మైత్రీవనం

స్నేహానికి లింగ విచక్షణ లేదు
స్నేహ స్థాపకుడు ఎవరూ కాదు
మనసులు కలవడం ముఖ్యం.. 
ఎప్పుడు ఎందుకు ఎక్కడ ఎలాగని 
ఏ పంచాంగంలో అది చెప్పలేదు!   

మనసుపడే వ్యధకు మందు లేదు 
చెబితే తెలుసుకోవడం గొప్ప కాదు 
సంబంధానికి నమ్మకం ఆధారం..
అడక్కుండా ఆసరా ఇచ్చేటి తోడుని
ఏ పరిమితి పరిస్థితి దీన్ని ఆపలేదు!

తోడుంటే ప్రాణవాయువుతో పనిలేదు  
అడుక్కుని తీసుకునేది మద్దతు కాదు  
చివరి వరకూ కలిసుండేదే స్నేహం..
వెంపర్లు ఆడ్డం ఎందుకు మనవాళ్ళని    
ఏ బేరమాడో స్నేహితుడ్ని కొనలేదు!  

21 comments:

  1. -

    మనసు పడే వ్యధ కగధ
    మ్మనునది లేదోయ్ జిలేబి! మనసుల కలబో
    తను తెలిపెడు పంచాంగము
    కనిపించదు వెతికిన మది కరగాలె సుమీ!


    జిలేబి

    ReplyDelete
  2. ఏ బంధానికి అయినా నమ్మకమే అధారం
    స్నేహానికన్న మిన్న ఏదీ లేదు-బొమ్మ చూడ ముచ్చట

    ReplyDelete
  3. అందమైన ఆణిముత్య గుళికలు...అభినందనలు

    ReplyDelete
  4. So beautiful Pic with lovely words.

    ReplyDelete
  5. స్నేహం ఎంతో మధురం
    మీ అక్షరాల్లో అది పదిలం

    ReplyDelete
  6. స్నేహాన్ని మీ పదాల్లో చెప్పిన తీరు చాలా బాగుంది. చిత్రం ఇంకా బాగుంది.

    ReplyDelete
  7. జీవితమేరా స్నేహం.. సాహసమేరా స్నేహం..
    ప్రాణానికి ప్రాణం స్నేహం.. స్నేహానికి స్నేహం ప్రాణం
    ఓడిపోనిది.. వాడిపోనిది స్నేహం.
    తరిగిపోనిది.. మరిచిపోనిది స్నేహం.
    శాశ్వతమేరా స్నేహం.. సంబరమేరా జీవితం

    ReplyDelete
  8. చాలాబాగుంది

    ReplyDelete
  9. స్నేహం చేయటం గొప్ప కాదు
    దాన్ని చివరి వరకూ కాపాడు కోవాలి

    ReplyDelete
  10. తోడుంటే ప్రాణవాయువుతో పనిలేదు...abhaddam

    ReplyDelete
  11. Madam nice painting.
    How are you andi.

    ReplyDelete
  12. నైస్-------
    స్నేహం గురించి చక్కగా వ్రాసారు

    ReplyDelete
  13. బాగుంది సిస్టర్

    ReplyDelete
  14. అడక్కుండా ఆసరా ఇచ్చేటి తోడు?????ఎక్కడ దొరుకును?????/

    ReplyDelete
  15. Andamaina chitra kaavyam

    ReplyDelete
  16. అద్భుతమైన చిత్రము

    ReplyDelete
  17. అందరికీ నమస్సులు _/\_

    ReplyDelete