ఎలా చెప్పేది!?

నేడు నేను చెప్పాలనుకుంటూనే మళ్ళీ చెప్పలేకపోయాను
నాతోనే ఉండిపొమ్మని అరచి గోల చెయ్యాలి అనుకున్నాను 
వెళ్ళకుండా నాకోసం నన్నంటుండే శక్తి నీది అనుకున్నాను
చెప్పలేకపోయాను..చెప్పానన్న భ్రమలోనే బ్రతికేస్తున్నాను!

నేడు నిన్ను తనివితీరా హృదయానికి హత్తుకోలేకపోయాను
కౌగిలిలో బంధించి ఇరుశ్వాసలతోపాటు కరిగించలేకపోయాను 
నా ఊపిరున్నంత వరకూ నాతో ఉండమని అనలేకపోయాను
చెయ్యలేకపోయాను..ఏదో అనుకుంటా కానీ ఏమీ చెయ్యను!

నేడు నన్నూ నిన్నూ వేరుచేసేటి రేయినైనా ఆపలేకపోయాను
ఏమాయోచేసి నా మనోభావాల ముసుగుతో నిన్ను కప్పలేను 
నువ్వు లేని నా పరిసరాలన్నీ నవ్వుతుంటే నేనూ నవ్వలేను
నిస్సహాయురాలిని నేను..ఏబంధంతోను నిన్ను కట్టివేయలేను! 

నేడు నువ్వులేని నేను ఎంత అసంపూర్ణమో కూడా చూపలేను
అణువణువు నీ స్పర్శకోసం పడుతున్న తపన ఎలా తెలుపను
నువ్వు నావాడివై ఉండని ఏడ్చే ఎదఘోషను ఎప్పుడు చెప్పను
ఎన్నో చెప్పాలనుకునే నేను నేడేకాదు ఎప్పటికీ ఏమీచెప్పలేను!        

20 comments:

 1. మనసు భావాలకు దర్పణం.

  ReplyDelete
 2. cheppalenu
  cheyyalenu
  anukuni
  anni chesaru
  chestaru

  ReplyDelete
 3. హృదయాన్ని తడిమిన వాక్యాలు

  ReplyDelete
 4. చెప్పలేకపోయాను అంటూనే మొత్తం చెప్పేసారు
  మీ భావాల్లో అన్నీ పొందుపరిచారు...కుడోస్

  ReplyDelete
 5. అవునా...
  నిజమేనా
  ఏమీ చెప్పలేకపోయారా!!!???

  ReplyDelete
 6. బొమ్మలో అమ్మాయి నాలా ఎంత అమాయకంగా ఉందో

  ReplyDelete
 7. ఎన్నో చెప్పాలనుకునే నేను నేడేకాదు ఎప్పటికీ ఏమీచెప్పలేను. Ila antuneee Anni cheppesaru kani mee maatalu aa hrudayam ki eppudu cherutayo, ela cherutayoo.

  ReplyDelete
 8. బాగా చెప్పారు/

  ReplyDelete
 9. ఇరుశ్వాసలు కరిగిపోనీ..డిఫెరెంట్ నైస్ ఫీల్

  ReplyDelete
 10. bagundi ubikina bhavam

  ReplyDelete
 11. ఎప్పటికీ ఏమీచెప్పలేను :(

  ReplyDelete
 12. నాడు
  నేడు
  ఎన్నడూ
  చెప్పలేని
  విరహ
  వేదన

  ReplyDelete
 13. మెప్పించారు.

  ReplyDelete
 14. ఏదో మీమాంసలో ఉన్నారు

  ReplyDelete
 15. ప్రేమభావాలు ఇలా ఎన్నైనా మాట్లాడిస్తాయి.

  ReplyDelete
 16. అందరి అభిమానానికి వందనములు.

  ReplyDelete