మగాడివా!?


కన్నుమిన్ను కానక కండకావరమెక్కి
కామంతో మధమెక్కువై కొట్టుకుంటూ
ఒళ్ళుబలిసి తిరగబడలేని వారిపై బడి
దారుణంగా ఎగబడి అత్యాచారం చేసేటి
నువ్వు మగాడివా నీది మగతనమా!?

ఎక్కడ నుంచైతే పుట్టావో అక్కడే పెట్టి
విచక్షణ కోల్పోయి కళ్ళు మూసుకుని
రెండు నిముషాల సుఖానికి రాక్షసుడివై
మృగంలా మారి మీద పడి హింసించేటి
నువ్వు మీసం మెలేయడం న్యాయమా!?

ఆమె ఇష్టంలేదు వద్దని అరుస్తుంటే కొట్టి
తాళి కట్టించుకున్నాక పెళ్ళాం కదా అని
ప్రతాపమంతా చూపి ఫస్ట్రేషన్ తీర్చుకుని 
సాడిస్టులా సెక్స్ చేసి సంతతిని పెంచేటి
నువ్వు ఒకపెద్ద పుండాకోరంటే కోపమా!?

రాత్రి లేపి కలలో కులుకుతావటని మొట్టి
ఒళ్ళురక్కి రంకుగట్టి పరువు పక్క పరచి
సిగ్గులేకుండా లైంగిక వాంఛతో జబ్బచరచి
అంగము ఉన్నది దానికోసమే అనుకునేటి
నువ్వు మగాడినని నిరూపించ సాధ్యమా!?

40 comments:

 1. తాళి కట్టాక కూడా బలవంతం చేయాల్సిన పరిస్థితి తెచ్చిన ఆ స్త్రీ ఆడదేనా ?

  ReplyDelete
  Replies
  1. Meeru baaga chepparu neeharika garu.

   Delete
  2. పెళ్ళాం అంటే కేవలం సెక్స్ కోసమే అనుకుని తాగుబోతైనా ఎటువంటి వాడైనా సర్దుకుపోవాలి అనడం సమంజసం కాదు నీహారికగారు...ఇవి నా పలుకులు కావు గాక కావు...మీ స్త్రీ సమాజోద్దరణ సంఘాల ఘోషణ.

   Delete
  3. ఆమె ఇష్టంలేదు వద్దని అరుస్తుంటే కొట్టి-సర్వసాధారణం స్లం ప్లేసెస్లో

   Delete
 2. అందరు మగవాళ్ళని ఒక బండకేసి బాదినట్లు ఉన్నారు పద్మార్పితా. ఇంత గరం గరం ఎందుకు ఎవరిపైనో? మొంతానికి మీ అక్షరాలు వాడి వేడి బాణాలు.

  ReplyDelete
 3. మీరు ఇలా స్త్రీ పక్షపాతిలా మారి మగవారిని తిట్టిపోస్తే అందరూ కలిసి దర్నా చేస్తారు జాగ్రత్త.హ హా అహా.

  ReplyDelete
 4. మాడంజీ మమ్మల్ని ఈ కోవలోకి చేర్చకండి.
  మేము భార్యాచాటు బాధితులం...అలాగే ఈ జీవితాన్ని నెగ్గించుకుని వస్తున్నాము.
  పిల్లలు పుట్టి పెద్దగా అయ్యి మాకు నీతులు భోధిస్తున్నారు.
  ఇప్పుడు మగాడని నిరూపించుకోవలి అంటారా???

  ReplyDelete
  Replies
  1. Tana maatalatho mana andariki churaka pette arpita gaarike churaka antincharu, bahu gattivaru Markandeya garu.😀

   Delete
 5. ఇంతటి కండకావరం ఎవరికి ఉంది ఈ హర్రిబర్రి జీవనంలో
  నిబ్బరంతో ముక్కుసూటిగా ప్రశ్నించారు.

  ReplyDelete
 6. ఎంతో ఘాటు పదాలు
  పవర్ఫుల్ పోస్ట్ పద్మార్పితగారు.

  ReplyDelete
 7. మగతనం ఉన్న మగాడు ఆడదాని స్వేచ్చని హరించడు
  నమగతనం ఉన్న మగాడు ఆమెను బానిసగా చూడడు
  మనిషికి స్వేచ్చనిచ్చే మగతనం గలిగిన మగాల్లు ఎవరు స్త్రీలని ఇబ్బంది పెట్టరు
  మగతనం లేని కొజ్జా గాల్లే స్త్రీలని పసిబిడ్డలని చెరబట్టి బలత్కారాలు చేస్తారు.
  మగాళ్ళు తలదించుకుని ఆలోచించవలసిన పోస్ట్ వ్రాసారు

  ReplyDelete


 8. మగాడివా ?

  హై వోల్టేజ్ విద్యుత్ :)


  జిలేబి

  ReplyDelete
 9. క్ట్ క్వశ్చన్లకు నో ఆన్సర్స్..

  ReplyDelete
 10. మాయచేసి మంత్రం వేసేది ఆడువారు
  బలం చూపి బలత్కరించేది మగవారు
  ఇలా సరిపోయె కదా ఇరువురికీ జోడి
  భగవంతుడు వేసెనాయె ఆడమగ బేడీ

  ReplyDelete
 11. మందం ఎక్కి కొట్టుకునే మగవారికి ఒక గుణపాఠం మీ పోస్ట్

  ReplyDelete
 12. ప్రియునితో అక్రమ సంబంధం పెట్టుకొని అడ్డువస్తున్నాడని తాళికట్టిన భర్తని భార్య కడతేర్చిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.పెళ్లి చేసుకున్న ఒక యువతిని, ఆమె కోరిక మేరకు ప్రియుడికి ఇచ్చి వివాహం చేసిన ఘటనలు ఉన్నాయి. అటువంటి వాటి పైన కూడా స్పందించండి పద్మార్పితగారు.

  ReplyDelete
 13. అలాగని అందరినీ ఒకతాటికే ముడివేయడం కూడా సబబు కాదు. మీ ప్రతీ పోయం ఆలోచనలు రేకెత్తించే విధంగా వ్రాస్తారు.

  ReplyDelete
 14. హయ్యరే
  అబ్బుర పరిచింది

  ReplyDelete
 15. ఖండిత పదజాలం వాడిన-ఇక్కడ అవసరం.

  ReplyDelete
 16. సాడిస్టు భర్త వేధింపు ఒక స్త్రీ ఆవేదనా మీ కవితలు కనబడుతున్నాయి. చిత్రంలో నిగూఢ అర్థం దాగిఉంది.

  ReplyDelete
 17. మీరు వ్రాసినవి కొవ్వుతో కొట్టుకుంటున్న మగవాళ్ళకి చెప్పుతో కొట్టినట్లు.

  ReplyDelete
 18. Sadist husband torcher horrible.

  ReplyDelete
 19. స్త్రీలపై జరిగే హత్యాచారం.

  ReplyDelete

 20. శృంగారావస్థలలో మొదటిది...
  దృక్సంగమమ్...అనగా చూపులు కలవటం కోరిక జనించటం!
  రెండవది ...చింతనం...అంటే ఆలోచించడం
  మూడవది...మనస్సంకల్పం....
  ఆతరువాత...జాగరం...నిద్రపట్టకపోవడం
  కృశించిపోవడం,విలాపము,ఉన్మాదము,వ్యాధి,జడత్వము,మరణం...

  ReplyDelete
 21. మృగంలా మారి మీద పడి హింసించేటి
  నువ్వు మీసం మెలేయడం న్యాయమా!?
  సూటిగా ప్రశ్నించారు

  ReplyDelete
 22. స్త్రీవాదతత్వం

  ReplyDelete
 23. పద్మార్పితగారి కలంలో చలనం ఏమైనదో

  ReplyDelete
 24. ప్రేమికుల వారం నెల రోజులు గడిచాయి
  పద్మార్పిత పెదవి కదపనేలేదు ఎందుకో

  ReplyDelete
 25. This comment has been removed by the author.

  ReplyDelete
 26. This comment has been removed by the author.

  ReplyDelete
 27. This comment has been removed by the author.

  ReplyDelete
 28. This comment has been removed by the author.

  ReplyDelete
 29. ఇది వచన కవిత్వమా? లేక పద్య కవిత్వమా?


  "ఎక్కడ నుంచైతే పుట్టావో అక్కడే పెట్టి
  విచక్షణ కోల్పోయి కళ్ళు మూసుకుని
  రెండు నిముషాల సుఖానికి రాక్షసుడివై
  మృగంలా మారి మీద పడి హింసించేటి
  నువ్వు మీసం మెలేయడం న్యాయమా!?"

  "ఎక్కడ నుంచైతే పుట్టావో అక్కడే పెట్టి" దీని భావమేమిటో, ఆడవాళ్ళపై అత్యాచారాల గురించి చెప్పటానికి అంత వివరంగా రాయాలా? నాకు అర్థం అయినా రీతిలో మాట్లాడుతున్నాను.

  భావుకత ఏమాత్రం కనిపించలేదు, సున్నితమయిన అర్థత అసలు కానరాలేదు. బొమ్మ కూడా అభ్యంతరకరంగా ఉంది అంటే నొచ్చుకోకండి!

  మరో విషయం! మీ బ్లాగు మీ ఇష్టం కానీ, అదేపనిగా ఆ పాట మోగటం నిజంగా విసుగు పుట్టిస్తోంది. ఇకనయినా ఆపితే మెలేమో!

  ReplyDelete
 30. Madam how are you?
  Is it everything going well?
  Why not posting anything?

  ReplyDelete