ముద్దుగా మురిపించే మాటలు ఎన్నో చెప్పి
ముంగురుల లోనికి మునివేళ్ళను జొప్పించే
నీ గాలిచేష్టలెంత చిలిపివో తెలిసెలే చిన్నోడా
రెపరెపమంటూ రెప్పలపై నీ చూపులు గుప్పి
చెంపలు ఎరుపు ఎక్కేలా నవ్వుతూ కవ్వించే
నీ అక్షరమాలాల్లికలు అలరించెనులే అల్లరోడా
నిగూఢంగా నిలువుదోపిడీ చేసి కలలతో కప్పి
జ్ఞాపకాల మాయమంత్రం ఏదో నన్ను ముంచే
నీ కపటంలేని వలపుని ఎరిగితిలే కంత్రీగాడా
చిక్కరాదు అనుకుంటూనే నీ గుండెకు నే చిక్కి
పొరనై పెనవేయ సురక్షితమని నామది ఎంచే
నీ శ్వాసలో చేర నా శ్వాస వీడాలిగా ప్రియుడా...
ఎన్నాళ్ళో ఈ ప్రేమకై వేచేది
ReplyDelete
ReplyDeleteమీరు కురిపించే నిస్వార్ధమైన, నిర్మలమైన ప్రేమకు బదులుగా అతడు ఇచ్చే కానుక గుప్పెడంత గుండెలో ఉప్పెనంత ప్రేమను నింపుకున్నట్లేలెండి.
ముద్దుగా మురిపించే మాటలు మీ కవితలు :)
ReplyDeletebommalo sirimalle singarinchukunnatlu undi.
ReplyDeleteముద్దు ముద్దు కవిత
ReplyDeletechikka radu antoo chikkadam
ReplyDeletepremalo pada radu anukuni pattam mamoolu
nice drawing
జ్ఞాపకాల మాయమంత్రం???
ReplyDeleteచిక్కని భావంతో నిండిన కవితాచిత్రము.
ReplyDeleteలవ్లీ ప్రెజెంటేషన్
ReplyDeleteArtistic poetic lines.
ReplyDeleteఅదిరింది పద్మమ్మా అదిరింది.
ReplyDeleteఏమి రాయలో అర్దం కాక
ReplyDeleteఈ అయోమయం లో చివరి దాక
పట్టేదెలే ఎవరిని అస్తమానూ కాకా
చివురులు తొడిగే వాసంతమే ఎదురు రాక
చినుకు ముత్యాల సరాల తో పెట్టించేను కేక
Nice post
ReplyDeleteకపటములేని వలపు ఇప్పుడు వెతికినా దొరకదు.
ReplyDeleteఅందమైన అక్షరమాల.
ReplyDeleteఉచ్వాశ జననం... నిష్వాశ మరణం... ప్రేమలో లెక్కలేనన్ని జనన మరణాలు!! ♥️
ReplyDeleteఅంటే ప్రేమ మారణ హోమం అంటారా వినోద్ గారు. సరదాగానే వ్రాసాను, మరోలా అనుకోమాకండి.
Deleteబుట్టబొమ్మ
ReplyDeleteముద్దుగుమ్మ
ఏమన్నా ఓకే
Adurs
ReplyDeleteఅక్షరాభిమానులకు అభివందనములు
ReplyDeleteBeautiful.
ReplyDelete