గులాబీలమై మనం...


అందమైన గులాబీ మొక్కనొకటి నాటాను
ప్రతిరోజూ నీరుపోసి దాన్ని పెంచాను
పెరుగుతున్న మొక్కని చూసి మురిసాను
మొగ్గ తొడిగినవేళ మదిన ఇట్లు యోచించాను!

అందమైన గులాబీమొగ్గ చుట్టూ ముళ్ళేల
పువ్వు కొరకై ముళ్ళని పోషించనేల??
తలచినదే తడవు నీరుపోయక వదిలేసానల
గులాబీ వికసించకనే నేలవాడుతూ అందిలా!

అందరిలో మంచిని నాతో పోల్చి చూడండి
ప్రేమనే నీరుపోసి మొక్కని పెరగనీయండి
మొక్క మొక్కకూ మొగ్గలు తొడగనీయండి
తప్పులనేవి ముళ్ళై పట్టుకుని వుంటాయండి
ముళ్ళని చూసి మొగ్గలని వాడనీయకండి
అందమైన గులాబీల కొరకై ఎదురుచూడండి
ముళ్ళు గుచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండండి
గులాబీల తోటలో పూలని విరగబూయించండి
అందరి ముఖాల్లో ఆనందాన్ని వికసించనీయండి!

16 comments:

 1. మనిషిలోని గుణానికి ప్రతీకగా గులాబీని తీసుకున్న తీరు బాగుంది. తన సౌందర్యంతో తనలోని ముళ్ళను కప్పివేసె అవకాశం గులాబీకున్నట్లు మరి దేనికీ లేదేమో...

  ReplyDelete
 2. మొగ్గ తొడిగిన మీ భావన, అందమైన గులాబీలా వికసించి, మనసునిండా పరిమళించింది.

  ReplyDelete
 3. చెడే ము౦దు చూస్తాము..మ౦చి ఉన్న చిన్న చెడు కప్పేస్తు౦ది... గులాబిపువ్వు కి అ౦ద౦,ఆకర్షణ,ర౦గు,పరిమళ౦ అన్ని ఉన్నా ముళ్ళు ము౦దు చూస్తాము...చాలా చాలా మ౦చి సున్నితమైనా అధ్బుత౦గా కల్పి౦చారు...చాలా బాగు౦ది

  ReplyDelete
 4. పద్మార్పితా...ఇలా బొమ్మలతో పిచ్చెక్కిస్తే ఎలా:)
  కవిత కూడా బాగుంది....

  ReplyDelete
 5. బంధాలతో బాధలని దాచి నట్లు
  సౌందర్యం తో సమస్యలని దాచి నట్లు
  లేతగులాబీ ఎందిన ముళ్లని దాచుతుంది
  ఆకర్షించి మనసులని దోచుతుంది....

  మీకో రహస్యం చెప్పనా.?

  అంటు పెడితే చాలు అంటు కునే మొక్క ఇదీ ,కాని
  ఫలాలని ఇవ్వడం మాత్రం చేత కానిది...

  అందుకే దీనిని ప్రేమకి
  ప్రతిరూపంగా చూపిస్తారు...

  idi naa spandana maatramea...

  ReplyDelete
 6. that"s why.....
  "HANDLE WITH CARE"...

  ReplyDelete
 7. చాలా బాగుందండి. మొత్తానికి లేత గులాబి తొటే చెప్పించారుగా ముళ్ళనుంచి ఎలా రక్షించుకోవాలో.

  ReplyDelete
 8. పద్మ గారు! సున్నితంగా బాగా చెప్పారు.
  నెల రోజుల క్రితం మీ బ్లాగులోని అన్ని కవితలు అంటే మీరు బ్లాగు ప్రారంభించినప్పటినుంచి అన్నీ చదివాను. అందులో నాక బాగా గుర్తుండిపోయిన కథ ఒకటుంది. అది " వక్రించిన విధి ". చాలా బాగా రాసారు. "వెన్నెల్లో ఆడపిల్ల"ని స్పూర్తిగా తీసుకుని రాసారు. ఆ కథ ఎందరికో స్పూర్తి.
  మీ కథకి ఆ కథకి సంబంధమే లేదు. మీకొచ్చిన కామెంట్ల వల్ల కథలు రాయడం మానేసారు. ఇప్పుడు చెప్తున్నాను అది చాలా బాగుంది. మళ్లీ కథలు రాయండి.
  నాకింకా గుర్తుందంటే ఎంత బాగుందో అర్థం చేసుకోండి.

  ReplyDelete
 9. చాలా బాగా చెప్పారు....ఫోటో అదిరిందండి...

  ReplyDelete
 10. స్పందించిన ప్రతి హృదయానికి ధన్యవాదాలు!!
  సవ్వడిగారు తప్పక కధలు రాయడానికి సాహసిస్తానండి చదివి తిట్టుకోకండేం:):)

  ReplyDelete
 11. Indeed a well composed, well arranged poetry. But so real!!!
  I do think thorns are as good as the roses, because its the thorns and the wounds given by them which make the roses more worth!

  Srinivas R Bitla

  ReplyDelete
 12. Anonymous09 May, 2010

  మీ బ్లాగ్ మొత్తం కవితలు చదివించేశారుగా...చాలా చక్కగా ప్రెసెంట్ చేశారు..ఒక్క బిగిన ఏదీ వదలబుద్ది కాలేదు..అభినందనలు...

  ReplyDelete
 13. ammo em vrathalandi meevi....good...bugunai anni...chaala chaala

  ReplyDelete
 14. excellent....chaala baagundandi...mee polika baagundi ..mullani tappu to polchi moggalu vaadipokoodadani baga chepparu

  ReplyDelete