స్వతంత్ర యోధులం...

స్వాతంత్య్రం వచ్చిందెవరికి...మీకు నాకు దేశానికేగా?
దేశమంటే మట్టికాదోయ్ మనుషులనే కదా అంటారు 
అంటే ఎవరికి వారు అందరూ స్వతంత్రలనే అర్థంకదా!

అలాగైతే ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఉండొచ్చు
ప్రేమించిన వారిని పెళ్ళి చేసుకునో లేకో ఎగిరిపోవచ్చు
కాపురం చేసి కావాలంటే కని వద్దంటే పారెయ్యొచ్చు 
కన్నోళ్ళని ఇష్టమున్నట్లు పెంచి, వినకపోతే చంపొచ్చు
ఏది కావాలంటే అది నచ్చినట్లు చేసి చిందులెయ్యొచ్చు!

ఏది ఎక్కడా అలా జరగడంలేదు అదే మన ధౌర్భాగ్యం
ప్రేమించినా లేకపోయినా ముడిపడ్డ ఇరుజీవితాలే బంధం
పిల్లలను కని పెంచాలి తప్ప నిలదీయ కూడదే శాసనం
ఒకరిపై ఒకరు ఆధారపడి బ్రతుకుతున్న పరాన్నజీవులం 
అయినా వారికివారే స్వతంత్రులనుకుంటున్న మూర్ఖులం!

అంతెందుకు నీకు నచ్చిన దుస్తులు నువ్వు ధరించలేవు  
అనుకున్నవి అన్నీ అనుకున్నట్లు సాధించి గెలవనూలేవు
నీవు సంపాదించినవి ఏవీ కూడా నీకు శాశ్వితము కావు   
నీ అవయవాలను నీకు నచ్చినట్లు నీవు అమర్చుకోలేవు
చివరికి నీ ఆయువు తీరిపోతే ఒక్క క్షణము బ్రతుకలేవు!

మరెందుకని స్వతంత్రులమంటూ ప్రేలాపనలు సంబరాలు?
అస్థిర అడుగులకు చంచల మడుగులొత్తి జైజైకారాలు చేసి
   యోధులమని బిరుదులిచ్చుకునే అతి సామాన్యులం కదా!  
  

13 comments:

 1. డెబ్భై రెండేళ్ళ సుదీర్ఘమైన స్వాతంత్ర్య చరిత గల భాగ్యోదయ దేశాన.. నిరుద్యోగ సమస్య.. ఆరోగ్య సమస్య.. సమాన హక్కు సమస్య.. స్త్రీ శిశువులను అల్లాడించే సమస్య.. రాజకీయంగా మార్పులు తెచ్చి ప్రతి ఒక్కరి సమస్య నుండి శాశ్వతంగా ఉపశమనం కలిగించే తీరునే తిరగరాసి "దేర్ ఇజ్ ఎవ్రిథింగ్ ఫర్ ఎవ్రివన్స్ నీడ్" కు బదులు "గ్రీడ్, జెలసి, ఎన్వి" వంటివి దేశప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసి న్యాయాన్యాయాయల నడుమ గల వ్యత్యాసానికి చెరమగీతం పలికి.. సమాన హక్కులను కాలరాసే తీరుగా తయారయ్యింది నేటి సమాజం.. రాజకీయ స్వలబ్ది.. మొనొపొలి మార్కెటింగ్ స్ట్రాటజి.. నీరు, ధాన్యం వంటివి పొరుగు దేశాలకు తరలిపోతున్నా.. ఎవరికి వారై సమగ్రతను మరిచి.. ఎటో.. బాహ్య దేశాలకు మన సాంప్రదాయాలను వేలానికి పాడి..డెబ్భై మూడవ ఏట స్వాతంత్ర్యాన్ని జరుపుకుంటున్నామ్.. ఆకలి కేకలు.. నిరుద్యోగ హాహాకారాలు.. ఇవైతే పోస్ట్ పోన్ అవుతూనే ఉన్నాయి.. ప్చ్..!

  ReplyDelete
 2. రక్షాబంధము గురించి ఒక్కమాటను కూడా వ్రాయలేదు మీరు.

  ReplyDelete
 3. Namaste madam
  Mee kavitalu bagunnayi

  ReplyDelete
 4. స్వాతంత్ర్యం మనుషులకు కాదు మన దేశానికి వచ్చింది. దేశం అంటే రాజకీయ నాయకులు లబ్దిదారులు మనం కాదు

  ReplyDelete
 5. భౌతికంగా స్వాతంత్ర్యం కావాలని కోరుకున్నవారు ఎందరో కాష్టానికి పోయారు. అలా అని దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన వారు బ్రతికి ఉన్నారని కాదండి. మొదటి వారిని మరచిపోతే రెండోవారు శాశ్వితంగా గుర్తుండిపోయారు.

  ReplyDelete

 6. సత్యం ఒళ్ళు విరుచుకుని ముందుకు వచ్చింది.  ReplyDelete
 7. సప్ప సప్పగా
  సాగిన స్వాతంత్ర్యదినం
  :( :( :(

  ReplyDelete
 8. ఏది ఎక్కడా జరగడంలేదు
  Nice thought padmarpitaji

  ReplyDelete
 9. _/\_అందరికీ_/\_

  ReplyDelete
 10. నిజం చెప్పారు... షెహబాష్...

  ReplyDelete