వ్యధ కానుక!

కుదిరితే నీ మనసు చెప్పింది విను
లేదంటే నన్ను మౌనంగా ఉండమను
వ్యధను సంతోషమని ఎలా అనగలను
నవ్వడానికి ఏం ఎలాగోలా నవ్వేస్తాను!

విరబూయించడానికి తోటలోని పూలను
లేని ప్రేమని తోటమాలిలో కలిగించలేను
నవ్వుతున్న ముఖంలో దాగిన బాధను
రాతిగుండెని కన్నీటితో కడిగెలా చెప్పను!

ఒకరి నొప్పి ఇంకొకరినెలా భరించమనను
ఆ బాధ వేరొకరికి కలగాలని శపించలేను
కన్నీటిలో వ్యధలని కొట్టుకుపొమ్మన్నాను
ఏదో ఇలా సరిపుచ్చుకుని తృప్తిపడతాను!

అందమైన కల ఒక్కటైనా చూడని నేను
సంతోషకరమైన ఊహలేం ఊహించుకోను
ఏ విధంగానూ తృప్తి పరచలేకపోయాను
అందుకే నువ్విచ్చేది ఏదైనా స్వీకరిస్తాను! 

30 comments:

  1. వర్షంలో ఏడిస్తే కన్నిరు కనబడదు అలాగే బాధలను నవ్వుతో కప్పేసినట్లు చెప్పడం బాగుంది. చిత్రం చక్కగా నప్పింది.

    ReplyDelete
  2. వ్యధలని కానుకగా ఇవ్వడం స్వీకరించడం మీకే చెల్లు.

    ReplyDelete
  3. వ్యధలను తూట్లు లేని తుపాకీతో కాలుస్తుంది కామోసు కొందరి జీవితాల్లో.

    ReplyDelete
  4. చిత్రం వ్యధను మొత్తం నవ్వుతూ చెప్పింది.

    ReplyDelete
  5. Simple words with depth.

    ReplyDelete
  6. या दिलकी सुनो दुनियावालो
    या मुझको अभी चुप रहनेदो
    मै गमको खुशी कैसे कद्दू
    जो कहते है उनको कहने दो

    ReplyDelete
  7. మనసు చెప్పిన మాట విని నడుచుకుందాము అంటే వెధవ మనసు మాట వినదు. మీరు మనసు మాట వినమంటున్నారు.

    ReplyDelete
  8. మానవ సంబంధాలు, జీవన వ్యధలు, లోకం తీరుతెన్నులు అన్నీ విచిత్రం.
    మనం ఎంత మార్చలి అనుకున్నా వేటినీ మార్చలేము సరి కదా మరింత వ్యధలు పెంచుకుంటాము.

    ReplyDelete
  9. ఎద ఎదకు ఎన్నెన్నో కథలు

    ప్రతికథకు మరెన్నో వ్యధలు

    కథ మార్చేదెవరు వ్యధ తీర్చేదెవరు?

    రాయి తగిలితే నొప్పిరానిదెవ్వరికి

    గుండె పగిలితే కన్నీరు పొంగనిదెందరికి

    జీవితమన్నాక కష్టం రాకుండాఉంటుందా

    ఓ సుఖం వచ్చి ఆ కష్టాన్ని కష్టపెట్టకపోతుందా

    ReplyDelete
  10. శరీరానికి గాయమయితే రక్తధారలు
    హృదయానికి గాటుపడితె దుఃఖధారలు

    ReplyDelete
  11. Simply touching heart

    ReplyDelete
  12. మది నదిలో ఎన్నో భావాలు పరిగెడుతుంటే ఎన్నెన్నో రాగాలు..కలల అలలతో తడిసేటి ప్రేమచినుకులు. పాలనురుగులు కక్కుతూ మనసు చిందించేను హాస్యపు జల్లులు..అవ్వే కదా వ్యధ బహుమతులు.

    ReplyDelete
  13. బాధను దిగమింగలేక ఏమిచేయ్యాలో పాలుపోయక మునుపటిలా ఉండలేక మనసంతా కలవర పడుతుంటే ఊపిరాడక మిగిలిన భావాలు ఇలా మీ కవితలో ప్రతిబింబంలా కనబడుతున్నది నాకు. బొమ్మ చాలా బాగుంది.

    ReplyDelete
  14. కొన్నిసార్లు మనసు చెప్పింది వింటే మసైపోతాం-వినీ వినట్లు వదిలేసుకోవాలి.

    ReplyDelete
  15. సామాన్యంగా మనుషుల్లో చాలా మంది మనసులో అనుకునేది ఒకటి, పైకి చెప్పేది మరొకటి ఉంటుంది. అదే లౌక్యం-

    ReplyDelete
  16. మీరు వ్యధలు పండించడం దిట్ట 😊

    ReplyDelete

  17. అందమైన కల ఒక్కటైనా చూడని నేను
    సంతోషకరమైన ఊహలేం ఊహించుకోను...అసలు కలలను కనదమే తప్పు వాటిని నమ్ముకోవడం మరో తప్పు పద్మార్పిత.

    ReplyDelete
  18. మనసు పొరలని తట్టేలేపుతున్న ప్రేమ వ్యధ.

    ReplyDelete
  19. నవ్వడానికి ఎలాగోలా నవ్వేస్తాను..yes niiam.

    ReplyDelete
  20. వర్షంలో ఏడ్చినా కనబడదు.
    అవి గుర్తించిన వారే కరెక్ట్ ఫ్రెండ్స్

    ReplyDelete
  21. ఒకరి నొప్పి ఇంకొకరినెలా భరించమనను-ఆ బాధ వేరొకరికి కలగాలని శపించలేను-సున్నిత హృదయం అంతేనేమో

    ReplyDelete
  22. వ్యధ కానుక సరే... కవిత్వ కానుక ఏది... ఇన్ని రోజులు మేమాగలేం

    ReplyDelete
  23. బ్లాగు బోసిపోయినట్లు ఉంది మీ పోస్ట్ చూడక మీ చిత్రాలు కవ్వించక-కుశలమేనా

    ReplyDelete
  24. మనసు మహా చెడ్డది పద్మ గారు .

    ReplyDelete
  25. మీ పోయం కోసం నిలువెల్ల కనులై వేచి చూస్తున్నాము. వేగిరం రండు.

    ReplyDelete
  26. వ్యధల నుండి బయటపడి త్వరగా రండి అర్పితగారు.

    ReplyDelete
  27. వేదనలు బహుమతిగా కోరుకోవడం వెరైటీ

    ReplyDelete
  28. ఇంతకూ వ్యధలు మీ పుట్టినిల్లా లేక మెట్టినిల్లా?

    ReplyDelete
  29. వ్యధను కానుగా అందించినా విసుక్కోకుండా ఆదరించిన అందరికీ అర్పిత అంజలి ఘటిస్తున్నది._/\_

    ReplyDelete
  30. వేల వేల మాటలెన్నో వింటున్న
    నీవు మాటాడిన మాటలే కానుక
    కాలం ఎంత విలువైనది ఐనను
    నీతో ఉన్న ఆ క్షణమే కానుక..

    ReplyDelete