నీ,నా,మన....

నీ మనశ్శాంతి నేనై
నీ కంటిపై కునుకునై
నీ కలలన్నీ నావై
నీ ప్రతి కదలిక నేనౌతా!!

నా కాటుక కళ్ళే నీవై
నా బుగ్గన సిగ్గులు నీవై
నా అలోచనాసరళే నీవై
నా చిరునవ్వులన్నీ నీకిస్తా!!

మన ఇరువురిది ఒకటే గమ్యమై
మనం ఒకరికొకరు ఒకరిమై
మనం మరికొందరికి ఆదర్శమై
మన జీవనయానం సాగిద్దాం!!!

10 comments:

  1. నీ కంటిపై కునుకునై
    నీ కలలన్నీ నావై
    నీ ప్రతి కదలిక నేనై
    నీ మనశ్శాంతి నేనౌతా!!

    ilavunte baguntundani naa kanipinchindi

    any way nice to read ur poem

    ReplyDelete
  2. నిండు వేసవిలో పుచ్చకాయ తిన్నంత కూల్గా,ఉండి మీ కవిత అన్ కూల్నేస్ని అనుకూలంచేసింది.చలా చాలా బాగుంది.

    ReplyDelete
  3. నీ మనశ్శాంతి నేనై
    నీ కంటిపై కునుకునై
    నీ కలలన్నీ నావై
    నీ ప్రతి కదలిక నేనౌతా!!

    - అవును, నిజంగానే అన్ని చరణాల్లో ఈ కదలిక వుంటే బాగుండేది.

    ఇందులో లయ నాకు బాగా నచ్చింది.

    ReplyDelete
  4. నీవినా మనలేని తత్త్వాన్ని మీ "నీ,నా,మన...." తో చెప్పిన తీరు బావుంది. ఇంకాస్త లయ, అల్లిక ఏర్పడితే మరింత హత్తుకునేదా? ఏమో ఏ ప్రేరణకి ఎంత ధారణో ఆయా మనసుల నిర్ణయం!

    ReplyDelete
  5. hmmmmm...baagundi padma!

    ReplyDelete
  6. mitramaa... padalaa koorpu inkoncham unte baagunnedi...

    ayinaa... meeku nenu cheppetanti vaadini kaanulendi... yedo... cheppalane pichi tappa...

    modata vrasina... kavitalulaagaa ippudu vrayalekapotunnaru yemi... denikani... apppudu mee kavitalaloo veliti unnaa... manasuki koncham alochinpa cheseviga undevi.. appudu... kaani ippudu alaa ledu.... kavitalalo... baavam kanipinchamtam ledu munduvaatilaa... leka... naa manasu marindaa yemo teliyatam ledu...

    ReplyDelete
  7. Thanks to one and all...

    ReplyDelete