నీ ప్రేమకై......

సముద్రపు ఒడ్డున నీ జ్ఙాపకాల ఇసుకమేడనొకటి కట్టాను..
ఆ ఇంటి ముందు ఆశల పూతోటనొకటి నాటాను..
అలలు వాటిని తాకకుండా, అరచేతులు అడ్డుపెట్టి ఆపుతున్నాను..
మేడలో నిన్ను నా కౌగిలిలో బంధించాలనుకున్నాను..
తోటలో విరబూసిన పూలతో నిన్ను పూజించాలనుకున్నాను..
నన్ను చూసినవారు గేలిచేసి నవ్వుతున్నారని తెలుసుకున్నాను..
అయినా నిలకడలేని నీ ప్రేమకై ఎదురుచూస్తున్నాను..

11 comments:

  1. prema aenta pichido!aedina cheyyali anipistundi!! :)

    ReplyDelete
  2. padma garu the photo which u havept for ohh.....Premaaaa is so nice

    ReplyDelete
  3. సుజనగారికి,కొత్తపాళీగారికి,శివగారికి,నేస్తానికి,
    అనుకుమార్ గారికి ధన్యవాదాలండి....

    ReplyDelete
  4. పద్మార్పిత గారూ, నిలకడ లేని నీ ప్రేమకై ఎదురు చూస్తున్నాను అన్నారు.నాకు సరిగా అర్థం కాలేదండీ... కొంచెం వివరణ ఇవ్వగలరా??

    ReplyDelete
  5. పద్మప్రియ గారు మీ బ్లాగ్ కూడా చాల బాగుంది.మీకు మా బ్లాగ్ తరుపున ఇవేమా నూతన సంవత్సర శుభాకాంక్షలు

    ReplyDelete
  6. పద్మార్పిత గారు సముద్రపు వొడ్డున జ్ఞాపకాల ఇసుక మేడ కట్టారంటే అర్ధం ఇంకో పెద్ద అల వచ్చేవరకే గుర్తు పెట్టుకుంటారన్న మాట . ఉదృతం గా ఇంకో బలమైన అల రాగానే మీ జ్ఞాపకాల ఇసుక మేడని కూడా చెరిపేసి తనలోకి లాక్కు పోతుంది. అంటే అక్కడ మీ ప్రేమ నిలకడ ఇంకో ఉద్రుతమైన అలలంటి ఇంకో ప్రేమ వచ్చే వరకే మాత్రమే.అలాంటిది మీ ప్రియుడి ప్రేమని నిలకడ లేని ని ప్రేమ అని అభియోగం మోపారు .మీ ప్రియుడే మీ కాబోయే భగ్న ప్రేమికుడు.

    ReplyDelete
  7. అతని నిలకడ లేని ప్రేమలాగే, ఆమె జ్ణాపకాలు, ఆశలు కూడ సముద్రపు ఒడ్దున ఇసుక మేడలవలె నిశ్చలత్వం లేనివని, అయినా ఎదురుచూస్తుంది అంటే అది పిచ్చి ప్రేమని భావన.

    ReplyDelete