రహస్య ప్రియుడు..

ఏకాంతవేళ ఏం తోచక నాలో నేను మాట్లాడుకుంటే..
నాకే తెలియకుండా నన్ను నఖశికపర్యంతం చూస్తాడు!

సడీసప్పుడు లేక జంటగువ్వలుగా ఎగిరిపోదామంటే..
పెదవిని పెదవితో తాకకనే పరోక్షంగా పంటిగాటెడతాడు!

చంద్రుడు రేయి దుప్పటిని కప్పుకుని తారలతోటుంటే..
మిలమిలా మెరిసేటి తన చూపుతో నన్ను కప్పేస్తాడు!

ఏటిగట్టున కూర్చుని ఏరుగలగల శబ్దమేదో వింటుంటే..
వెనకమాలొచ్చి వేడిసెగ చెవిలో ఊది వాటేసుకుంటాడు!

ఇసుకలో గవ్వలు ఏరుకుని ఆడుకుందాం రమ్మనంటే..
నా ఇసుకతిన్నెల వంపులే తనని నిలవనీయవంటాడు!

చాటుమాటు సరసం మనకేల ఎవరైనా చూస్తారనంటే..
నగ్నంగా నన్ను చుట్టేసుకుని నాలో కలిసిపోతున్నాడు!

నీలిమేఘాలపై ఊసులాడి మరోలోకంలో తేలుదామంటే..
నాకే అర్థమయ్యే భాషలో శృంగారశతకమే చదువుతాడు! 

25 comments:

  1. శృంగార భావం ఉట్టిపడింది.

    ReplyDelete
  2. నీలి మేఘాలపై తేలియాడుతూ
    ప్రణయ సింహాసనం అధిష్టించిన
    పాల నురుగులాంటి తెల్లచంద్రుడు
    నల్లకలువ భామను పలకరించిన
    చూపులలోని వెలుగులే కదా
    ఈ జగతిని అంతా మురుపించేటి
    మైమరపించేటి ఈ వెన్నెల రహస్యం..

    ReplyDelete
  3. Romantic era started..

    ReplyDelete
  4. మాంచి మూడ్ లో దొర్లించిన పదాలు

    ReplyDelete
  5. రసవత్తరంగా సాగింది రహస్య ప్రియుడి ప్రేమవిలాపం..అహ హా హా

    ReplyDelete
  6. మిమ్మల్ని వీడని మీ ప్రియుడు ఉండగా మీకు ఏకాంతం ఎలా దొరికిందో మరి?
    మీ ప్రేమ కావ్యం బాగుంది.

    ReplyDelete
  7. రహస్యం బట్టబయలు చేసితిరి

    ReplyDelete
  8. మీరు అసాధ్యులు
    అప్పుడే వేదన అంతలోనే వేదాంతం చెప్పి
    మరి కొద్దిసేపట్లో శృంగారం పండిస్తారు.

    ReplyDelete

  9. ఈ ఫోటో కిన్నెర సాని కవితలకు అప్పట్లో వచ్చిన పత్రిక లోని చిత్రం లా వుందే ? సరియేనాండీ పద్మార్పిత గారు ?


    జిలేబి

    ReplyDelete
  10. విశ్వం ఏటి ఒడ్డున ఎన్ని వింతలనీ!

    ReplyDelete
  11. ఏటిగట్టున కూర్చుని
    ఏరులో నీడను చూసి
    ఎదసవ్వడి ఎగసెనని
    చూపులతో గాలమేసి
    వాల్జడ నయగారమన్నా
    వలపు విరబూసేయునా!
    రేయిజామున కలగని
    రేచీకటిలో మాటువేసి
    సందెపొద్దు అందాలని
    వెనకమాటున వాటేసి
    వంపులని నింధించ తగునా!

    (ఇది మీ 2014 లో కవిత పద్మార్పితగారు.)

    ReplyDelete
  12. ప్రతిమనిషికీ ఏవో ఆశలు ఎన్నో రహస్యాలు..Nice pic

    ReplyDelete
  13. వేట ఆడెను స్వారీ చేసెను శృంగార వినోదం తేనెలు ఊరెను మీ కవితలో...అధరం చిలికెను ఈ సరసావేశం మాయే చేసెను మతి పోగొట్టెను ఈ భామా చిత్రం. మీ సరససాహిత్య పంక్తులకు నా వందనం.

    ReplyDelete
  14. చాలా బాగుంది ఎప్పటిలా

    ReplyDelete
  15. ఎంకిని తలపించే చిత్రం
    నాయుడు బావను మరపించే ప్రియుడు

    ReplyDelete
  16. నా రహస్య ప్రియుడిని నన్ను ఆదరించి మెచ్చిన అందరికీ సలాం _/\_

    ReplyDelete
  17. యాడ దాస్తివి గీ ప్రియుడ్ని

    ReplyDelete
  18. చక్కని భావమేళవింపు.

    ReplyDelete
  19. ఎవరో ఎందుకీరీతి కవ్వింతురో...చాలా బాగుంది.

    ReplyDelete
  20. Lovely blog & lyrics

    ReplyDelete
  21. vammo ginni kalallu vunnava nilo

    ReplyDelete
  22. వెన్నెలంటి వాడు మీ ప్రియుడు..హ హ అహా

    ReplyDelete