క్రొత్తపంధా

నేను భావాలోచలతో యుద్ధం చేసి అలసిపోకుండా 
అక్షర సైనికులందరూ నన్ను దాడికి తలపడమంటే
పదకవాతాలకు అధిపతిరాలినై అలరించబూనుకున్నా
మెప్పించాలన్న ధీక్షతో నా శక్తిని ఉసిగొల్పుతున్నా!

నేను అనుభవాలకి రంగులద్ది భావాలు చెడిపోకుండా
రసరమ్య కావ్యాలనే లిఖించాలని ఊహలు పట్టుబడితే
లిపిలేని కలలకు రేపు నాదన్న రసాయనం పూస్తున్నా
వాక్యాలు మనసుని తాకి పరిమళింప ప్రయత్నిస్తున్నా!

నేను ఇకపై నిరాశావేదనల ఊసులన్నవే రచించకుండా
సమతాలౌకిక సామాజిక ప్రయోజన పదమాలల్లమంటే   
నన్ను నేను గెలవకపోతి రచ్చ ఏం గెలుస్తా అంటున్నా 
అయినా కొత్తగా అక్షరప్రయోగం ఒకటి మొదలెడుతున్నా!

నేను సంఘ సంస్కరణోద్యమంటూ మాటలు చెప్పకుండా
మార్పుకై నిఘంటువులో సున్నిత పదాలు వెతకబోయి
సమసమాజ నిర్మాణ పునాదుల పుస్తకం చదువుతున్నా       
మనిషినీ మానవత్వాన్ని బ్రతికించే కావ్యక్షేత్రంలో నేనున్నా!   

18 comments:

  1. శుభం ఆలస్యం ఎందుకు?

    ReplyDelete
  2. ఇది కవిత కోసమేనా
    లేక నిజంగానే దారి మళ్ళించారా?

    ReplyDelete
  3. అద్భుతమైన ఆలోచన కొనసాగండి
    చిత్రము సరికొత్తగా ఉంది

    ReplyDelete
  4. రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారా
    సంఘ సంఘసంస్కరణోద్యమాలు అంటున్నారు కొత్తపంధాలో good luck

    ReplyDelete
  5. ఇకపై నిరాశావేదనల ఊసులన్నవే రచించకుండా..ఇదెలా సాధ్యం మీకు

    ReplyDelete
  6. ఈ క్రొత్తపంధా ఎందరికి ఎ
    టువంటి దారి చూపించునో?

    ReplyDelete
  7. క్లిష్టమైన నిర్ణయం మీకు

    ReplyDelete
  8. అక్షరాలతో ఆడుకుంటూ యుద్ధం చేస్తున్నాను అంటున్నారు
    తప్పుగా ఆలోచిస్తున్నట్లు ఉన్నారు..మరోమారు థింక్

    ReplyDelete
  9. . . . అధిపతిరాలినై . . .
    ?

    ReplyDelete
    Replies
    1. అధిపతి=పురుషలింగం అయితే అధిపతిరాలు=స్త్రీలింగం అని రాసాను.... _/\_

      Delete
    2. పురుషలింగం అనరండీ పుల్లింగం అనే. అధిపతిరాలు కాదు అధిపతి అనే వాడుకచేయండి - ఈ పదానికి లింగబేధం లేదనుకుంటాను.

      Delete
  10. సమసమాజ నిర్మాణం జరగాలి.

    ReplyDelete
  11. స్పందించిన హృదయాలకు నమస్సుమాంజలి_/\_

    ReplyDelete