ప్రేమ-పెళ్ళి


ప్రేమ పెళ్ళికి సూర్యోదయం అయితే ప్రేమకి సూర్యాస్తమం లాంటిది పెళ్ళి!

బయటివాళ్ళు లోనికి, లోపలివాళ్ళు బయటపడాలి అనుకునే పంజరం పెళ్ళి!

ప్రేమకి మనలో చోటిస్తే, మనకి ఎదుటివారి మనసులో చోటిస్తుంది ప్రేమ!

మనందరి స్వభావాలకి ఉండవలసిన అందమైన అవసరం ప్రేమ!

హక్కులని సగానికి తగ్గించి భాధ్యతలని రెండింతలు పెంచేదే పెళ్ళి!

స్త్రీల సంతోషాన్ని, పురుషులు స్వేఛ్ఛని హరింపచేసేదే పెళ్ళి!

నిత్యయవ్వనంగా కనపడే ప్రతి హృదయంలో నిండి ఉండేది ప్రేమ!

చక్కని వాఖ్ఛ్యాతుర్యంతో శ్రధ్ధగా అలవరచుకునే విద్య ప్రేమ!

వాద ప్రతివాదనలతో సాగే సుధీర్ఘ సంభాషణలఝరి పెళ్ళి!

వద్దువద్దంటూనే వందలాది మంది చిక్కుకునే ఊబి లాంటిది పెళ్ళి!

(ఏంటి పద్మార్పితా....ఈ లెక్చర్ అని నన్ను ఇన్వాల్వ్ చెయ్యకండి ఈ మాటర్ లో, ఇదంతా పోయిన సంవత్సరం పెళ్ళై ఆషాడం ఎండింగ్ లో నా బ్రదర్ కి కలిగిన జ్ఞానోదయనికి నేనిచ్చిన అక్షరరూపం ఈ ప్రేమ-పెళ్ళి!)
Just for fun:):)

16 comments:

  1. Anonymous31 July, 2010

    hahhah...bagundi.. :)

    ReplyDelete
  2. మనందరి స్వభావాలకి ఉండవలసిన అందమైన అవసరం ప్రేమ!
    పద్మార్పిత గారూ బాగుందండీ..

    ReplyDelete
  3. అహా, ఓహో...మీలాంటి అక్కలుండాలేగాని మాలాంటి తమ్ముళ్ళు రెచ్చిపోమూ...ఒక్కర్నేంటి ఎంతమంది అమ్మాయిలను ప్రేమించడానికైనా రెఢీ,దాచుకోలేనంత ప్రేమ ఉంది మరి ... :) :)

    అక్షర రూపం బావుందండి.

    ReplyDelete
  4. పద్మార్పిత గారు! సోరీ బ్లాగుల పోస్ట్ ని చూడలేదు.

    మురళి గారి కామెంట్ చూసి ఇది చూసాను.

    నా బ్లాగు చూస్తే అంత మంచి పాట గుర్తొస్తుందా... ఈ పాట నేను వినలేదు కాని ఆ లైన్ బాగుంది. చాలా నచ్చింది.

    నా బ్లాగు గురించి కూడా రాసినందుకు చాలా ధన్యవాదాలు.

    నాకు మొదటి కామెంట్ పెట్టింది మీరే.. అప్పటినుండి మీ అభిమానిని ఐపోయానన్నమాట.

    మీ కవితలకు కూడా అభిమానినే!

    ReplyDelete
  5. సహజీవనం సరి అయిన పద్దతి అనుకుంటా! ఎవరి హక్కులు వారి దగ్గరే ఉంటాయి. వేరొకరి జోక్యం ఉండదు. వాటికి భంగం కలిగినప్పుడు చక్కగా విడిపోవచ్చు . ఊబిలో కూరుకుపోయినా లేవడానికి పక్కన నిచ్చెన ఉంటుంది.

    ReplyDelete
  6. Hi Padmarpita garu mee kavithalu. mee pic lu Chala chala bagunnai andi. meeru ma kosam mee abimanula kosam inkka chala chala kavithalu rayalandi k .

    ReplyDelete
  7. bavundi. intaki edi better antaru. prema or pelli

    ReplyDelete
  8. బాగు....బాగు.:)

    ReplyDelete
  9. ఇదేమిటబ్బా.. పద్మార్పిత గారు మగవాడిలా ఆలోచిస్తున్నారు అనుకున్నా.. సోదరుడి ఆలోచనలన్న మాట!! బాగుందండీ మీ అక్షరీకరణ..

    ReplyDelete
  10. మీకు 64 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

    - శిరాకదంబం

    ReplyDelete
  11. పద్మార్పిత గారూ బాగుందండీ మీ కవిత.

    ReplyDelete