లాభసాటి ఒప్పందం

అనుభూతులు ఆమ్లధారల్లా ఆవిరైపోతుంటే
మమతల మసిపూసి ఏం మాయ చేస్తాం..

ఆలోచనలకి అవసరాలే ఆనకట్టలు వేస్తుంటే
ఊహాసౌధాలకు అరచేతుల రక్షణ ఏమిస్తాం..

మనసులోని మాట గొంతు దాటి రాకుంటే
నమ్మకపు దస్తావేజులు చేతికి ఎలా ఇస్తాం..

బరువైన బాంధవ్యాలు ఊపిరి ఆడనివ్వనంటే
స్వతంత్ర స్వేచ్ఛారెక్కలు ఎలా విప్పారుస్తాం..

మలినమైన మమకారమే మిగిలి ఉందంటే
స్వఛ్చమైన సాంగత్యాన్ని ఎక్కడని చూస్తాం..

స్వార్ధప్రణాలికలే వలపు వ్యాపార పెట్టుబడంటే
అనురాగాన్ని అరువుపెట్టి ఏంలాభం ఆర్జిస్తాం..


18 comments:

  1. వాస్తవమే అలా అన్నింటికీ అన్నీ అనుకుంటే ఏమీ చెయ్యలేము.

    ReplyDelete
  2. జీవితం అంటే ఇవన్నీ కలగలసి ఉంటేనే
    లేదనుకుంటే అడవిలో జంతువుల నడుమ జీవించాల్సిందే
    చిత్రము అర్థవంతంతో కూడినట్లు ఉండి. అభినందనలు.

    ReplyDelete
  3. స్వార్ధప్రణాలికలే వలపు వ్యాపార పెట్టుబడి. New thought

    ReplyDelete
  4. Incomplete painting ante words and life incomplete ah?

    ReplyDelete
  5. ఇటువంటి పద అల్లికలు మీకు కొట్టినపిండి కదా

    ReplyDelete
  6. అనుబంధాలను కూడా వ్యాపారంతో పోల్చి లాభనష్టాలు బేరీజు వేసే ఎలాగా ???????????????

    ReplyDelete
  7. Excellent write up andi

    ReplyDelete
  8. కరిగే కథల మాటు వ్యథల భావోద్వేగాలు
    కంటిని గుండెను మెలివేసే రాగద్వేషాలు
    అసంపూర్ణమైన బాంధవ్యాల నడుమ
    నత్త నడకన ఊరేగే టఠడఢణాలు

    ~శ్రీత ధరణి

    ReplyDelete
  9. chakkani bhaava ghaabheeratwam.

    ReplyDelete
  10. Wah waa anatam minahaa no words

    ReplyDelete
  11. ghambheera vakyalu rasavu.

    ReplyDelete
  12. స్వఛ్చమైన సాంగత్యాన్ని ఎక్కడని చూస్తాం?
    వెతిగినా దొరకటంలేదు ఇప్పుడు...true

    ReplyDelete
  13. నేటి వ్యవస్తలో కనబడుతున్న నిజాన్ని చక్కగా వెల్లడించారు.

    ReplyDelete
  14. బరువైన బాంధవ్యాలు ఊపిరి ఆడనివ్వవు

    ReplyDelete
  15. నమ్మకపు దస్తావేజులు
    కొత్త పదప్రయోగం బాగున్నది.

    ReplyDelete