తొలిపొద్దు నిను తాకే వేళ చిరు వెలుగు నేనవనా
మండుటెండలో చల్లని నీడనై నీ వెంట నేరానా
సంధ్య వేళ నిను తాకి వెళ్ళే చిరుగాలి నేనవనా
నీతో కలసి జీవించే నీతోడునీడనై నేనుండిపోనా!
పలుకై నా గొంతు నుండి రావా
కవితై కలం నుండి జాలువారవా
నా గుండెలో దీపమై నీవుండిపోవా
ప్రేమకి ప్రతిరూపమై నిలచి పోవా!
శ్వాస తీసుకున్న ప్రతీసారి గుర్తొస్తావెందుకు
శ్వాసలేకుండా జీవించలేనని తెలుసుకదా నీకు
శ్వాస కూడా నీ తలపు తరువాతే వస్తుందెందుకు
శ్వాసకి కూడా నాపై ఇంత అలుకెందుకు!
నీవు అలసిన వేళ నీకు అమ్మఒడిని నేనౌతా
విసిగివేసారిన వేళ విశ్రాంతి నేనౌతా
నీవు నిదురపోయే వేళ జోలపాట నేనౌతా
నీ నిదురలో నేనొక కమ్మని కలనౌతా!!!
శ్వాస తీసిన ప్రతిసారి గుర్తొస్తావు .....
ReplyDeleteఅలసిన వేళ అమ్మ ఒడి ...........చాల చాల బాగున్నాయి బొమ్మ అద్భుతం !
బాగుంది
ReplyDelete"శ్వాస తీసుకున్న ప్రతీసారి గుర్తొస్తావెందుకు" - ఇది హిందీ దేవదాస్ సినిమాలో విన్నాను. చక్కగా వాడారు ఇక్కడ