గెలుపు తధ్యం..

మనసున్న మనిషిగా పుట్టేసి నిస్వార్ధంగా బ్రతికేయాలని
భాధ్యతల్ని పరిపూర్ణం చేయబోవ నెత్తినెట్టుకున్నా కొరివిని
నీతిగా ఉన్నానంటూ సాక్ష్యమే చెప్పమన్నా సూర్యకాంతిని
ఉసిగొల్పేటి ఊహల్ని ఉరితీసేసి గెంతులేస్తున్నా స్వేఛ్ఛని!
  
ఎన్నో ఏళ్ళుగా ఊహల సాంగత్యంతో మలినపడ్డ మనసుని
శుభ్రంచేయ కంకణంకట్టుకుని విసర్జిస్తూనే ఉన్నా జ్ఞాపకాలని
రోజువిడిచి రోజు కన్నీటిధారలతో తుడిచి పరేస్తున్నా ఆశలని
ఇంకా ఏమూలనో నక్కి ఉందిగా ఆశ నేను చేసింది ఒప్పని!

జరిగేది జరుగక మానదని తెలిసీ అరిచా న్యాయం కావాలని     
ఫలితం దక్కకున్నా ఆరినపెదాలతో గర్వంగా నవ్విన నిగర్విని
శూన్యం దద్దరిల్లేలా ప్రశ్నించా నేనుచేసిన తప్పేంటో చెప్పమని
కరిగే కరకు కాలానికేం తెలుసు అంతమొకటి తప్పకొస్తుందని! 

శ్రమనూ శ్రద్దనూ కలిపి పెట్టుబడి చేసి పెట్టా ఆఖరి పందెమని
గుండెలో గుబులుదాచి ముసుగుతో కప్పా ముఖంపై దిగులుని
చచ్చిన ఆశయాలు ఎండినాకులుగా రాలి అటూఇటూ కొట్టుకుని    
నాపై నాకున్న నమ్మకమే నిద్రలేచింది నేనే తప్పక గెలుస్తానని! 
   

25 comments:

  1. కరిగే కాలానికి కొలమానం పగలు రేయి
    కదిలే జ్ఞాపకాలన్ని కలగలసి దాటును వేయి

    నివురుకి చమురంటినా కార్చిచగును
    బుద్ధి బలానికి మేధస్సే గీటురాయగును

    నిన్నటికి నేటికి రేపటికీ వ్యత్యాసం
    మనలోని నిబద్ధతకు నిర్వచనం

    గెలుపోటముల తక్కెటలో సరిసమానంగా తూగుతూ
    రేపటి ఆశలకు ఆశయాలకు అంకురార్పణ చేకూర్తూ

    కష్ట నష్టాలను బేరీజు వేసుకుంటు
    సుఖ దుఃఖాలను సరిసమానంగా ఓర్చుకుంటు

    కను రెప్పలెదుట నిలిచే నేటిలో
    తారాడే మానవత్వపు ఒడిలో

    అదరక మునుముందుకు సాగే జీవిత పోరు
    సడలని మనోధైర్యం ముందర మానవాళి జోరు

    ~శ్రీ

    ReplyDelete
  2. >>>శూన్యం దద్దరిల్లేలా ప్రశ్నించా నేనుచేసిన తప్పేంటో చెప్పమని>>>

    మీకు మీలా ఉండేవాళ్ళు దొరకరు. దొరికినా బాగోదు.వ్యతిరేక దృవాలు ఆకర్షించుకుంటాయి.

    క్షమించేయండి....అన్నీ సర్దుకుంటాయి.

    ReplyDelete
  3. భావవ్యక్తీకరణలో భేష్

    ReplyDelete
  4. ఏందమ్మో ఇంత భావావేశం, కొంపదీసి కరోనా లాక్ డౌన్ పవర్ పడిందేమో. బొమ్మ మాత్రం అదిరింది

    ReplyDelete
  5. ప్రతీ పదంలో ఎన్నెన్నో భావాలను పలికిస్తారు. Namaskaramu amma

    ReplyDelete
  6. విజయాన్ని సాధించడం శక్తి,సామర్ధ్యం,తెలివితేటలపై ఆధారపడి ఉంటుంది. ప్రేమ మన ఉనికిని బలపరుస్తుంది మన ఎడబాటు. ఆత్మీయ బంధాలలో అధిక నష్టాన్ని కలిగించేవి ఎదుటివారి పట్ల ఉదాసీనత, నిర్లక్ష్యం. కోపం మన శక్తిని హరిస్తుంది.పరుల కోసం చేసిన ఎంత చిన్న పనైనా అది మనలోని అంతర్‌శ్శక్తిని మేల్కొలుపుతుంది. ఆశక్తి విజయానికి దోహదపడుతుంది.

    ReplyDelete
  7. ఏకాంతం స్వేచ్చ ఊహలు ఎన్నో వ్యధలను గుర్తుచేసి గతించిన కధలు చెప్పుతాయి

    ReplyDelete
  8. శ్రమనూ శ్రద్దనూ కలిపి పెట్టుబడి చేసి..!00% success

    ReplyDelete
  9. కేజీ అవకాయ పచ్చడి పెట్టడానికి ఇంత గింజుకోవాలా ? ....... గాడేపల్లి వెంకట్

    ReplyDelete
  10. Very nice and inspiring

    ReplyDelete
  11. ఇంకా ఏమూలనో నక్కి ఉంది ఆశ.

    ReplyDelete
  12. చక్కని భావాలకు అక్షర రూపం ఇచ్చారు.
    చిత్రంలో ఠీవి ఉంది సుమా

    ReplyDelete
  13. జరిగేది జరుగక మానదు అని తెలిసి కూడా తాపత్రయం ఎందుకు అని చెప్పేస్తారు అలాగని కూర్చోలేము. మంచి ఆలోచనాత్మక గేయం వ్రాసినారు.

    ReplyDelete
  14. ఎప్పుడో మా మనసుల్ని గెలిచారుగా

    ReplyDelete
  15. రోజువిడిచి రోజు కన్నీటిధారలతో తుడిచి పరేస్తున్నా ఆశలని.... రోజువిడిచి రోజు .. ఆ గ్యాప్ లాక్ డౌనా వల్లనా ..హ హ హ ... ఎన్నో ఏళ్ళుగా ఊహల సాంగత్యంతో మలినపడ్డ మనసుని... సూపర్బ్ లైన్స్

    ReplyDelete
  16. మీకు మీలో కలిగే భావాలకు మేము ఎప్పుడో దాసోహం, మనసుని మెలిపెట్టే భావాల అత్యంత పవర్ మీ అక్షరాల్లో దాగి ఉంది.

    ReplyDelete
  17. Strong Woman with very strong determination in your writings. Keep it up mam.

    ReplyDelete
  18. స్పందనాస్పూర్తి వాక్యాలు ఎప్పుడూ ఓడిపోనీయవుగా
    తప్పక గెలుపు మనదే..అందరికీ అభివందనములు _/\_

    ReplyDelete
  19. శ్రమనూ శ్రద్దనూ కలిపి పెట్టుబడి చేసి పెట్టా..అద్భుతం

    ReplyDelete
  20. గెలుపు తధ్యం.

    ReplyDelete
  21. భేష్ మీ సాహిత్యం

    ReplyDelete