మాట వినని వలపు..

నేను ఎన్నడూ ప్రేమించకూడదనే అనుకున్నా
నిన్ను చూసి నా గుండె నాకే ద్రోహం చేసింది!
జీవితం ఆడి పాడుతూ హాయిగా గడిపేస్తున్నా 
అనుకోకుండా ఈ ప్రేమరోగం నాకొచ్చి సోకింది!

కునుకు కరువైయ్యింది అంతే కదా అనుకున్నా 

ఎడబాటగ్ని లోపల నరాలను దహించి వేస్తుంది!
ప్రేమిస్తే ఒకజీవితభాగం పూర్తని సరిపుచ్చుకున్నా
ప్రేమకెన్ని ఆచారవ్యవహార ఇబ్బందులో తెలిసింది!

వరించి వ్యధపడ్డ వారిని చూసి వెర్రని నవ్వుకున్నా

వ్యధలు పీడిస్తే వలపుజాడ్యం వ్యసనంగా మారింది!
రాత్రులు కలలతో కాపురం చేస్తే సహజమనుకున్నా
మనసిచ్చి పుచ్చుకున్న వారికిదే శిక్ష అనిపిస్తుంది!
     
తప్పు తప్పూ ఇకపై ప్రేమించడం మానాలనుకున్నా
కానీ.....నా గుండె నామాట ఎప్పుడు వినిచచ్చింది!

27 comments:

 1. ప్రేమ కనువిప్పు
  చేతులు కారిన తరువాత
  అహా హా హా........

  ReplyDelete

 2. ప్రేమలో మునిగి పైకి తేలరు అంటారు. మీరు పూర్తి జ్ఞానంతో బయటపడ్డారు. ఎంతైన ధైర్యవంతులు పద్మార్పిత.

  ReplyDelete
 3. అనుకుని ప్రేమించేది ప్రేమ కాదు
  అడిగితే ఇచ్చేది మనసు కాదు
  ప్రేమలో Phd చేసిన మీకు చెప్పాలా పద్మార్పితగారు!?...

  ReplyDelete
 4. మాట వినని మనస్సు ముందు మనం ఓడిపోక తప్పదు. గుండె గుడిలో గుట్టుగా దాచుకున్న తలపులను చెరిపి వేయలేము అలాగని మనసును హెచ్చరించి స్థిమితంగా ఉండలేము. ఏం మాయ చేసి కూడా గుండెను మనం వసం చేసుకోలేము మనము దానికి బానిస. మనసు ఎప్పుడూ ఎవరిమాటా వినదు.

  ReplyDelete
 5. రాత్రులు కలలతో కాపురం ha ha haa

  ReplyDelete
 6. మనసులేని బ్రతుకొక నరకం
  మరువలేని మనసొక నరకం
  మనిషికెక్కడ వున్నది స్వర్గం
  మరణమేనా దానికి మార్గం

  మనసనేది ఒకరికొకరు ఇచ్చినపుడే తెలిసేది
  దాచుకుంటే ఎవరికీ అది దక్కకుండా పోతుంది
  ప్రేమనేది నీకు నీవే పెంచుకుంటే పెరిగేది
  పంచుకునే ఒక మనసుంటేనే ఒక బంధమై అది నిలిచేది

  ReplyDelete
 7. బాగా చెప్పారండీ..
  ప్రేమను పంచడం గొప్ప కాదండీ..
  తిరిగి ప్రేమించ బడటం గొప్ప.
  ఆ ప్రేమను పంచుకునే హృదయం దొరికితే ఆ బందం ముందు ప్రపంచమే తల వంచుతుంది.
  ఆ ప్రేమ అజరామర కావ్యమై నిలుస్తుంది.

  ReplyDelete
 8. ప్రేమించొద్దనీ మీ గుండె కి చెప్పడం బానే ఉంది కానీ అది మీ మాట విన్న రోజు ఆ గుండె సవ్వడులు ఆగుతాయెమో పద్మ గారూ....

  ReplyDelete
 9. ఇంతకీ ప్రేమించారని ఆనందమా లేక వేదనా?
  ఏమోలే ఏది ఏమైనా ప్రేమ గుడ్డిది ప్రేమించడం మాచెడ్డది. ప్రేమించని నేను చర్చించడం నేరం అనమాకండి...హ హ అహా

  ReplyDelete
 10. ప్రేమించే హృదయం ద్రోహం చేసింది అనడం మీ మనసు పైన మీరు వేసుకుంటున్న అభాంఢం కదండీ...ఏదైన తిప్పి తిప్పి మిమ్మల్ని మీరు తిట్టుకోవడం ఎందుకో. చిత్రం చాలా బాగుంది.

  ReplyDelete
 11. preminche manasu eppudu mata vinadu madam

  ReplyDelete
 12. ప్రణయాకర్షణ దినదినాభివృద్ధి చెందుతున్న కొద్దీ ఇద్దరిలోనూ ప్రణయాలోచనలు కూడా ఎక్కువ అవుతుంటాయి.ఈ ప్రణయాలోచనలు అంతులేకుండా వస్తుంటాయి. అంటే నిరంతరమూ మెలకువతో ఉన్నప్పటి నుంచీ మళ్ళీ నిద్రపోయే వరకూ. ఈ ఆలోచనలకు ప్రత్యెక ఆహ్వానం అవసరం ఉండదు. ఇద్దరి మనసులు తలుపులు తట్టి, వారు ఆ తలుపు తీయక పోయినా ప్రవేశించి వారి మనోప్రాంగణంలో తిష్ట వేస్తాయి. ఈ ఆలోచనలు పిలవని అతిథులుగా వచ్చి, మనసులో తీవ్రఅలజడి రేపుతాయి.ఈ ప్రణయాలోచనల తీవ్రత ఎంత గా ఉంటుందంటే వద్దనుకున్నా వస్తుంటాయి. ఇక మనసు మాట వినదు అనే ప్రసక్తికి తావు ఉండదు ప్రేమలో.

  ReplyDelete
 13. మనసు మాత్రమేనా మనుషులు మెదడులో పుట్టిన ఆలోచన్లు సైతం ద్రోహం చేస్తాయని అప్పుడెప్పుడో మీరే వ్రాసిన గుర్తు. కవిత బాగుందండి.

  ReplyDelete
 14. మాట వినని మనసు మాట నువ్వు మాత్రం వినటం ఎందుకు?
  మనసు నువ్వు చెప్పింది వినేలా చూడు....మనసున్ననిరూపించి ఛాలెంజ్ చేసి బ్రతుకు.......

  ReplyDelete
 15. మనసు మాట వినని వేళ
  కనులు కాంతిని చూడని వేళ
  గొంతు మూగపోయిన వేళ
  భావం పొంగని వేళ
  కావ్యం కదలని వేళ
  నడక దారి మరచిన వేళ
  నీవు నీ దారి మళ్ళి
  ముందుకు సాగిపో నేస్తమా..

  ReplyDelete
 16. Madam unara?
  why not giving replies.

  ReplyDelete
 17. ప్రేమ విషయంలో మనసు వినదు మాట. ఇది సత్యం.

  ReplyDelete
 18. yeh dost gee premal domal manaku vaddu-oka mastu jabardastu post rasey

  ReplyDelete
 19. మరండీ !!
  సంద్రంలో సుక్కండి,
  సినుకులో సిరుగండి,
  ఏడిసకలో పీసండి,
  పుత్తకాల్లో కాలీ కాయితవండి,
  సిరుగాల్లో సాసండి,
  కెరటాల కిస్సన్ది,
  సిటుక్కున పగిలే బుడగండి
  మావోడికిచ్ఛే సెయ్యండి
  సాపవండి, వరవండి,
  ఇంకా అండీ
  మనం సాలా అండి,
  మనం ముక్కెం కాదండి
  మనం అసలు పెసలేం కాదండి
  మనం ఒక్కసారే అన్నీ అండి
  మనవండీ మడిసండి ,
  దేవుడు మన్నీ స్రుట్టి సేసేశాడండి
  మన్నందర్నీ అండి !!
  మరాండీ నేను సుక్కేస్తే ఎక్కువ మాటాడనండి !!
  స్ స్ స్ సప్పుడు సేయ్యమాకండి,
  పడుకోండి !!

  Just for fun... no offence meant !!
  Enjoy ;-)

  ReplyDelete
  Replies
  1. మనం అసలు పెసలేం కాదండి
   మనం ఒక్కసారే అన్నీ అండి
   మనవండీ మడిసండి ,
   దేవుడు మన్నీ స్రుట్టి సేసేశాడండి
   మన్నందర్నీ అండి !!

   సానా బాగుందండీ !

   Delete
 20. pranam_/|_
  kya hua deedi no latest posts.

  ReplyDelete
 21. ప్రేమించ కూడదని మీరు అనుకుంటే సరిపోతుందా?
  మనసు మెదడు ప్రేమించేస్తాయి ఆటోమాటిక్గా :) :(

  ReplyDelete
 22. వ్యక్తిగత కారణాలచే మీ అందరి అభిమాన అభిప్రాయాలకు విడిగా బదులు ఇవ్వలేనందుకు నన్ను మన్నించాలని మనవి చేసుకుంటున్నాను _/\_ మీ పద్మార్పిత.

  ReplyDelete
 23. త్వరగా అన్నీ సర్దుకుని వచ్చెయ్యండి.

  ReplyDelete
 24. Replies
  1. అంతరంగ మంత అగ్నిలో పడి చచ్చె
   తనువు మదన శిఖల తడిసి చచ్చె
   బుధ్ధి మొద్దు బారి బూడిదయై చచ్చె
   కామ దహన మగుచు ప్రేమ చచ్చె .

   Delete