జీవితబొంత

జీవితంలో జనం అతుకులబొంతలా కలుస్తారు
కొందరు కోరుకున్న దానికంటే పెద్ద ముక్కగా
కొందరేమో చిన్న ముక్కలుగా జతకూడతారు!

జీవనబొంతలో వివిధ గుడ్డపేలికలై సాగుతారు
కొన్నిపేలికలు చికాకు పెట్టే చతురస్రాకారంగా
మరికొన్నేమో ముతకదారపు పేలికలైమిగిలేరు!

జీవించడానికి రంగుబట్టలెన్నో అతుకుతుంటారు
కొంతమందిని పనికిరాక మనం వదిలివేస్తాంగా
కొంతమందేమో బట్టముక్కలై కుట్టేయబడతారు!

జీవనానికి ప్రతీ గుడ్డముక్క అవసరమనితెలిపేరు
కొద్దిపాటి గుడ్డలు నాలుగుమూలల అతికినట్లేగా
కొద్దిపాటి జనమేమో చిరిగిపోయి విడిపోతారు!

జీవించేబొంత చాలాచిన్నదని తెలుసుకున్నవారు
కొంతకాలం ఉండిపోవారి నుండి ఏం కోరరుగా
కోరివచ్చిన వారి మనసున చిరకాలం ఉంటారు!

14 comments:

  1. Life gurinchi patham bagundi.
    Happy Women's Day

    ReplyDelete
  2. జీవితాన్ని బొంతతో బాగా పోల్చారు మాడం.

    ReplyDelete
  3. కొంతకాలం ఉండిపోవారే అందరూ..

    ReplyDelete
  4. Bagundi madam jeevita saramsham.

    ReplyDelete
  5. కొన్నిపేలికలు చికాకు పెట్టే చతురస్రాకారంగా
    మరికొన్నేమో ముతకదారపు పేలికలైమిగిలేరు!
    బ్రహ్మాండం జీవితాన్ని పోల్చినతీరు.....

    ReplyDelete
  6. మీరు వ్రాసే జీవితపాఠాలు అమోఘం.

    ReplyDelete
  7. జీవితం అందరికీ వడ్డించిన విస్తరికాదు.
    ప్రయత్నం చేయటం మన వంతు, దక్కేది ఉంటే దక్కక మానదు పద్మార్పితా.

    ReplyDelete
  8. Jeevitanni vadaposinatlu undi kavita.

    ReplyDelete
  9. అందరికీ ధన్యవాదాలు.

    ReplyDelete