అలుపు..

పట్టెమంచం పరుపుపై మఖ్మల్ దుప్పటేసి
తెల్లచీర కట్టి సిగలోన మల్లెపూలు పెట్టేసి   
ఆరుబయట నక్షత్రాలు చంద్రుడి వంక చూసి
పాలగ్లాసు పట్టుకుని ప్రక్కనొచ్చి చేరితే...
రాలే తోక చుక్కకై చూస్తూ కోరికుందంటావు!   

అదేమి కోరికో కదాని ఆత్రుతగా ఆరా తీసి
ఆకాశంలో పాలపుంతవైపు ఆరాటంతో చూసి
ఆవలింతలు ఆగక ఆరుబయట కునుకు వేసి
కోడి కూసేటి వేళకు లోనికి వెళ్ళబోతే...
అక్కడే నులక మంచంపై గురకపెడుతున్నావు!

అడవిగాసిన వెన్నెలాయెనని మల్లెలు గోలచేసి
మండేటి ఎర్రబారిన కనులు కాటుకని కసిరేసి
ఎండమావులాయె కదాని ఎద కోరికలు ఎగసి 
వయ్యారమే వగచి చిర్రుబుర్రులాడబోతే...
శృంగారానికి శ్రీకారమని చీరలాగి అల్లుకున్నావు!

ఆపైన పట్టె నులక మంచాలతో పనేమిటంటూ
క్రిందపడి పైనదొర్లి కటికనేలపైనే కార్యమన్నావు
పనిచేసి అలసిపోతినంటే..నడువంపులోన గిల్లి
చిదిమిదీపం పెట్టేటి నీ అందచందాలు చూసి...
పనిచేసి అలుస్తుంది నేను నువ్వుకాదంటున్నావు!

20 comments:

  1. కవిత పాదరసము వలే
    సర్రున గిర్రున తిరగాడుతుంటే

    వెచ్చని వెన్పెల సైతం చల్లని వేడిమితోడ
    హాయిరాగాలన్ని మల్లియలాలకించగా

    పాలపుంత లో నిగారింపు జరా నేల చేరగా
    కోడి కూతలకే నిద్ర ముసుగు తన్ని చల్లగా

    కల్లాపి తో నులక తడిచి.. అలికిన అరుగుపై
    అలకల ముగ్గులేసి.. పిల్లి మొగ్గలేసి.. హయ్యో..

    వెండి జాబిలి హటాత్పరిమాణముతో
    బంగారు రేకుల భానుడాయే ఏలనో

    కించిత్ అర్దములేని కావ్య రచన నాది
    అలుపెరుగని భావాల ఒరవడిల నాడి

    ~శ్రీ

    ReplyDelete
    Replies
    1. మౌనాన్ని ఆశ్రయించే మనసు మూగదౌతోందా..!
      అలగిన హృదయాల వ్యత్యాసం నడుమ మనసే అలుసౌతోందా..!!
      పాలపై తేలియాడే మీగడ
      నివురు గప్పిన నిప్పు కణిక
      పై రెంటి గుణాల కలయికతోనే వేడి పాలకు తోడు కలసి పెరుగుగా మారి ఉదరాన్ని శాంతింప జేస్తుంది..!!!

      Delete
  2. పట్టె మంచం విరిగిపోతుందని నేలపై కార్యం అన్నాడు అన్నమాట 😂

    ReplyDelete
  3. తామరపువ్వోలె మెత్తని మేను
    కొలికులకు ఇంపైన కలికి చూపులు
    చెంపకు చారెడేసి కాటుకదిద్దిన కనులు
    హంసనడక గల కడుసన్నమైన నడుము
    తెల్లచీరలో మెరిసెడి అప్సరస పొంగు
    మానసచోరిణీ ఈ పద్మార్పిత పదాల విందు,,,

    ReplyDelete
  4. So beautiful & romantic

    ReplyDelete
  5. శృంగారాన్ని సున్నిత పదభంగిమల్లో నర్తించేటట్లు చేసారు.

    ReplyDelete
  6. ఈ కవితలో ప్రేమ పాళ్ళు తగ్గి శృంగారంతో రంజింపజేయాలని ప్రయత్నించినట్లుంది

    ReplyDelete
  7. Romanric touch ichcaru
    so nice mam.

    ReplyDelete
  8. అడవి గాసిన వెన్నెలాయెనని మల్లెలు.......:) :) :)
    సీజన్ అయిపోయింది కరోనా కాలం అంతా దూరం రూరం

    ReplyDelete
  9. Direct romance :) ha ha ha

    ReplyDelete
  10. dare to touch
    no guts to everyone

    ReplyDelete
  11. ఆవలింతలు ఆగక ఆరుబయట కునుకు వేసింది మీరు అతడు మంచివాడే..అహ హ హా

    ReplyDelete
  12. సరసమైన కవిత.

    ReplyDelete
  13. ఇదేదో బెడికొట్టే వ్యవహారం అనిపిస్తుంది పద్మార్పిత ...జర జాగ్రత్తగా మసలుకో...అసలే రోజులు బాలేదు అహ్ అహ హా

    ReplyDelete
  14. అలుపన్నది ఉందా మీ అక్షర ప్రేమాయణానికి..

    ReplyDelete
  15. అందరి అభిమానాక్షరాలకు అర్పిత అభివందనములు.

    ReplyDelete