రంగుల జీవితం!

అందమైన జీవితాన్ని ఏయే రంగుతో అద్దమంటావని నన్నడిగితే!!
మనసుని స్వఛ్ఛంగా వుంచే తెలుపుకే మొదటి స్థానమంటాను.
ఎరుపు క్రోధానికే కాదు ప్రేమకి కుడా చిహ్నమేనంటాను.
నీలంలోని నిర్మలత్వాన్ని సొంతం చేయమంటాను.
పచ్చని పైరు గాలిలా జీవితం సాగిపోవాలనుకుంటాను.
పసుపు పవిత్రతతో పాటు శుభాలను ఒసగుతుందనుకుంటాను.
నలుపు రంగా నేను నిన్నెలా మరచి పోతాను!!
ఇన్ని రంగులను చూపిన కనుగుడ్డే నీవంటాను.
అందరి జీవితాలు రంగులమయం కావాలని నే కోరుకుంటాను.!!!

12 comments:

 1. బాగుందండీ సర్వే జనా: సుఖినోభవంతు అన్న మాట. అస్తు !!

  ReplyDelete
 2. బాగుందండి .......నాకు తెలుపన్న ..లేత నీలమన్న పడిపోతాను ..మీ ఇంద్రధనస్సు బాగుంది .

  ReplyDelete
 3. "నలుపు రంగా నేను నిన్నెలా మరచి పోతాను!!
  ఇన్ని రంగులను చూపిన కనుగుడ్డే నీవంటాను. " - Super....

  ReplyDelete
 4. ఆత్రేయగారు..మీరు అస్తు అన్నాక దానికి తిరుగులేదు!
  మంచి స్నేహితుడి మంచి మనసుకి జోహార్లు!
  చిన్నిగారు మీ మనసు నాకు తెలుసు!
  ఫణిప్రదీప్ గారు మీ స్పందనకు నా ధన్యవాదాలు!

  ReplyDelete
 5. "బాగుంది మీ టేస్టు....."

  ReplyDelete
 6. చాలా బావుందండి.....పక్కన ఫోటో చాలా ఆప్ట్ గా ఉంది.

  ReplyDelete
 7. మీ కవిత ఏడు రంగుల హరివిల్లు లా ఆహ్లాదంగా ఉంది
  nise one
  jayabharath

  ReplyDelete
 8. మీ కవితలు చూస్తుంటే చిన్నప్పడు నేను రాసుకున్న కవితలు గుర్తువస్తున్నాయి :) ఇంచుమించుగా ఇలాగే రాసేదాన్ని .. అందుకే super super అన్నమాట

  ReplyDelete
 9. padma garu meru kuda cinimalo try cheyachhu kada

  ReplyDelete
 10. padma garu meru kuda cinimalo try cheyachhu kada

  ReplyDelete
 11. బాగుందండీ మీ హరివిల్లు!

  ReplyDelete