ఆమెను అమెగా చూడు..

మహిళా భౌగోళిక శరీరంలో దాగిన మనసు పొరల్ని తొలగించి 
తీరిగ్గా ఆమెనడక్కుండా అంతరంగ చరిత్రని చదివారా ఎవరైనా?

మాగాడికి భిన్నమైన మమకారమే ఆమె కులం అదే ఏకాంతం 
శతాబ్దాలుగా శ్రమించి దాచిన స్థిరాస్తులెన్నో చెప్పగలరా ఎవరైనా?

తన కాల్పనికతలో తనని తాను నిర్మించుకుని బహిష్కరించబడి
కలలో కూడా ఉరకలేసి జీవించే ఆమెని వెంబడించారా ఎవరైనా?

బంధుబంధాల నడుమ సాగే కురుక్షేత్రంలో ఆమెతో ఆమే పోరాడి
ఓడిపోయి గెలిచాననే అమె అంతర్గత మర్మం తెలుసా ఎవరికైనా? 

మౌనద్వారంపై కూర్చుని మోములోముఖంపెట్టి మనసు ముడివిప్పి
కవళికల్చెప్పే నిశ్శబ్ద పదాల్ని చదివి అర్థంచేసుకున్నారా ఎవరైనా?

భీజాన్ని మొలకెత్తించే ముందు మూలాన్ని అడుగరెవరూ ఇష్టమాని
ఆమెకున్న సంబంధాల వ్యాకరణమేమిటో విశధీకరించగలరా ఎవరైనా?

వంటగదీ వండివడ్డించి పక్కపై పొర్లేటి గణితశాస్త్రం మాత్రమే నేర్పించి
వ్యంగ్యంతో సమానత్వమంటారే కానీ స్వేఛ్ఛగా వదలగలరా ఎవరైనా?

వాస్తవానికి ఎంత అణగద్రొక్కితే అంతకుమించి ఎదగడమే ఆమె రీతి
మాటలతో కాకుండా చేతల్లో చూపి రెక్కలు విప్పుకొని ఎగిరిపోతుంది 
ఎప్పుడోకప్పుడు ఆమే కోరుకుంటుంది తనకంటూ ఒక ప్రత్యేక లోకం   
స్త్రీ దృక్కోణం నుండి స్త్రీని చూడటం...ఆమె స్త్రీత్వానికి అదే నిర్వచనం!

42 comments:

 1. చాలారోజులకు ఒక గంభీరమైన కవితతో మీరు...అభినందనలు

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు...వ్యధలకన్నా గంభీరత నయం అంటారా?

   Delete
 2. Yes,what you said is correct and its an inspirational poem for women. Thanks

  We women have empowering powers within us, we may or may not know it. Though we might not be that strong in terms of physical strength but we more than make up with inner strength.

  ReplyDelete
  Replies
  1. Thanks a lot for supporting my words dear Sindhoo

   Delete
 3. వారినాయనో... పద్మార్పితకి స్త్రీవాదం పూనింది...లాగెత్తండహో :-)

  ReplyDelete
  Replies
  1. వామ్మో...మీరే ఇలా భయపడితే నానేటిసేసేది :)

   Delete
 4. Replies
  1. Thanks a lot for your lovely comment
   Its a pleasure to me.

   Delete
 5. కోమలత్వం, త్యాగం,సహాయం సంసిద్ధత, సమర్పణ, కంపాషన్, ఊహాత్మక ప్రవర్తన, ఖచ్చితత్వం, ఒకేసారి పలు సందర్భాల్లో వ్యవహరించే సామర్థ్యం స్త్రీలకు ఉన్న ప్రత్యేక లక్షణం. స్త్రీ అభివృద్ధి ప్రతినిధి యొక్క ఆప్యాయత మరియు మద్దతు, రక్షణ, ప్రేమ పై ఆధారపడి ఉంటుంది. ఇది ఒకప్పటి మాట ఇప్పుడు ఎవరికి వారే స్వతంత్రులు.

  ReplyDelete
  Replies
  1. మీ వివరణ మీది నా భావం నాది.
   ఎవరిదీ తప్పు కాక పోవచ్చు కదండీ. థ్యాంక్యూ వేరీ మచ్.

   Delete
 6. chavalani prayatnam chesina chadavanivaru.apardhalu evo shrutinchi tidataru, ika adavallanu artham chesukovadamu evari taramu kadu.

  ReplyDelete
  Replies
  1. artham chesukovadaniki prayatnam cheaste maargam tappaka dorukutundani naa abhiprayamu.

   Delete
 7. ఇది ఎవరికి వారు నిర్ణయించుకునే ప్రక్రియ. ఒకరిని మరొకరు గౌరవించుకుని సాగించవలసిన ప్రయాణం. Khoob likha ap

  ReplyDelete
  Replies
  1. ఎవరికి వారు నిర్ణయించుకోవాలి అనుకుంటే ఒకరికి ఒకరు తోడు అనుకోవడం ఎందుకండీ.

   Delete
 8. ఆత్మాభిమానాన్ని పణంగా
  అనురాగమే ఋణంగా
  అస్తిత్వాన్ని ఆలంబనగా
  సప్తపదిలో ప్రతి అడుగు పుట్టినింటి నుండి మెట్టినింటి దాక
  కదలాడే కన్నుల లోగిలిలో కలల కొలనులో కానవచ్చే చెమ్మ
  త్యాగ నిరతిలో తారాస్థాయికి.. పుణ్యవతికి నిర్వచనం తానై
  ప్రతి ఇంట ఏదో ఒక పాత్రలో విధేయతను ప్రసరిస్తు వెలుగోందేది స్త్రీ

  ఆ స్త్రీ ను తనలో సగభాగంగా మలచి
  కనురెప్పలలో భద్రంగా కనుపాపగా తలచి
  తన ఔనత్యానికి ఈతను ఔదార్యాన్ని మేళవించి
  లాలిత్యంలో గాంభిర్యతను మూటగట్టి
  ధైర్యం తానై సహనం తానై నేర్పుతో
  అస్తిత్వాన్ని చైతన్యవంతముగా ...

  ReplyDelete
  Replies
  1. మీరు వ్రాసే విశ్లేషణకు
   స్పూర్తిదాయక స్పందనకు
   వందనములు తప్ప ఏంరాయను _/\_

   Delete
 9. పద్మగారు చాలా బాగుంది మీ కవిత
  స్త్రీ అస్తిత్వం గూర్చి చెప్పకనే చెప్పినట్లున్నా చెప్ప వలసింది చెప్పారు.

  ReplyDelete
  Replies
  1. స్త్రీ ఎప్పుడూ తన అస్తిత్వాన్ని అభిమానాన్ని కోల్పోరాదని నేను గట్టిగా విశ్వసిస్తాను.

   Delete
 10. very nice expressions padma

  ReplyDelete
 11. Strong words and confidence undi meeru rasina pratii aksharamulo. Good poem andi.

  ReplyDelete
 12. చాలా చక్కగా వ్రాశారు.

  ReplyDelete
 13. స్త్రీల ఉద్యమం ఏమైనా మొదలు పెడుతున్నారా ఏంటి ?

  ReplyDelete
  Replies
  1. ఏ ఉద్యమాలైనా మేము ఏం చేస్తాం మీరు సహకరించకపోతే :)

   Delete
 14. భీజాన్ని మొలకెత్తించే ముందు మూలాన్ని అడుగరెవరూ ఇష్టమాని...true very well said

  ReplyDelete
  Replies
  1. అవును కదా మన ఇష్టాయిష్టాలతో పనిలేకుండానే జరిగిపోతుంటాయి చాలా వరకు అని నా భావం.

   Delete
 15. అద్భుతంగా ఉన్నాయి మీరు వ్రాసిన పదాలు.

  ReplyDelete
  Replies
  1. అభివందనములు మీకు

   Delete
 16. కవితా పద్మాలు ఈ సారి అన్ని పంక్తులలో వెళ్ళి విరిసాయి. వాటికున్న అర్దాలు అవధులు లేనివి. మరొక స్త్రీ మాత్రమే పరిపూర్ణంగా గ్రహించగలరు.... నేను కూడా ములాన్ని, వ్యాకరణాన్ని, స్వేచ్ఛని గూర్చి అడిగి తెలుసుకుంటా...!

  ReplyDelete
  Replies
  1. పరిశీలనాత్మక దృష్టితో చూసి చదివి మీరు తెలియజేసిన వ్యాఖ్యలు నాకు ఎంతో స్పూర్తిదాయకం. ధన్యోస్మి మీ అభిమాన వ్యాఖ్యలకు.

   Delete
 17. Replies
  1. ధన్యవాదాలండీ.

   Delete
 18. This comment has been removed by the author.

  ReplyDelete
 19. చాలాబాగుంది

  ReplyDelete
 20. అత్యంత అద్భుత శైలి

  ReplyDelete
 21. చాలా బాగుంది.

  ReplyDelete
 22. చాలా బాగుంది

  ReplyDelete
 23. మహిళ మనసును అద్భుత అక్షరాల్లో

  ReplyDelete
 24. Tease me until I’m begging for it Hey, i am looking for an online sexual partner ;) Click on my boobs if you are interested (. )( .)

  ReplyDelete