ఎలా తెలుపను?

హృదయ కలంతో పూల రంగులు రంగరించి
రోజూ ఒకలేఖను వ్రాసి మది భావాలు తెలిపి
నన్ను వెంటాడుతున్న నీ విధానం తెలుపనా!
కలల నిండుగా నిన్నే నింపుకుని నిదురించి
కనులు తెరచి నీ జ్ఞాపకాలతో నేను మేల్కుని
ఆలోచన చిక్కుముడులు విప్పానని చెప్పనా!
మదికొలను తెరచి విప్పారిన కలువను పిలచి
నీ కలల గీతాంజలిని నేనని అన్నప్పుడు పలికే
శ్వాస సంగీతాన్ని గుండెసవ్వడుల వీణమీటనా!
అటుఇటు ఏదిక్కు పయనించినా నిన్ను తలచి
గుంపులో ఒంటరినౌతాను నిన్ను గుర్తుచేసుకుని
ఇలా ఎన్ని జన్మలు ఎత్తాలని నిన్ను అడగనా!
నాలుగుదిక్కులు వెళ్ళినా నీ రూపమే అగుపించి
దూరము అయినకొద్దీ మరింత దగ్గరౌతున్నావని
గుండెలో కొలువైఉన్న నీరూపం చీల్చి చూపనా!

21 comments:

  1. ఎన్ని రోజులు ఒక హృదయ కవిత ఆలపించారు... wow

    ReplyDelete
  2. భావాన్వితమై సాగే పదాల పొందికలో అర్థమనే పొట్లాన్ని జతచేసి పంపినా ఆర్యస్వీపి రాలేనపుడు ఎలా తెలిపేది.
    ఆశల విత్తులకు బాసటగ బాసల నీటితో సేద్య పరిస్తే అది కాస్త ఇంకినట్లే ఇంకి నీరుగారిపోతే ఎలా తెలిపేది.
    రంగులన్ని మేళవించి హరివిల్లునే భూమికి ఆకాశానికి నడుమ తోరణమై వసివాడని నవ్వుల పూలతో అలంకరిస్తే వసివాడన వేళ చూసి హేళన చేస్తే ఎలా తెలిపేది.

    ~శ్రీత ధరణి

    ReplyDelete
  3. ఇంత ప్రేమ అనురాగం చూపిస్తే కాదంటారా ఎవరైనా?

    ReplyDelete
  4. Prema
    prema tho
    prema kosam

    ReplyDelete
  5. వలపు అంతా మూటకట్టి ఒలకబోసినట్లు ఉంది ఈ ప్రేమ కావ్యం పద్మార్పితా

    ReplyDelete
  6. ప్రేమను అతిసున్నిత పదాల్లో మేరే చెప్పగలరు, అలాగే చురకలూ వేయగలరు.

    ReplyDelete
  7. మనసు కలం
    రంగుల కుంచెలో అద్ది
    ప్రేమను పాలు పెరుగులో
    పంచదార వేసి ముంచి
    అందించిన మీ పదాలకు
    నీరాజనం అర్పితాజీ!

    ReplyDelete
  8. ఏదిక్కు పయనించినా నిన్ను తలచి
    గుంపులో ఒంటరినౌతాను నిన్ను గుర్తుచేసుకుని..vah vaah

    ReplyDelete
  9. కలల గీతాంజలి...బ్యూటిఫుల్

    ReplyDelete
  10. Andamaina chitram and aksharalu.

    ReplyDelete
  11. గాలికి అదుపు లేదు
    మీ ప్రేమకు అంతు లేదు
    సూపర్ మాడం జీ

    ReplyDelete
  12. మీ కలం ప్రేమ మయం.

    ReplyDelete
  13. Namaste madam.
    How are you?
    these days I missed your post.
    Hope for healthy atmosphere to enjoy your poetry.

    ReplyDelete
  14. మురిపించే చిత్రం
    మనసుని తాకే కవిత్వం
    మీకు సొంతము

    ReplyDelete
  15. గుంపులో ఒంటరినౌతాను నిన్ను గుర్తుచేసుకుని

    ReplyDelete
  16. ఎలా ఉన్నారు పద్మార్పితాజీ

    ReplyDelete
  17. Cool & Lovely Madam.

    ReplyDelete
  18. ఆత్మీయులు అందరూ జాగ్రత్తగా ఉండండి_/\_

    ReplyDelete