1. తన జంటపక్షిని గాయపరచి వెళ్ళిన వాహనాన్ని ఎలాచూస్తుందో....

2.ఆహారాన్ని తెచ్చి ప్రేమతో తినిపించి ఇలా ఓదారుస్తుందో......

3.ఇంతలోనే నన్ను వదలి ఎలా వెళ్ళిపోయావు అని రోధిస్తుందో....

4..నీవెంట నన్ను కూడా తీసుకుని పోరాదా!! అని అడుగుతుందో...

5.నీవు లేకుండా నేనెలా జీవించను అని ఇలా ఆక్రోషిస్తుందో....

6.దీని మరణానికి కారణమైన వారిని ఏమీ చేయలేక మౌనంగావుందో????

ఇది నిజమో కాదో నాకు తెలియదంటా!!!!
కాని, ఆమూగజీవులకే కనుక మాటలువస్తే
నాకన్నా బాగ చెప్పి వుండేవి అనుకుంటా!!!!
ఏది ఏమైనా ప్రేమనేది ఎవరికైనా ప్రియమేనంటా!!!!
అది వ్యక్తపరచడంలోనే వివిధ రూపాలుంటాయనుకుంటా!!!!
మీరు ఏమంటారోనని ఎదురు చూస్తుంటా!!!
This comment has been removed by the author.
ReplyDeleteపద్మార్పిత గారు నిజమే.. ప్రేమ ఎవరికైనా ఎక్కడైనా ఒకటే, దాన్ని వ్యక్త పరచే తీరే మారుతూ ఉంటుంది.
ReplyDeleteఓ పువ్వు నుంచి తాజ్మహల్ దాకా..
ఓ నవ్వు నుంచి ఉద్గ్రంధం దాకా..
మీరేమీ అనుకోను అంటే చిన్న మాట. చెప్పేటంతటి వాడిని కానూ, కానీ.. అభిమానంతో చెపుతున్నా..
ఒకోసారి మీరు అంత్యప్రాస కోసం పడే తపన, కవితలోని భావాన్ని మింగుతుంది అనిపిస్తుంది. (మీ కవితల్లో అదే నచ్చిన వాళ్ళూ ఉంటారు..) ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే.
మీరు బాగా రాస్తారు.. చాలా బాగా రాస్తే చూడాలని ఆశ.
ఆత్రేయగారు ధన్యవాదాలండి... మీరు నాకు సలహా ఇవ్వడానికి ఇంతగా ఆలోచించారు అని కించిత్ భాధగా ఉన్నా, ఇప్పటికైనా మీ అభిమానాన్ని చూరగొన్నందు ఆనందంగా వుంది.తప్పక సరిచూసుకుని బాగా వ్రాయడానికి ప్రయత్నిస్తాను.... ప్రశంసలే కాదు, సలహాలను కూడా సదా ఆహ్వానిస్తాను.
ReplyDeleteనా అభిప్రాయం ఆత్రేయగారిదే.. అలాగే మీరు అలా ప్రాస తో రాయడాన్ని ఇష్టపడేవారు కూడా ఉంటారు... అంటే కవితలు సింపుల్ గా ఉండాలనుకునేవారు.. మా వారు ఒక సారి మీ కవిత చదివి చాలా బాగా రాసారు ఈమె అన్నారు ..అయితే ఇంతకంటే బాగా మీరు రాయగలరు .. అది మీలో ఉంది :) కాని మీరూ నాలాగే అంత్యప్రాస కోసం అసలు కవితలో భలాన్ని తేలిక చేసేస్తున్నారు .. చెప్పే అంతదాన్ని కాదు నిజానికి.. నేను చక్కని కవితలు రాయలేక పోయినా సలహా ఇవ్వడం కూడా ఒకరకం గా బాధగా ఉంది :)
ReplyDeleteచిత్రాలు మనసుని కలచివేశాయి . ఆ మౌనం వెనుక దయలేని దైవాన్ని కూడా క్షమించే మార్దవం కనిపిస్తోంది .పక్షయితేనేం ? ప్రేమ ఎవరిదైనా ప్రేమే !
ReplyDeleteayyoo!!!
ReplyDeletesrustilo...kalmasham swaardham leni jeevaalu..avi ...prema roopam ekadinaa okate ani mee photokavitha lo ...
ReplyDeleteఇలాంటి photoలు ఒక కుక్కవి (సాటి కుక్క road accident లో నేల కూలితే) బాంబేలో తీసినవి కుడా ఎక్కడో చూసాను. మనసును కలచి వేస్తాయి. మీరి పంచుకున్నందుకు త్hanks.
ReplyDeleteచక్కటి భావనలతో చాలా బాగా చెప్పారు..
ReplyDelete