బూడిదైన ఆశ..

నాకు మాత్రమే పరిమితమైన నా భావాలకు నిప్పంటుకుంది
నలుగురితో పంచుకోలేనంటూ లోలోన ఇమడలేక మండుతూ
కాలరాయలేని కలవర కలలను తైలంగా ఒంటిపైన వేసుకుని 
మంటల్లోనైనా మరుగున పడమని మర్మాలను మసిచేస్తుంది!
నాలో మాత్రమే రగిలే కోరికల జ్వాల భగ్గున మండి ఎగసింది
నాసిరకం వలపులో చిక్కుకున్న చంచల మనసును తిడుతూ
పోయేకాలానికి వచ్చిన పుట్టెడు బుద్ధుల్ని పిడకల్లో కాల్చమని
గతజ్ఞాపకాలను గుర్తు రావద్దని సంస్కారం మరచి తిడుతుంది!

నాకు నేనుగా నిర్మించుకున్న అందమైన ఆశలసౌధం కూలింది
నిరసన తెలుపని నిస్సహాయ ఆలోచనలు మైనంలా కరుగుతూ
గతకాలజ్ఞాపకాలను చల్లార్చలేని వేడి కన్నీటిని ఆవిరై పొమ్మని
నివురుగప్పిన నిజాల్ని నిద్రలేపి గాలితో జతై కాలిపొమ్మంటుంది!
నాలో నిండిన ఆత్మస్థైర్యం నిలువున కాలుతూ బేలగా చూసింది
నీరసించిన అప్పటి నన్ను ఇప్పటి నాతో పోల్చలేక గల్లంతౌతూ
ముఖం చాటేసిన మైకపు మోహాలను మంటల్లో కాల్చివేయమని
ఆత్మను వదలి సెగల్లో కాలిన ఆశయం బూడిదై గాల్లో కలిసింది!           

26 comments:

  1. ఏమిటీ? కల చెదిరి కవిత కన్నీరు కారుస్తుంది.

    ReplyDelete
  2. మనిషి పుట్టుకతో ఆశలు పుట్టి
    చచ్చిపోయేంత వరకూ సజీవంగా ఉంటాయి
    బూడిదైపొయిన ఆశల స్థానంలో కొత్త ఆశలు పుట్టుకొస్తాయి.

    ReplyDelete
  3. మస్తిష్కంలో పుట్టిన ధ్యేయం
    ధృఢమైన అయితే
    నిస్సారమైన కోర్కెలు కూడా
    సారవంతమైన మార్పే తెస్తాయి
    కొత్తగా మనసున ఆశలు పెంచుకో
    ప్రతీ ఓటమీ ప్రబంజనమై
    అందలం పై ఎక్కించేను చూసుకో..

    ReplyDelete
  4. నాసిరకం వలపు..oh new word

    ReplyDelete
  5. మీ ఆశలను, ఆశయాలను సాధించాలని ఆకాంక్షిస్తూ

    ReplyDelete
  6. నిరాశ నిస్ప్రహ నిర్లక్ష్యం
    వైఖరి నీలో రేపును అలజడి
    నిరంతరం నిశ్చల నిర్మల ఆలోచనలతో
    నిశ్శబ్ద భావాల్ని ప్రకటిస్తూ
    అందరితో వాటిని పంచుకుంటూ
    ఆత్మవిశ్వాసంతో మంచి నిర్ణయాలను
    తీసుకుని ముందుకు సాగిపోతూ
    నీ జీవిత గమ్యాన్ని నిర్దేశించుకో నీవు

    ReplyDelete
  7. గుండెకు గాట్లు పెట్టిపోతాయి మీ కవితలు.

    ReplyDelete
  8. ప్రేమలో విఫలమయ్యానని కృంగిపోయి దిగులు పడుతూ కవితలు వ్రాసి మనోభారాన్ని పెంచుకోవడం ఎందుకు కొత్త ఉత్సాహాన్ని జీవితంపై కలిగించుకుని ముందుకు సాగుతూ ప్రేమతోనే సరికొత్త లోకాన్ని నిర్మించవచ్చని తెలియజెప్పండి పద్మగారు. మీ వ్రాతలు జనాలని బాగా ప్రభావితం చేస్తాయి.

    ReplyDelete
  9. ఈ వేదన ఎంతకాలం మీలో?

    ReplyDelete
  10. పోయేకాలానికి వచ్చిన పుట్టెడు బుద్ధుల్ని పిడకల్లో కాల్చమని...చచ్చేదాకా పోవని ఎంత బాగావ్రాసారు!

    ReplyDelete
  11. నాలో మాత్రమే రగిలే కోరికల జ్వాల భగ్గున మండి.

    ReplyDelete
  12. meeru raastunna prati bhaavam frame kattinchukunela untaayi.

    ReplyDelete

  13. మీ ఆశల సౌధాలు ఎప్పటికీ చెక్కుచెదరిపోవు
    మీలోని ధీమా మిమ్మల్ని పట్టుసడలనివ్వదు.

    ReplyDelete
  14. మనసు పడే వ్యధ.

    ReplyDelete
  15. జూలై మాసం వచ్చింది వర్షం చినుకుల వలే నీ కవితలు అందరి మనసులనీ తడిపేయాలి...అన్నట్లు వ్యధలతో పాటూ హాస్యం, శృంగారం, విరహం మరెన్నో భావాలతో నీ బ్లాగ్ విరియాలి పద్మా

    ReplyDelete
  16. ఆశలు బూడిద అవ్వడం కడు భారం.

    ReplyDelete
  17. జీవితం అంటే ఎన్నో కలలు
    ఆశల సంద్రం
    తప్పవు వ్యధలు

    ReplyDelete
  18. ఈ బూడిదలు, కాలడాలు చూస్తే మీకెవరో చెలిమి చేతబడి చేసినట్లున్నారని గోచరిస్తోంది

    ReplyDelete
  19. ఆశలు చిగురించడం
    నెరవేరడం
    బూడిదవ్వడం
    మళ్ళీ కొత్త ఆశలు పుట్టడం
    ఇదే జీవితం...అందరికీ ధన్యవాదములు._/\_

    ReplyDelete
  20. నిరసన తెలుపని నిస్సహాయ ఆలోచనలు.........

    ReplyDelete
  21. కొత్త ఆశలు చిగురించనీయండి.

    ReplyDelete
  22. Amazing...I couldn't digest these heart pain feelings.

    ReplyDelete