ఏమి నా భాగ్యం!

హృదయం కావ్యమై, వేదన కవితగాను గతాన్ని గజల్ గా వ్రాసి
పరాయి వాళ్ళనే శ్రోతలుగా చేసి వినిపించేలా కలిగెనే నా భాగ్యం!

కన్నీటిదారాలు పెనవేసి గుండె గాయాలను కుట్టాను వచ్చి చూసి
పరామర్శించే నెపముతోనైనా పలుకరించి పోరాదా ఓ నా అదృష్టం!

నచ్చిన లోగిలినే అందంగా ఊహించుకుని ఎదశ్వాసనే ఊపిరి చేసి
అదృష్టాన్ని అంచనా వేయక ఆనందాన్ని పందెమేసి ఆడితి జూదం!

ఏరి కోరి అంగట్లో ఎడబాటు వ్యధలను లాభం కోసమని వేలం వేసి
లోకాన్ని జయించి నీ ముందు ఓడిపోయా ఎందుకని చెప్పు నేస్తం!

నా వలపు సాంద్రతను కొలవడం రాక నీలో ఉన్న నన్ను చంపేసి
నమ్మకాన్ని సజీవంగా ఉండమని చెప్పడం ఎంత వరకూ న్యాయం!

ప్రేమన్నది ఆటవస్తువు కాదు ఆడుకున్నంతసేపు ఆడుకుని విసిరేసి
క్రొత్తబొమ్మ కొనుక్కుని మురిపెంగా దానితో కొన్నాళ్ళు ఆడుకోవడం!

నాలాగే జీవితాంతం ప్రేమకోసమే అల్లాడి అప్పుడు దరిచేరి జతచేసి
పద్మను రమ్మని పిలిస్తే నేను పోయినా నా ప్రేమ నీపైనే ఇది సత్యం!

37 comments:

  1. Wah ware...heart touching gazal

    ReplyDelete
  2. గజల్ మనసు పొరల్లోకి చొచ్చుకుని పోయింది.

    ReplyDelete
  3. కన్నీటిదారాలు పెనవేసి గుండె గాయాలను కుట్టడం..కొత్త వరవడి.

    ReplyDelete
  4. వలపు సాంద్రతను కొలవడం రాక నీలో ఉన్న నన్ను చంపేసి ఇంత పెద్ద నేరమా-హృదయాన్ని తాకింది గజల్ భావం.

    ReplyDelete
  5. అచ్చి రాని అదృష్టాన్ని నమ్ముకొని గుండె గాయం చేసుకోనేల..
    కొందరినే వరించే అదృష్టంతో జూదమేల..
    ఇష్టం తో ఓడిపోయి ఇంకా వేదనేల..
    ప్రేమతో ఆడుకోవద్దంటూ మీ మనసుతో మీరు ఆడుకొనేల..
    బాగుందండి మీ గజల్..

    ReplyDelete
  6. दिल आज शायर है, गम आज नगमा शब् ये ग़ज़ल है सनम
    ग़ैरोंके शेरेन्को सुनेवाले, हो िस्तारा भी करम!

    ReplyDelete
  7. ప్రేమ అనేది ఆటవస్తువు కాదు ఆడుకుని వదిలివేయడానికి. ఎవరో జ్వాలను రగిలించారు.

    ReplyDelete
  8. వేదన గజల్స్ వినడం మా భాగ్యం అనుకోవాలా ఇది మరీ విఢూరం :)
    గజల్లో వేదన పాళ్ళు కప్పాలి అనుకున్నా కప్పలేకపోయారు.

    ReplyDelete
  9. ప్రేమకి ఉన్న జబ్బు ఇదే ఎన్నో వ్యధలకి దగ్గర చేసి మనల్ని మనకు దూరం చేస్తుంది అయినా బుద్ధిలేని మనుషులు ప్రేమిస్తూనే ఉంటారు. అయినా ప్రేమార్పితకు ఇది తెలియని విషయం కాదు.

    ReplyDelete
  10. ఇదేమి భాగ్యం?

    ReplyDelete
  11. హృదయ కావ్యం మనసు ద్రవించేలా వ్రాసారు.

    ReplyDelete
  12. నా కల్లకి కనిపిస్తుంది
    నీకు నా పై ఉన్న అనురాగం
    నీకు నాకు ఉన్న బంధం తెలియకున్నది
    గతకాల స్మృతుల ఆలాపన వింటూ
    నీ తలపుల్లో కరిపోతున్నా
    నీవు రావని తెలిసి ఎదురుచూస్తున్నా
    నీ అలోచనలు మనసుని మురిపిస్తయి
    శ్వాసల్లో మిగిలిన ఆశ ప్రాణాలని ఆపుతుంది
    తుది శ్వాస వరకు నిన్ను మరువనంది..

    ReplyDelete
  13. ప్రేమ లభించడం అదృష్టం. మనం ఎంత ప్రేమని, అభిమానాన్ని అందిస్తామో అంతే స్థాయిలో ప్రేమ, గౌరవాన్ని మనం పొందుతాము. ఇది నా అనుభవం.

    ReplyDelete
  14. కన్నీటిదారాలు పెనవేసి గుండె గాయాలను కుట్టాను..outstanding.

    ReplyDelete
  15. గజల్ సోయగాలు పుష్కలంగా ఉన్నాయి
    అంతర్మధనం కనబడుతుంది ప్రతీ స్టాంజాలో

    ReplyDelete
  16. గాలిబ్ గారి ఏకలవ్యురాలు

    ReplyDelete

  17. పద్మను రమ్మని పిలిస్తే నేను పోయినా నా ప్రేమ నీపైనే ఇది సత్యం!
    బావుంది

    ReplyDelete

  18. పద్మను రమ్మని పిలిస్తే నేను పోయినా నా ప్రేమ నీపైనే ఇది సత్యం!
    బావుంది

    ReplyDelete
  19. ఓ మాంచి రసవత్తరమైన పోస్ట్ మోస్ట్ వాంటెడ్

    ReplyDelete
  20. ఎక్కడ గల్లంతు అయినారు అర్పితాజీ...no postlu ఇదేమి భాగ్యమో??

    ReplyDelete
  21. మాడంగారి పోస్ట్లు కరువైనాయి
    కవితలకై వేయి కళ్ళు ఎదురు చుస్తున్నాయి
    మీకు మరియు మిత్రులందరికీ
    స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు

    ReplyDelete
  22. బ్లాగ్ బోసిపోయింది
    అక్షరాల పై అలిగినట్లున్నారు
    భావాలు మూగపోయినవా??
    ఏమైనారు? ఎలా ఉన్నారు??

    ReplyDelete
  23. ఎలా ఉన్నారు పద్మార్పితా? మెయిల్ రిప్లైయ్ లేదు పోయంస్ కూడా వ్రాయడం మానేసారు.

    ReplyDelete
  24. గజల్ అయినా గేయం అయినా వ్రాసి మెప్పించే పస మీలో ఉంది.

    ReplyDelete
  25. ఏమైపోయినారు?

    ReplyDelete
  26. వేదనలోను వేడుకలోను నవ్వుతూ నవ్విస్తానన్న పద్మార్పితగారు కుసలమా/
    ఏమైనారని కడుచింతతో పాటుగా మనసు కలవరం చెందుతున్నది...

    ReplyDelete
  27. కలవరమేదో కవితైంది.. మీ ఈ అక్షరమాలిక అందరికీ మనసైంది..

    ReplyDelete
  28. గింతగనం గాయబ్ అయినవ్ ఏమైంది మేడం
    ఇంక పరేషాన్ చేయకు గాకు బేగిరం వచ్చేయ్ పద్దమ్మా
    గజల్ మస్తుగ రాసినవ్ అనేలోపే గాయబ్ అయినవ్..

    ReplyDelete
  29. సహృదయ స్పందనలకు నా నెనర్లు.

    ReplyDelete