చక్రంలేని ఇరుసు

నా మనసంటే అతడికి ఎప్పుడూ అలుసే
బహుశా నేనతడిని రమ్మన్నందుకో ఏమో
లేదా ఎందునా సరితూగను అందుకేనేమో
నా బ్రతుక్కి పెట్టుబడి వడలిన నా సొగసే
బహుశా ప్రేమన్నది నా వ్యాపారమో ఏమో
లేదా అనుభవాలు నే పొందిన లాభమేమో
నా కన్నీటి కధలు చేష్టలూ తనకు బిరుసే
బహుశా నేను తన గూటిచిలుకని కానేమో
లేదా తెగిపోయిన గాలిపటపు తెగ నాదేమో
నా కోరికల ఖరీదు తనకు బొమ్మా బొరుసే
బహుశా నా ఆశల అంగడి బరువైంది ఏమో
లేదా తన వాంఛలకు విలువ నే కట్టలేనేమో
నా అనుభూతులన్నీ అతడి కంటికి నలుసే
బహుశా ఆలోచనల్లోని తారతమ్యమో ఏమో
లేదా మా ఇద్దరి వయసుల వ్యత్యాసమేమో
నా సావాసం అతడికి శవం ఇస్తున్న భరోసే
బహుశా నాది ఏ బంధంలేని అవసరం ఏమో
లేదా ఎవ్వరికీ చెప్పుకోలేని నిస్సహాయతేమో

14 comments:

  1. చక్రాలు లేని ఇరుసు ఉండి కూడా వ్యర్థమే...అంటే ఒంటరి పోరాటంతో లాభలేదు అనేకదా పద్మార్పితాజీ

    ReplyDelete
  2. స్త్రీ మనోభావాలకు దర్పణం

    ReplyDelete
  3. vrutti eadaina andulo srama vyatirekata untundi.

    ReplyDelete
  4. మీరు చెప్పాలి అనుకున్నది ఏమిటో అర్థంకాలేదు.

    ReplyDelete
  5. చెప్పుకోలేని నిస్సహాయత-correct

    ReplyDelete
  6. Most difficult to understand a woman

    ReplyDelete
  7. బాగారాశారు.

    ReplyDelete
  8. బహుశా నా ఆశల అంగడి బరువైంది ఏమో
    లేదా తన వాంఛలకు విలువ నే కట్టలేనేమో

    ReplyDelete
  9. మనోభావాలు వెల్లగక్కారు.

    ReplyDelete
  10. _/\_అందరికీ పద్మార్పిత అభివందనములు_/\_

    ReplyDelete