అతడు/ఆమె....

అతడు.......
అతని బాహుబలాన్ని చూడకు...
ఆమె ప్రేమని పొందాలన్న అతని ఆరాటాన్ని చూడు.

అతని మాటల్లో కరకుతనాన్ని చూడకు...

ఆమెపై అతడికున్న మమకారాన్ని చూడు.

అతని సిరిసంపదలని చూడకు...

ఆమె స్థానం అతని హృదయంలో చూడు.

అతని చేష్టలు నొప్పిస్తాయని చూడకు...
ఆమెని అతని లాలనతో ఎలా మైమరపిస్తాడో చూడు.

అతని ప్రేమ ఆమెకే సొంతం కావాలని చూడకు...

ఆమె ప్రేమలో అతడు చివరివరకు కట్టుబడిన తీరుని చూడు.
అతని శక్తిసామర్ధ్యాలని అంచనావేసి చూడకు...

ఆమెకి అతడు తోడునీడగా నిలచే మంచి మనిషి అని చూడు.

ఆమె......

ఆమె అందాన్ని తను ధరించిన వస్త్రధారణలో చూడకు...

అతనిపై ఆమెకున్న భావాలని మనోనేత్రాలలో చూడు.
ఆమె మేనిఛాయలోని మెరుపులను చూడకు...

అతనిపై ప్రేమను ఆమె కనురెప్పల మాటున దాచింది చూడు.

ఆమె బుగ్గల గులాబిరంగుని చూసి మోహించకు...

అతనితో ఆమె చేదోడు వాదోడుగా వుండేలా చూడు.

ఆమె అందాన్ని వేరొకరితో పోల్చి చూడకు...
అతనిపై ఆమెకున్న ఆరాధనతో కూడిన అనురాగాన్ని చూడు.

ఆమె రాగాలాపన చేయగలదా అని చూడకు...

అతనికి ఆమె అవసరమైనప్పుడు సపర్యలు చేయగలదా అని చూడు.

ఆమె ఇచ్చే క్షణాల సుఖాన్ని ఆశించకు...
అతనితో జీవితాంతం కలసి జీవించేలా చూడు.

19 comments:

 1. వహ్ వా... అద్భుతంగా చెప్పారు.
  " అతడు - ఆమె " ఎప్పటికీ తరగని ఒక చక్కని జంట...
  అతడు మన్మధుడై ముక్కంటి కోపానికి కాలి బూడిదైతే ఆమె అతనికి జన్మ పోసి మళ్ళీ తనవాడిని చేసుకుంటుంది
  ఆమె సీతై రావణునికి బందీ అయితే అతను రాముడై విరహసాగరం దాటి వస్తే ఆమె విరహాగ్నినుండి విముక్తురాలై అతన్ని చేరుకుంటుంది
  ఇలా ఎన్నో జంటలు ... ఒకరి ప్రేమ తక్కువా కాదు మరొకరి ప్రేమ ఎక్కువా కాదు. దేనికదే సాటి...

  ReplyDelete
 2. ప్రదీప్ గారి స్పందనకు చిన్న కొనసాగింపు ..
  అలిగినప్పుడు చెలరేగి తలపై తన్నిన ఆమే ...
  అతడు అలసినప్పుడు ధనుర్బాణాలు
  ధరించి నరకుని సంహరించింది .... :)

  ReplyDelete
 3. పద్మార్పిత గారు, కవిత చదివాక కాసేపు కామెంటాలా లేదా అని ఆలోచిస్తూ

  వెళ్ళి పోదామనుకున్నా
  ఆమె చేయి వదలనంది..
  వుండి నాతో తీసుకెళ్దామనుకున్నా
  ఆమె నెట్టి వేసింది.

  ReplyDelete
 4. పూర్తిగా చదివాక నాకు చెప్పాలనిపించినది పరిమళం గారు చెప్పేశారు.. బాగుందండి..

  ReplyDelete
 5. బాగుందండి :)

  ReplyDelete
 6. పరిమళం గారు, మీ కొనసాగింపు బాగుంది.

  ReplyDelete
 7. కవిత బాగుందండి.

  అందరూ అలా ఉంటే.. మనకు

  "మనసున మనసై బ్రతుకున బ్రతుకై
  తోడొకరుండిన అదే భాగ్యమో, అదే స్వర్గమో.. "

  లాంటి మంచి మంచి పాటలు వినే భాగ్యం కలగదేమో.
  good that every pair is not like this.

  ReplyDelete
 8. బాగుంది.

  @ఆత్రేయ గారూ..
  ఎంత చేదు నిజం అండీ..

  ReplyDelete
 9. ఆమె నెల తప్పిందా లేదా అని చూడకు ,
  నెల జీతం తెస్తోందా?లేదా? అన్నది చూడు .

  ReplyDelete
 10. ప్రతి ఒక్కరిలో అన్నీ కాకపోయినా ఏదో ఒక మంచి గుణం ఉంటుంది అని నేను నమ్ముతాను..
  ప్రతి టపాని చదివి నన్ను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను..
  మన బ్లాగర్స్ అందరికీ అతడిలోని మంచి ఆమెకి, ఆమెలోని మంచి అతడికి లభించాలని కోరుకుంటాను..
  నేను కోరుకున్నదాంట్లో ఏమైనా తప్పులుంటే మన్నించమని వేడుకుంటున్నాను..

  ReplyDelete
 11. రవిగారూ.... చిన్న అచ్చుతప్పు అనుకుంటాను!!!
  ఆమె నెల తప్పిందో లేదో అతను...
  అతడి నెల జీతం ఎంతో ఆమె ...
  చూసుకుంటే బాగుంటుంది కదండీ!!!

  ReplyDelete
 12. దారుణం పద్మగారు,
  అతడి భాహుబలం బాదించినా ,ప్రేమపొందాలనే అతని ఆరాటం అర్తం చేసుకోవాలనుకోవడంకనిపించే కరకు దనాన్ని కాకకనిపించని మమకారాన్ని వెతుక్కొమనడం భావ్యమేనా. ఆలోచించండి చాలామంది ఆసిడ్ దూర్తులంతా ప్రేమపొందాలనే ఆరాటం తోనే మృగాలుగా మారుతున్నారు.నొప్పించే చేష్టలను కాక మైమరిపించే లాలనలను చూడాలనుకోవడం మహిళల స్వాతంత్రభావనల్ను అవమానించి పురుష దురహంకారానికి వంత పాడడమే అవుతూంది.నిజానికి పులులలాంటి క్యాట్ ఫ్యామిలిలో శృంగారం ఇలాగే వుంటూంది.ఆడపులిని మగపులి రక్కుతూ,గీకుటూ గాయపరచి,బలహీన పరచి తన వాంఛతీర్చుకుంటుంది.దీన్నే మన పెద్దలు మార్జాల ప్రణయంగా ప్రవచించారు. ఓ మహిళగా(?) ఈ భావనలు ప్రచారం చేయడం నేరం.ఆమె గురించి చెప్పినపుడు కూడా ఆమెరాగాలాపన చెయగలదో లేదో అనికాక అవసరమైనపుడు సపర్యలు చేస్తుందో లేదో చూడమనడం మరింత దారుణం.మీరాతల లోతులను మరోసారి పరిశీలించుకోండి.స్త్రీ పురుషుల మధ్య ప్రజాస్వామ్యయుత సంబందాన్ని మాత్రమే కోరుకుందాం.
  -సుబ్బారెడ్డి

  ReplyDelete
 13. దారుణం పద్మగారు,

 14. సుబ్బా రెడ్డిగారూ! గుడ్ కామెంట్!

  ReplyDelete
 15. పద్మార్పిత గారూ..
  చాలా బావుంది మీ కవిత.!

  ReplyDelete
 16. meee poetry ni deep ga ardam chesuko lenu but vatillo dagi unaa feelings ni i can feel them with those pics padmarpita garu....thy r xclent

  ReplyDelete
 17. అతడు-ఆమె: ప్రకృతి, పురుష భావన. ఇది ఎడతెగక పారే ఏరు. ఎంత తోడితే అన్ని భావనలు వెలికి తెచ్చే జలం వున్న వూటభావి. మీరు వ్యక్తం చేసిన్నిటితో ఏకీభవించుకున్న వ్యక్త పరిచిన తీరు బాగుంది.

  ReplyDelete
 18. చాల బాగుందండి వెనుక పరిమళం కొనసాగింపు కూడా .

  ReplyDelete
 19. పద్మర్పిత గారు,

  మీ కవిత చాలా చాలా నచ్చింది.
  ఇంతకంటే ఎక్కువ చెప్పలేను.
  నాతో కాదు.
  -తిరుపతి పెద్ది

  ReplyDelete