చిల్లు గాలిపటం

చీపురుపుల్ల త్రుంచి కాగితాన్ని దానిక్కట్టేసి
ప్లాస్టిక్ పతంగీతో పంతమేల గాలిపటమా
చంద్రుడ్ని తాకబోయి చెట్లలో చిక్కుకుంది
అది దాని గొంతెమ్మ కోరికని అనుకోవచ్చు
గాలిపటానికి దారమాధారమని ఎవరికెరుక?
హద్దుమీరిన ఆశయాల్ని ప్రేమతో పెనవేసి
పైకెగిరితే పడిపోతానని తెలిసీ గాలిపటము
ఎవరో పట్టుకుంటారన్న ధీమాతో ఎగసింది
రాలినగాలిపటం రంగులు నచ్చి ఉండొచ్చు
ఉరికొమ్మకు వ్రేలాడుతుందని ఎవరికెరుక?
ఆశల ఆధారాలన్నీ దారంగా ముడులువేసి
పైకెగిరిన మనసు చిల్లుపడిన గాలిపటంలా
క్రిందపడి ఇంకా రెపరెపలాడుతూనే ఉంది
ఎగరేసే వారికది కాలక్షేపం అయ్యుండొచ్చు
ప్రాణాన్ని ఫణంగా పెట్టిందని ఎవరికెరుక?

13 comments:

  1. అయ్యో ఎగిరి రాలిన గాలిపటమా....చాన్నాళ్ళకు మీదైన కూర్పుతో బాగుంది కవిత.

    ReplyDelete
  2. అద్భుతం అండి.

    ReplyDelete
  3. prema kosam pranam phanam pettadam bagoledu.

    ReplyDelete
  4. క్రిందపడి ఇంకా రెపరెపలాడుతూనే ఉంది
    గాలిపటం హృదయాన్ని తాకింది

    ReplyDelete
  5. తెగిన గాలిపటం క్రిందపడి చిరిగిపోతుంది.

    ReplyDelete
  6. To who it is concerned madam?

    ReplyDelete
  7. Lothaina bhavam dagi undi.

    ReplyDelete
  8. అద్భుతం అమ్మా...

    ReplyDelete
  9. ప్రాణాన్ని పణంగా పెట్టడం పెయిన్ ఫుల్

    ReplyDelete
  10. రాలినగాలిపటం రంగులు???

    ReplyDelete