ఒకదానివెంట ఒకటి కోల్పోతూనే ఉన్నాయి
లోకాన్ని ఏం కోరితే ఏం ఇచ్చిందని కన్నీళ్లేగాఒకప్పుడు పూలవనం పరిమళాలతో విరిసింది
ఇప్పుడు ముళ్ళుకూడ దక్కుతాయన్న ఆశలేదు!
ప్రియమైన కాలానికెన్నో కోరికల రెక్కలున్నాయి
రేపటికై ఆలోచించే వ్యవధి మాత్రం కరువైందిగా
గుండ్రంగా తిరుగుతూ రంగులన్నీ విసర్జిస్తుంది
ఇక రూపం మారిపోతే సౌందర్యానికి స్థానంలేదు!
రేయంతా మిణుగురులు చిందులు వేస్తున్నాయి
తెల్లవారిపోయిందా ఈ ఆనందం కనుమరుగేగా
పనేమీలేక ఆలోచనలతో మనసు విసిగిపోయింది
మెల్లగా నిస్సత్తువ శరీరాన్ని కౌగిలించి వీడలేదు!
ఎగిరిపోవే ఊపిరీ దాహపు సుడిగుండాలున్నాయి
కాగితపు పూలవనములో విశ్రాంతి తీరు తీరికగా
అమాయక ఆకాంక్షేదో ఇసుకలో సేద్యం చేస్తుంది
చిక్కినట్లే చిక్కి అన్నీ కోల్పోయి దక్కింది ఏంలేదు!
Amazing Art Picture.
ReplyDeleteకాగితము పువ్వులకు పరిమళాలు లేకపోవచ్చును కానీ కాగితం పువ్వులు కూడా కనులకు ఇంపుగానే ఉంటాయి కదండీ. చిత్రము చాలా బాగుంది ఎప్పటిలాగానే.
ReplyDeleteజీవిత కాగితం పై భావోద్వేగాల రంగులు
ReplyDeleteకష్ట నష్టాల నడుమ మెలికలు పెడుతు హంగులు
ఒక్కో మలుపులో కాలం కవ్వించే పదనిసలు
దారి పొడవున ఎగుడు దిగుడు ఒడిదుడుకులు
никто в этом мире не может любить тебя так сильно, как я, анита
Delete:
Шридхар
రంగుల హరివిల్లు కంటికి మాత్రమే యింపు
Deleteరేతిరి చీకటి లో మిణుకు తారల మేళవింపు
మనసులో జరుగుతున్న మదనానికి ఇది ప్రతిరూపం
ReplyDeleteచిత్ర సోయగం అపురూపం
జీవితంలో చివరికి అన్నీ కోల్పోవలసిందే
ReplyDeleteFantastic
ReplyDeleteచిక్కినట్లే చిక్కి అన్నీ కోల్పోయి ha ha ha
ReplyDeleteExcellent art.
ReplyDeleteచివరి నాలుగు లైన్స్ చాలా బాగున్నాయి. చిత్రము సూపర్బ్
ReplyDeleteపెయింటింగ్ చాలా బాగుంది.
ReplyDeleteఎగిరిపోవే ఊపిరీ :(
ReplyDeleteSelf prudential poetry
ReplyDeleteఆశ
ReplyDeleteనిరాశ
Photo keka.
ReplyDeleteEnduku
ReplyDeleteEnduku
Enduku
Vairagyam
_/\_నమస్సులు_/\_
ReplyDeleteVery nice
ReplyDeleteSo lovely said
ReplyDeleteEXCELLENT
ReplyDelete