ఐ లవ్ యూ :D

డేంజర్ మనుషులకన్నా డార్లింగ్ డ్రాకులాస్ మిన్న వెంటపడుతూ వేదించి వలపూ గిలుపు అనకుండా కోమలంగా ఎత్తుకెళ్ళి మెడవంపున రెండుగాట్లుపెట్టి డ్రాకులాగా మార్చే డార్లింగ్ డ్రాకులా ఐ లవ్ యూ! డేర్ దిల్ లేని మహరాజులకన్నా డేర్ డెవిల్స్ మిన్న యాసిడ్ పోసో బూతులు మాట్లాడో రేప్ చేయకుండా కాంగా కిస్సు చేసి కత్తితో కాకుండా గోళ్ళతో పొడిచేసి చీకట్లో వెలుగుల్ని నింపే డేర్ డెవిల్ ఐ లవ్ యూ! డేటింగ్ అనే పాష్ పీపుల్స్ కన్నా డ్రాగన్స్ ఎంతోమిన్న అర్థం చేసుకోవాలనే అర్థంపర్థం లేని మాటలేం లేకుండా డైరెక్టుగా కావల్సిందేదో కానిచ్చి పడేయకుండా ఒడిసిపట్టి భుజంపై మోసుకెళ్ళేటి డిగ్నిఫైడ్ డ్రాగన్ ఐ లవ్ యూ! డేకాయిడ్ బుద్ధున్న మ్యాన్లీనెస్ కన్నా డెమన్స్ మిన్న అవసరానికి వాడుకుని ఆపై బొంకేసి ఎస్కేప్ కాకుండా ఆకారమేదైనా మదివీడని భూతమై నవరసాల్ని పిండేట్టి డాషింగ్ & డిప్లొమాటిక్ నాడియర్ హీరో ఐ లవ్ యూ!

33 comments:

 1. టైటిల్ లో D అంటే డేంజర్ అనా?? :D

  ReplyDelete
  Replies
  1. కాదుగా..
   D=Dracula
   D=Devil
   D=Dragon
   D=Demon..ఐ లవ్ యూ అని:-)

   Delete
 2. డేంజర్ జోన్ దాటి లవ్ చేస్తున్నారు జాగ్రత్త.

  ReplyDelete
 3. మీ అక్షరాలు అసాధ్యాన్ని సాధ్యం చేస్తాయి.

  ReplyDelete
 4. Wah...dil chooliya madam

  ReplyDelete
 5. మగవాడి పై మరో చర్నాకోల్ దెబ్బ
  మాకన్నా దెయ్యాలు భూతాలే మిన్న అని చెప్పేసారు.

  ReplyDelete
 6. మనసు మనసు ఏకమై
  ఇద్దరిది అనురాగలోకమై
  ప్రతిజన్మలోను జతగా వుండాలి
  ప్రేమ నిధినిక్షేపాలు దిరికినా
  పంచప్రాణాలు నీతోనే
  అంటూ జతకూడి పాడాలి..

  ReplyDelete
 7. అద్భుత కవితాక్షర ఝరి ... ఎవరూ స్పృశించని కోణంలో అద్భుతంగా అలరించారు.... సలామ్.... మేడం!!!

  ReplyDelete
 8. ఇప్పుడు మనుషులు కూడా డ్రాక్యులా మాదిరిగానే ఉన్నారు. ప్రొసీడ్ పద్దమ్మా

  ReplyDelete
 9. మనిషి నరరూప రాక్షసుడు అంటారు కదా
  అంటే మీరు మనిషిని లవ్ చేస్తున్నట్లే కదా
  పుట్టినరోజు శుభాకాంక్షలు మీకు.

  ReplyDelete
 10. సడిచేయకుండా వచ్చి కసుక్కున పొడిచేసి పోతారు...హా హా హా

  ReplyDelete
 11. అక్షరాలతో సమరం చేస్తారు
  భావాల సముద్రాన్ని మధనం చేస్తారు
  అమృతం లాంటి కవిత్వాన్ని అందిస్తారు
  హృదయాలను అమరం చేస్తారు
  ఆమె ఒక అక్షర అక్షయపాత్ర..

  ReplyDelete
 12. ఈ ధుర్యోధన దుశ్వాసన దుర్వినీతి లోకంలో పాటను తలపింపజేసారు.

  ReplyDelete
  Replies
  1. This comment has been removed by the author.

   Delete
  2. ఆంత గొప్ప పాటకు ఈ తింగరి రాతకు పొలిక పెట్టటానికి తమరికి మనసెలా ఒప్పింది మాష్టరు.

   Delete
 13. రాసే ప్రతి పదం నిజాన్ని ఉఛ్వాసిస్తూ
  అసత్యాన్ని నిశ్వాసిస్తూ నిలదీస్తుంది..
  అసత్యాలతో అనునిత్యం కడుపునింపుకునే
  అనామకుల లోకాన్ని ఆలోచింపజేస్తుంది..

  ReplyDelete
 14. Belated wishes to my friend.

  ReplyDelete
 15. దెయ్యం అంటే భయాన్ని పారద్రోలడానికి లవ్ యు అని అడ్డుగోడను నిర్మించారు..భేష్

  ReplyDelete
  Replies
  1. రాసెటప్పుడు ఆ మహ రచయిత్రి కూడ అనుకొలెదనుకుంటా ఆ భావం కాని మీరు కనిపెట్టెసారు. మీరు గ్రేట్ బాబొయ్ !!!

   Delete
 16. నవ్వు పుట్టిస్తూ..నిఘూఢం చెప్పారు.

  ReplyDelete
 17. మాషాల్లహ్

  ReplyDelete
 18. Belated Birthday Wishes.

  ReplyDelete
 19. మోస్ట్ డేంజర్ డెకాయిడ్స్ మనుషులే మాడం.

  ReplyDelete
 20. భుజంపై మోసుకెళ్ళేటి డిగ్నిఫైడ్ డ్రాగన్ మోత తప్పలేదు డ్రాగన్స్ కూడా..హయ్యారే

  ReplyDelete
 21. డెవిల్స్కు పిస్టోల్ సప్లైయ్ చేసిన నేను కూడా డెవిల్ అంటే నన్ను లవ్ చేస్తున్నారు అన్నట్లే...జింగలా లా లాలోయ్

  ReplyDelete
 22. birthday wishes madam
  party yedi?
  Dare Devils and lucky too

  ReplyDelete
 23. డెవిల్స్ ప్యారడైజ్.

  ReplyDelete