిపోని బాధ్యతలు పెడుతూ ఉంటారు. అంతేనా ఆ బాధ్యత మనదే అని మనల్ని దబాయించేస్తారు కూడా. అలాంటివాటికి ఎంత వీలైతే అంత దూరంగా ఉండాలి. ఇక్కడ పాయింటేమిటాంటే .. స్వధర్మాన్ని పాటించడం మాత్రమే కాదు, ఇతరులకు వారి ధర్మాన్ని వారే నిర్వర్తించాలని అది వేరే వారి నెత్తిమీద రుద్దకూడదని చెప్పడం అన్నమాట.
ఆగండి ఆగండి పద్మార్పితాజీ...ఆలోచించకుండా అపరిచితులం అయిపోదాం అని కమిట్ అయిపోతే ఆపై కష్టమేమో!
ReplyDeleteఎంత మంది పరిచయస్తుల మధ్యన తచ్చాడుతున్నా..
ReplyDeleteమనసుకి నచ్చిన వారు లేనప్పుడు అందరూ అపరిచితులే
అభిమాన అక్షరపరిచయస్తులందరికీ అర్పిత అంజలిఘటిస్తున్నది!
ReplyDeleteబ్యూటిఫుల్
మీరు అందరికీ సుపరిచితులే
ReplyDeleteమరచిపోదాం అనుకున్నా మరువనివ్వవు మీ పదబంధాలు.
సుమధుర రసవత్తరంగా అలరించారు భావాలని.
ReplyDeleteardmnv_eight
ReplyDelete