మనమెవరు????
నా స్నేహితురాలు అమెరికా నుండి నిన్న హైదరాబాద్ వచ్చింది. ఇద్దరు అమెరికన్స్ కూడా ఇండియా చూస్తాను అంటే తనతోపాటు తీసుకుని మొత్తం భారతదేశం అంతా చూసి చివరికి నిన్న మా ఇంటికి వచ్చారు. మా కబుర్లు అయిపోయి భోజనం చేసిన తరువాత అమెరికన్స్ తో ఎలావుంది ఇండియా మరియు ఇండియన్స్ అని అడిగితే వారు ఆశ్చర్యంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని భారతదేశానికేం ఎంతో అద్భుతమైన దేశం కానీ మాకు ఇక్కడ ఇండియన్స్ ఎవరూ కనిపించలేదు మీరు ఎవరిగురించి అడుగుతున్నారు అంటూ ........
కాశ్మీర్ లో మాకు కాశ్మీరి వాళ్ళు, పంజాబ్ లో మాకు పంజాబీస్, మరాటీస్, మార్వాడీస్, తమిలియన్స్, మళయాలీస్ ని ఆఖరికి ముస్లింస్ , క్రిస్టియన్స్, బుద్దిస్ట్, హింధూస్, జైన్స్ ఇలా రకరకాల వాళ్ళని చూసామే కానీ మాకు ఎక్కడా ఇండియన్స్ కనపడలేదు అన్నారు. వాళ్ళు అన్నది ఏ ఉద్దేశంతోనైన నాకుమాత్రం వాళ్ళన్నమాటలే ఇంకా నా చెవిలో ప్రతిధ్వనిస్తున్నాయి. మీతో చెప్పుకుంటే కనీసం కొంత మనశ్సాంతిస్తుందేమో అని నా ఈ చిన్ని ప్రయత్నం.
Subscribe to:
Post Comments (Atom)
ఇండియా అనేది ఒక ఆలోచన,ప్రస్తుతం ఒక భౌగోళిక సమూహం. భారతీయత అనేది ఒక infused భావన. ఉందంటే ఉంటుంది లేదంటే లేదు. ఆ మాత్రం దానికి షాక్ అవ్వాల్సిన పనిలేదు.
ReplyDeleteఅమెరికాలో కూడా మనకు అమెరికన్స్ కనపడరు. ఇండియన్స్ (నేటివ్, మనం), మెక్సికన్స్, ఎసియన్స్, యూరోపియన్స్, ఆఫ్రికన్స్ వగైరా... అయినా అందరిని అమెరిన్స్ అని పిలుచుకుంటారు..
ReplyDeleteగమ్మత్తుగా లేదూ..
వివిధత్వాన్ని చూసి అచ్చెరువు చెంది ఆవిడ ఆ మాటలు అని ఉంటుందే కానీ, వేరే ఉద్దేశం అని నాకు అనిపించడం లేదు...
unity in diversity :) దీంట్లో అశాంతి పొందాల్సినది ఏముంది? be happy. proud to be an indian
ReplyDeleteబహుసా, వాళ్ళు ఇండియన్స్ అంటే, ఆదివాసీలని పొరబడి ఉంటారు
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteDhavala vaari abhipraayam correct kaavochu, Indians ante American Indians (American Tribals)anukuni vuntaaru.
ReplyDeleteAa maata alaa vunchithe..
Praanthaayata anedi MIND laantidi
Jaatheeyatha anedi HEART laantidi
Maanavatha anedi AATMA laantidi..
So, vaaru mana desam lo different areas lo PRAANTHEEYTHA Choosi vuntaaru(Dhavala vaari abhipraama correct kaakapothe).
Jaatheeyatha anedi antha cheap kaadu eappudu padithe appudu bayata padadu.. Mana Jaatheeyatha ki problem voche times lo(India Cricket match lo vodipoyetappudu, Mumbai lo Taj Hotel lo terrorists live lo choostunnapudu.. elaa..)
So, meeru haayigaa relax avvandi, vaari abhipryaam venuka vaari anubhavam vuntundi.. mee manasu (jaatheeyata) kaadu kadaa(vaari abhipraayam venuka)