బావలు సైయ్..

ఆంధ్రా బావనో, తెలంగాణా బావయ్యో లేక రాయలసీమ మామో
ఎవరైతే నాకేటి ఏ ఊరోడైతే నాకేంటి బావలందరికీ బస్తీమే సవాల్
నన్ను మెచ్చి నావెంట రాకుంటే లైఫ్ మొత్తం మిస్ అవుతావోయ్! 
 
నేనేంటి నా యవ్వారమేందని సోచాయించి పరేషాన్ ఎందుకు నీకు     
కోనసీమ కోటేరుముక్కు, చిత్తూరు పాలకోవ నా రంగు చూస్తే జిల్
ఆంధ్రాపారిస్ తెనాలి అందం తెలివితేటలు కూడా నా సొంతమేనోయ్!
 
పల్నాటి పౌరుషం కాకతీయ ప్రతాపం కలిసి మీసమున్న మగాడైనా
నీ బాంచన్ అంటూ నా చుట్టూ తిరిగి నాకు గులామవ్వడం కమాల్
నా జిమిక్కులతో కూచిపూడి తీన్ మార్ కోలాటమాడిస్తా చూడరోయ్!
  
తెలంగాణా సక్కినాల్లా సక్కిలిగిలెట్టే సరసం గోదారి పూతరేకు పరువం  
సీమ సంగటిముద్దలాంటి ముద్దులతో అయిపోతావు నువ్వు ఢమాల్    
నన్నంటుకుంటివా హైదరాబాదీ ఇరానీచాయ్ లెక్క గరంగుంటారోయ్!
 
మంగళగిరి వెంకటగిరి పోచంపల్లి గద్వాల్ ధర్మవరం కోక ఏది కట్టినా
చీరకే అందమొచ్చే సొగసు నాదైనా ఖర్చు పెట్టేటి నీ గుండె గుబేల్  
నాతోటి లింకు ఆషామాషీ అనుకుంటివా కరుసైపోతావ్ జరబద్రమోయ్!

25 comments:

 1. అద్గదీ...పద్మార్పితా
  నువ్వు సూపరో సూపర్
  జైహో జైయ్..కుమ్మేసెయ్!

  ReplyDelete
 2. గిట్ల పరేషా జేస్తివా సిట్టమ్మా

  ReplyDelete
 3. సై అంటే సై అంతే :)

  ReplyDelete
 4. మీరు ఎంత హుషారు పుట్టించే కవిత వ్రాసినప్పటికీ మీ నుండి ఇలాంటి పోస్ట్ ఊహించలేదు.
  ఇది నేను అస్వాధించలేక పోతున్నాను. మన్నించాలి మీవి ఎంతో ఉన్నతమైన భావాలు మీరు ఇలా వ్రాయకండి.

  ReplyDelete
 5. బావలు సయ్యా హొయ్
  మరదలు సయ్యా సై.. Ha ha ha

  ReplyDelete
 6. మన్మధుడు సైతం ఢమాల్

  ReplyDelete
 7. జనాలని రెచ్చగొట్టే విధంగా ఉంది.

  ReplyDelete


 8. బావా రిటర్ను కిక్కు :)


  ఓలమ్మో పద్మార్పిత
  నీ లెవలే వేరు సూవె నీరజ నేత్రా
  నీ లవ్వులోన ఓసోస్
  నే లైటయి పోయినాను నెలతి జిలేబీ :)

  జిలేబి

  ReplyDelete
 9. మీరు ఎవరైనా సునాయాసంగా మలచి మురిపించగలరు.
  చిత్రంలో అమ్మాయి కవ్విస్తుంది.

  ReplyDelete
 10. Padma your thoughts are in different way. We couldn't digest this.

  ReplyDelete
 11. పల్నాటి పౌరుషం
  కాకతీయ ప్రతాపం
  నైజాం నవాబుతనం
  రాయలసీమ రాటుతనం
  ఎన్ని ఉండి ఏం లాభం
  చిత్తు చిత్తు అవుతారు

  ReplyDelete
 12. మీ కవితలకు తిరుగులేదు.

  ReplyDelete
 13. చూపులన్నీ వెంటాడినట్టు మది కలవరమాయెనులే ఇది స్వర్గమా నరకమా ఏవిటొ తెలియెదులే అని ఎంతమందిని పాడుకునేలా చేస్తున్నది మీ పోస్ట్.

  ReplyDelete
 14. చేయి గలిపి సైయ్యంటే చీరలిస్తనంటాడు
  ప్రేమతోటి మనసిస్తే రివ్వున ఎగరేసుకుపోతాడు
  నువ్వు కూడా జరబద్రంగుండు పిల్లోయ్..సరదాగా నవ్వించావు

  ReplyDelete
 15. మీరు ఏ విషయమైనా ఒప్పించి మెప్పించగలరు.

  ReplyDelete
 16. మీరు అసామాన్యులు
  అదరహో అదరహ మీ పోస్ట్.

  ReplyDelete
 17. ఎప్పుడూ ఏడుపుగొట్టు భావాలతో విసిగించే నేను కూసింత నవ్వించాలని ఇలా వ్రాసానే కానీ ఎవ్వరినీ రెచ్చగొట్టాలనో మరే దురుద్దేశం లేదని సవినయ విన్నపం _/\_ స్పందించిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు...మీ పద్మార్పిత

  ReplyDelete
  Replies
  1. ఎంత మాట మీరు ఏ భావాన్నైనా చాలా మనసుకు హత్తుకునేలా వ్రాస్తారు.

   Delete
 18. వహ్ వాజీ...క్యాబత్ హై

  ReplyDelete
 19. గుండెల్లో ఎక్కడో బులెట్ దిగింది.

  ReplyDelete
 20. మీ రాతలు భావాలు మాత్రమే సైయ్ కాదు చదివిన అందరూ సైయ్ అంటారు

  ReplyDelete