ఏకాంతవేళ ఏం తోచక నాలో నేను మాట్లాడుకుంటే..
నాకే తెలియకుండా నన్ను నఖశికపర్యంతం చూస్తాడు!
సడీసప్పుడు లేక జంటగువ్వలుగా ఎగిరిపోదామంటే..
పెదవిని పెదవితో తాకకనే పరోక్షంగా పంటిగాటెడతాడు!
చంద్రుడు రేయి దుప్పటిని కప్పుకుని తారలతోటుంటే..
మిలమిలా మెరిసేటి తన చూపుతో నన్ను కప్పేస్తాడు!
ఏటిగట్టున కూర్చుని ఏరుగలగల శబ్దమేదో వింటుంటే..
వెనకమాలొచ్చి వేడిసెగ చెవిలో ఊది వాటేసుకుంటాడు!
ఇసుకలో గవ్వలు ఏరుకుని ఆడుకుందాం రమ్మనంటే..
నా ఇసుకతిన్నెల వంపులే తనని నిలవనీయవంటాడు!
చాటుమాటు సరసం మనకేల ఎవరైనా చూస్తారనంటే..
నగ్నంగా నన్ను చుట్టేసుకుని నాలో కలిసిపోతున్నాడు!
నీలిమేఘాలపై ఊసులాడి మరోలోకంలో తేలుదామంటే..
నాకే అర్థమయ్యే భాషలో శృంగారశతకమే చదువుతాడు!

శృంగార భావం ఉట్టిపడింది.
ReplyDeleteనీలి మేఘాలపై తేలియాడుతూ
ReplyDeleteప్రణయ సింహాసనం అధిష్టించిన
పాల నురుగులాంటి తెల్లచంద్రుడు
నల్లకలువ భామను పలకరించిన
చూపులలోని వెలుగులే కదా
ఈ జగతిని అంతా మురుపించేటి
మైమరపించేటి ఈ వెన్నెల రహస్యం..
Romantic era started..
ReplyDeleteమాంచి మూడ్ లో దొర్లించిన పదాలు
ReplyDeleteరసవత్తరంగా సాగింది రహస్య ప్రియుడి ప్రేమవిలాపం..అహ హా హా
ReplyDeleteమిమ్మల్ని వీడని మీ ప్రియుడు ఉండగా మీకు ఏకాంతం ఎలా దొరికిందో మరి?
ReplyDeleteమీ ప్రేమ కావ్యం బాగుంది.
రహస్యం బట్టబయలు చేసితిరి
ReplyDeleteమీరు అసాధ్యులు
ReplyDeleteఅప్పుడే వేదన అంతలోనే వేదాంతం చెప్పి
మరి కొద్దిసేపట్లో శృంగారం పండిస్తారు.
ReplyDeleteఈ ఫోటో కిన్నెర సాని కవితలకు అప్పట్లో వచ్చిన పత్రిక లోని చిత్రం లా వుందే ? సరియేనాండీ పద్మార్పిత గారు ?
జిలేబి
విశ్వం ఏటి ఒడ్డున ఎన్ని వింతలనీ!
ReplyDeleteఏటిగట్టున కూర్చుని
ReplyDeleteఏరులో నీడను చూసి
ఎదసవ్వడి ఎగసెనని
చూపులతో గాలమేసి
వాల్జడ నయగారమన్నా
వలపు విరబూసేయునా!
రేయిజామున కలగని
రేచీకటిలో మాటువేసి
సందెపొద్దు అందాలని
వెనకమాటున వాటేసి
వంపులని నింధించ తగునా!
(ఇది మీ 2014 లో కవిత పద్మార్పితగారు.)
Super
ReplyDeleteప్రతిమనిషికీ ఏవో ఆశలు ఎన్నో రహస్యాలు..Nice pic
ReplyDeleteRomantic
ReplyDeleteవేట ఆడెను స్వారీ చేసెను శృంగార వినోదం తేనెలు ఊరెను మీ కవితలో...అధరం చిలికెను ఈ సరసావేశం మాయే చేసెను మతి పోగొట్టెను ఈ భామా చిత్రం. మీ సరససాహిత్య పంక్తులకు నా వందనం.
ReplyDeleteచాలా బాగుంది ఎప్పటిలా
ReplyDeleteఎంకిని తలపించే చిత్రం
ReplyDeleteనాయుడు బావను మరపించే ప్రియుడు
ష్....గప్చుప్!! :)
ReplyDeleteనా రహస్య ప్రియుడిని నన్ను ఆదరించి మెచ్చిన అందరికీ సలాం _/\_
ReplyDeleteయాడ దాస్తివి గీ ప్రియుడ్ని
ReplyDeleteచక్కని భావమేళవింపు.
ReplyDeleteఎవరో ఎందుకీరీతి కవ్వింతురో...చాలా బాగుంది.
ReplyDeleteLovely blog & lyrics
ReplyDeletevammo ginni kalallu vunnava nilo
ReplyDeleteవెన్నెలంటి వాడు మీ ప్రియుడు..హ హ అహా
ReplyDelete