కొలను కలువ..


కల్మషంలేని కలువ ఎదనుదోయ ఎల్లలతో పనిలేదనుకుని
కోమలకొలను గుండెపై వలపురెక్కలు విప్పి పడుకోనెంచి..
మల్లె సంపెంగలతో స్నానమిడి సొగసు సోయగమే చూపగా
తన్మయంతో కొలనులోని జలం గళంవిప్పి రారమ్మని పిలిచె!

తన పూపరిమళమే పరావర్తనం చెంది పలురంగులాయనని    
కొలను సామ్రాజ్యపు కోమలి తానని మనసా వాచానెంచి..
సంతోషంతో తబ్బిబై తన సర్వం స్వర్గం చేసి సమర్పించగా
లోతట్టు బంధనాల సరాలలో బిగించబడితినని అలగా ఎగసె!

గట్టుపై ఉండనూ లేక కొలనునీట మునిగితే ఊపిరి ఆడదని
విరిసీ విరియని వలపురెక్కలు అన్నింటినీ పూర్తిగా వొలచి..
చలిలో పల్లపుదిశగా పారుతున్న నీటిపాయను పెనవేసుకోగా
మోడుబారిన కాండముతో కార్యమేమని నీరు మౌనంగా సాగె!

ఒంటరి కలువకాడ బ్రతకలేక కడతేరనులేక జ్ఞాపకాలే తోడని
నిశ్శబ్ధపు ఘోషలో తనకి తానే తడిసి నిటారుగా నిలచి..
నీరు పల్లమెరిగినా నిజమైన ప్రేమ తప్పక పండునని ఆశగా
కపటంలేని కలువ సృష్టి తీరును ఎదురీది ఎదురు చూస్తుండె!

22 comments:

 1. ha ahaa thunda thunda cool cool :)

  ReplyDelete
 2. రమ్యమైన కొలనులో చంద్రుడిని చూడాలి అనుకోవడం కలువకు తగని మురిపెం.
  ఎదురు చూపులు ఎంత చూసినా తీరని దాహం. చిత్రం అతి సుందరం

  ReplyDelete
 3. నిశ్శబ్ధపు ఘోషలో తనకి తానే తడిసి నిటారుగా నిలచి..అత్యంత మధురం

  ReplyDelete
 4. కలువ ఎన్నటికీ ఒంటరిది కాదు.

  ReplyDelete
 5. kaluvabala
  kalavaramaa?

  ReplyDelete
 6. Beautiful
  after long time

  ReplyDelete
 7. ఓహ్ అంతేనా :)

  ReplyDelete
 8. కలువ ఎదురుచూపులు ఫలించాలి

  ReplyDelete
 9. కల్మషంలేని వారికి కష్టాలు

  ReplyDelete
 10. నిశ్శబ్ధపు ఘోష

  ReplyDelete
 11. Lovely picture and words.

  ReplyDelete
 12. అందాల కొలనులో అరవిరిసిన పద్మాలను చూస్తుంటే మనసుకెంతో హాయి. మరి విచ్చుకున్న వేవేల తామరలు కొలనంతా కనువిందు చేస్తుంటే.. గులాబీ వన్నెలతో రారమ్మని ఆహ్వానిస్తుంటే.. ఆ దృశ్యం అపురూపం కదా! అటువంటి అపురూప దృశ్యకావ్యం మీ కవనచిత్రం.

  ReplyDelete
 13. Ohh...kaluvaku chandrudu entho dooram

  ReplyDelete
 14. ఇంకెన్నాళ్ళు ఎదురీత?
  బొమ్మ బ్యూటిఫుల్...

  ReplyDelete
 15. కలువకు చంద్రుడు ఎంతో దూరం ...కమలానికి సూర్యుడు మరీ దూరం

  ReplyDelete
 16. ఆత్మీయ స్పందనలకు వందనములు

  ReplyDelete
 17. Excellent
  Painting & poem

  ReplyDelete
 18. కల్మషంలేని కలువ

  ReplyDelete