ఇలా అనిపిస్తుంది..

టక్కున ప్రాణం పోతే..

బాగుండును అనిపిస్తుంది!
అభిమాన ఆపేక్షల కోసం
ఆరాట ఆతృతలు వద్దు..
ఇక చాలించాలనుంది!

జీవించింది చాలు ఎవ్వరూ
ఛీ ఛీ అనకముందేగానే..
అంతరించి పోవాలనుంది!

జీవితానికి ఒకర్థం ఉన్నప్పుడే..
ఆనందంగా వెళ్ళిపోవాలనుంది!
కొందరి హృదయాల్లో చోటు
కాసింత అభిమానం ఉందన్న..
తృప్తితో అంతమవ్వాలనుంది!

ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు
కలలుకంటున్న కనులను..
శాశ్వితంగా ముయ్యాలనుంది!

అనుకున్నవేవీ ఎలాగో జరుగలేదు..
ఊపిరైనా ఇష్టంగా వీడాలనుంది!

11 comments:

  1. రెప్ప పాటు కాలమంటారు
    కాని కునుకు కి కునుకుకి నడుమన లెక్క కట్టు

    ఊపిరి ఉచ్వాస నిఃశ్వాస అంటారు
    బంధం కలిసినపుడు ఒకలా విడిపోతే మరోలా ప్రాణం గుట్టు

    నీకు నాకు నడుమ దోబుచులాట అంటారు
    బ్రతుక్కి చావుకి గల లంకె ఆయువుపట్టు

    మంచిని బ్రతికున్నపుడు తలవరు జనులంటాను
    చచ్చాక ఎన్ని సార్లు చేసిన మంచిని తలుచుకో కేవలం కనికట్టు

    ~శ్రీ~

    ReplyDelete
  2. atma hatya mahaa dosham andi. think in positive way.

    ReplyDelete
  3. ఊపిరి ఉన్నంత కాలం బ్రతాకాలి
    అంతే తప్ప బలవంతంతో చావలేము కదండీ
    అల చెస్తే బ్రహ్మపాతకం అవుతుంది.

    ReplyDelete
  4. ఏదోక సమయంలో అందరికీ అలా అనిపిస్తుందేమో------

    ReplyDelete
  5. తృప్తితో అంతమవ్వాలని...ఇది సాధ్యమా?

    ReplyDelete
  6. అంతులేని వేదన.

    ReplyDelete
  7. Kalalu nijam kavu andarikee

    ReplyDelete
  8. Manasuni touch chese words. Nice picture

    ReplyDelete
  9. ధన్యవాదాలు.

    ReplyDelete