ప్రాప్తం......


నాకు పరిచయం చేసావు నీకు కాబోయే జోడీని...

ఆశ చావలేదు నాలో నీవు కాకపోతావా నా తోడని...
ఎదురు చూసాను అనక పోతావా నన్నే నీ నీడని...
అన్నావప్పుడు నేనే నీకొక మంచి స్నేహితురాలినని...
నాలో నేనే నవ్వుకున్నాను ఎంత అందమైన అబద్దమని...
అనుకున్నారంతా ఎంత మంచి బంధమో కదా మనదని...

నా కన్నీరు చూసి నీవనుకున్నావవి ఆనందబాష్పాలని...
నాకు తెలిసిందప్పుడు నా మనసెన్నటికీ నీకర్ధం కాదని...
మీరిద్దరూ వెళుతుంటే అనుకున్నాను నాకింతే ప్రాప్తని........



5 comments:

  1. కవిత బావుందండీ..!
    భావం చాలా భారంగా ఉంది :(
    అదే అనుకుంటా.. ప్రాప్తమంటే :(

    ReplyDelete
  2. 'అన్నావప్పుడు నేనే నీకొక మంచి స్నేహితురాలినని...
    నాలో నేనే నవ్వుకున్నాను ఎంత అందమైన అబద్దమని...'
    ఏది అబద్దం అనుకున్నారు? మీరు అతని మీద పెట్టుకున్న ప్రేమా???లేక అతను ప్రేమించినట్లు నటిస్తున్నాడనా??... కవిత చాలా బాగుంది కాని అక్కడ కొంచం అర్దం కాలేదు :)

    ReplyDelete
  3. మధురవాణిగారికి ధన్యవాదాలు.......
    నేస్తమా!అతను అనుకున్నట్లు ఆమె కూడా అది స్నేహం అనుకుంటే అది ఎంత అందమైన అబద్దమో కదా అని. ఈసారి భావప్రకటనని మెరుగు పరచుకోడానికి ప్రయత్నిస్తానండి. Thank you......

    ReplyDelete
  4. Padma Garu

    Bavundandi.

    madilo medile bhavalanu kavithala entha andam ga chepparandi.

    ReplyDelete
  5. mee manasE mee maaTa vintunnattu lEdu
    pApam atani manasuki mee vEdana elA ardam avutundi

    very hard feelings in small lines nice.

    ReplyDelete