విస్ఫోట విసర్జన..

                                                                             చల్లగా వచ్చి గుండెపై మత్తుగా కూర్చున్న నీవు
నాకే తెలియకుండా నా నరాల్లోకి నవ్వుతూ ప్రాకావు
ఎంతైనా నా ఊహాలోకపు ఉపక్రమణ ఉపోద్ఘాతం నాకు
అంతం ఏమిటో చెప్పకుండా చెప్పి ఉపేక్షించమంటావు!

వెలిసిపోయిన చీరకు రంగు నగీషీలు అద్దిన నీవు
కట్టుకుంటే చూడక అకస్మాత్తుగా అంతర్ధానమైపోతావు 
ఎంతైనా ఎండిన మదికి ఎదురైన ఎండమావివి నాకు
మిణుగురుల మెరుపులా మెరిసి మాయమైపోయినావు! 

ఇంత కాలం నా మనసును అంటిపెట్టుకున్న నీవు
హఠాత్తుగా నీ మందీమార్బలంతో తప్పించుకుపోతావు
ఎంతైనా నేను పరాయిదానని అప్పుడనిపిస్తుంది నాకు
కుమిలి ఏడ్చినా రానని కన్నీటిని దిగమ్రింగుకోమంటావు!

ఊటబావిలో నుంచి నీరులా ఉబికి వస్తావనుకున్న నీవు
నాకు తెలియకనే పలాయనవాదికి పర్యాయ పదమైనావు
ఎంతైనా రక్తస్రావం ఆగీ ఆరక కనబడని గాయానివి నాకు 
మనం కలిస్తే పుట్టే నిప్పుముప్పని విస్ఫోటం విసర్జించావు!

27 comments:

  1. మత్తులో మునిగి త్రేలుతున్నామని తెలిసి కూడా ఇంకా మునకలోనే ఉంటే ఎలా బయటపడక.
    2020లో అయినా బయటపడే ప్రయత్నం చేయండి పద్మార్పితగారు...అహా హా హా

    ReplyDelete
  2. వెలిసిపోయిన చీరకు రంగు నగీషీలు ఎక్కడ????

    ReplyDelete


  3. విస్ఫోట విసర్జన.- టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథా :)


    జిలేబి

    ReplyDelete
  4. జస్ట్ క్లాప్స్...

    ReplyDelete
  5. ఊటబావిలో నీరు ఉబుకుతుంది కానీ ప్రేమ ఉబకడం కొత్తగుంది. మజ్జారే మజ్జా!!!

    ReplyDelete
  6. అక్కడ ప్రైవసీ ఎక్కువగా ఉంటుంది ప్రేమించుకోవడానికి. :)

    ReplyDelete
  7. ఈ ప్రేమకు అంతం లేదు

    ReplyDelete
  8. వినీలాకాశం విశాలం.. అపుడపుడు మేఘావృతం అపుడపుడు తేటతెల్లం..
    మనిషి మనసు భావోద్వేగభరితం.. అపుడపుడు నవ్వుల పువ్వులు అపుడపుడు నవ్వుల పాలు..
    చిరాకు పరాకు వేదన వెసులుబాటు.. అపుడపుడు ఆశ్చర్యానందం అట్టాహాసం అపుడపుడు అంతులేని ఆర్భాటం..!

    ReplyDelete
  9. ఆశనిరాశల దాగుడుమూత కదా జీవితం
    అందులో ప్రేమ ఒక అపూర్వమైన ఘట్టం

    ReplyDelete
  10. Wish you happy new year padmagaru

    ReplyDelete
  11. It is very hard to digest more over pic is good andi.

    ReplyDelete
  12. వెవ్వెవ్వే వెక్కిరిస్తున్నారు

    ReplyDelete
  13. ఇంత కాలం నా మనసును అంటిపెట్టుకున్న నీవు, హఠాత్తుగా నీ మందీమార్బలంతో తప్పించుకుపోతావు..సహజమైన పక్రియ ఇది మనుషుల్లో. వ్యధాభరితం మీ కవిత.

    ReplyDelete
  14. నిప్పు ముప్పని

    ReplyDelete
  15. విస్ఫోట విసర్జన ఎంత వరకూ సాధ్యం అంటే మనలోని శక్తిని హరించి ఎదుటివారిని బలపరుస్తుంది.

    ReplyDelete
  16. మనం కలిస్తే పుట్టే నిప్పుముప్పని విస్ఫోటం..amazing

    ReplyDelete
  17. మీకు తెలియకుండా మీలోకి ప్రవేసించిన వారికి శిక్ష వేయండి.

    ReplyDelete
  18. garadi matalu jeevitamlo enno.

    ReplyDelete
  19. Block chesara madam blog?
    No posting anywhere
    Why why why

    ReplyDelete
  20. బ్లాగ్ బోసిపోయింది
    ఆమె భావాలకి గండిపడి

    ReplyDelete
  21. వెలిసిపోయిన చీరకు రంగు నగీషీలు అద్ది..

    ReplyDelete
  22. రోజూ బ్లాగ్ చూడ్డం
    చూసి నిరాశతో మరలిపోవడం
    ఎన్నాళ్ళు ఈ నిరీక్షణ??

    ReplyDelete
  23. మాడం గత కొన్ని రోజులుగా మీ పోస్టులు లేవు కారణం తెలుపగలరు.

    ReplyDelete
  24. ఏమైనారని విచారం... :(

    ReplyDelete
  25. అర్పిత ఆలస్య అభివందనములు _/\_
    తిట్టుకున్నా విసుక్కున్నా మీ అందరి అభిమానమే నా అక్షరాలు
    ప్రేమతో...
    మీ పద్మార్పిత _/\_

    ReplyDelete